iDreamPost
android-app
ios-app

Ather నుంచి మరో బడ్జెట్ EV.. ఒక్క ఛార్జ్ తో 160 కిలోమీటర్ల రేంజ్..

Ather Rizta Price And Specifications: ఏథర్ ఎనర్జీ కంపెనీ మరో బడ్జెట్ ఈవీని విడుదల చేసింది. స్టన్నింగ్ లుక్స్ మాత్రమే కాకుండా.. ఫీచర్స్ కూడా అదిరిపోతున్నాయి. ఈవీ మార్కెట్ లో ఇది గేమ్ ఛేంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ather Rizta Price And Specifications: ఏథర్ ఎనర్జీ కంపెనీ మరో బడ్జెట్ ఈవీని విడుదల చేసింది. స్టన్నింగ్ లుక్స్ మాత్రమే కాకుండా.. ఫీచర్స్ కూడా అదిరిపోతున్నాయి. ఈవీ మార్కెట్ లో ఇది గేమ్ ఛేంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ather నుంచి మరో బడ్జెట్ EV.. ఒక్క ఛార్జ్ తో 160 కిలోమీటర్ల రేంజ్..

ఈ రోజుల్లో అందరూ టూవీలర్ అనగానే కచ్చితంగా ఈవీలవైపే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే.. పెట్రోల్ బాదుడు ఉండదు. పైగా మన తరఫున పర్యావరణానికి ఏదో మంచి చేసినట్లు కూడా ఉంటుంది. అదే ఆలోచనతో ఎక్కువ మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఈవీ అనగానే ప్రముఖంగా రెండే కంపెనీల పేర్లు వినిపిస్తాయి. ఒకటి ఓలా, రెండు ఏథర్ కంపెనీలో గుర్తొస్తాయి. ఎందుకంటే ఈవీ మార్కెట్ ని వాళ్లు అంతలా ప్రభావం చేశారు. ఇప్పటికే ఈ కంపెనీల నుంచి ఎన్నో మంచి మంచి మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు ఏథర్ కంపెనీ మరో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది.

ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలానే మోడల్స్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ మరో కొత్త మోడల్ ని తీసుకొచ్చింది. పైగా ఈ మోడల్ బడ్జెట్ లో ఉండటం విశేషం. ఇప్పుడు ఈవీలు అంటే రూ.1.5 లక్షలకు తక్కువ ఉండటం లేదు. కానీ, ఏథర్ ఇప్పుడు రిజ్తా అనే మోడల్ ని కేవలం రూ.1,09,999కే అందిస్తోంది. అయితే ఈ ధర ఎన్ని రోజులు ఉంటుందో చెప్పే పరిస్థితి లేదు. దీనిని ప్రస్తుతం లాంఛింగ్ ఆఫర్ కింద ఈ ధరకు ఈ రిజ్తాని అందిస్తున్నారు. ఈ రిజ్తా మోడల్ కి సంబంధించిన రేటు మాత్రమే కాదు.. ఈవీ లుక్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ వినియోగదారులను టెంప్ట్ చేస్తున్నాయి.

ఈ ఏథర్ రిజ్తా మోడల్ లుక్స్ విషయానికి వస్తే.. స్టన్నింగ్ లుక్స్ తో దీనిని డిజైన్ చేశారు. ఫ్రంట్ ఎండ్ లో లైట్స్, బ్లింకర్స్, హెడ్ లైట్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్స్ కూడా స్లీక్ డిజైన్ తో ఉన్నాయి. కో ప్యాసింజర్ కి బ్యాక్ సపోర్ట్ కూడా వస్తోంది. లుక్స్ వైజ్ గా ఈ బండికి మంచి మార్కులే పడుతున్నాయి. ఇంక సీట్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. 900 ఎంఎం లెంగ్త్ లార్జెస్ట్ సీట్ తో వస్తోంది. టోటల్ గా 2.5 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటుంది. ఇందులో మంచి బూట్ స్పేస్ ఉంది. మీ వస్తువులను చాలా సులభంగా ఈ డిక్కీలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ బండి బూట్ స్పేస్ లోనే ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.

ఇంక ఈ రిజ్తా మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో లార్జ్ డిస్ ప్లే ఉంటుంది. మీకు వచ్చే వాట్సాప్ నోటిఫికేషన్స్ ని కూడా మీరు ట్రాఫిక్ లో ఆగినప్పుడు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో గూగుల్ మ్యాప్స్ ఫీచర్ కూడా ఉంది. కాకపోతే రిజ్తా జెడ్ వేరియంట్లో మాత్రమే ఈ గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఈ రిజ్తా మోడల్ లో స్కిడ్ కంట్రోల్ ఉంటుంది. ఎత్తులో బండి ఆపినప్పుడు ఆటో హోల్డ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంటే బండి కిందకు జారదు. అలాగే ఇందులో కూడా రివర్స్ గేర్, మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రిజ్తా మోడల్ మొత్తం 7 కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇంక ఈ బండి రేంజ్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. మరి.. ఏథర్ రిజ్తా మోడల్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.