Dharani
రేషన్‌కార్డు ఉన్న వారు ప్రతి నెల 5 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. మరి ఇది ఏ పథకం.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
రేషన్‌కార్డు ఉన్న వారు ప్రతి నెల 5 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. మరి ఇది ఏ పథకం.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Dharani
మన దేశ ప్రజలకు ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. అందుకు ముఖ్యమైన ప్రతిపాదిక రేషన్‌కార్డు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార, ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం కూడా రేషన్‌కార్డుదారుల కోసం తెచ్చిందే. అంత్యోదయ యోజన, ఆయుష్మాన్ భారత్, చదువుకునే విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్.. ఇలా ఏది పొందాలన్నా రేషన్‌కార్డే ప్రతిపాదిక. అలానే కొన్ని పెన్షన్ పథకాలకు అర్హులు కావాలన్న.. కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. అలానే ప్రభుత్వం నుంచి ప్రతి నెల 5 రూపాయలు పొందాలన్నా రేషన్ కార్డు కావాలి. ఇంతకు అది ఏ పథకం.. ఎవరు దానికి అర్హులు అంటే.. ఆ వివరాలు..
అసంఘటిత రంగ కార్మికులను దృష్టిలో ఉంచుకుని.. వారికి వృద్ధాప్యంలో పెన్షన్ అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరూ ఈ పథకానికి అర్హులే. కాకపోతే.. దీనికి అప్లై చేయాలంటే.. బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా ఉండాలి. ఈ పథకంలో చేరి రోజుకు 7 రూపాయల చొప్పున నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు 5 వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంది. నెలవారీ రూ.1000 పెన్షన్ పొందాలంటే.. నెలకు 42 చెల్లిస్తే సరిపోతుంది.
భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ చెరో 210 చొప్పున నెలకు 420 రూపాయలు చెల్లిస్తే.. వృద్ధాప్యంలో నెలకు దంపతులిద్దరి పేరు మీద 10 వేలు పెన్షన్ పొందవచ్చు. లబ్ధిదారులు ఇద్దరూ చనిపోతే ఆ మొత్తం.. నామినీకి అందజేస్తారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలని భావించే వారు.. అవసరమైన పత్రాలు తీసుకుని.. జనధన్‌యోజన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి.. దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే పోస్టాఫీసులో కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇక ఈ పథకంలో చేరడానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయసు 40 ఏళ్లుగా నిర్ణయించారు. భారతీయ పౌరులు ఎవరైనా దీనిలో చేరవచ్చు. అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారి అని చెప్పవచ్చు. దీనిలో చేరి.. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా.. వృద్ధాప్యంలో పెన్షన్ పొందగల్గుతారు. ఇది 1000 నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా నెలకు 5 వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు. ఇప్పుడే ఈ పథకానికి అప్లై చేసుకొండి.