Dharani
Atal Pension Yojana: ఉద్యోగం లేకపోయినా సరే.. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు..
Atal Pension Yojana: ఉద్యోగం లేకపోయినా సరే.. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు..
Dharani
పెన్షన్.. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పించే పథకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వయసుపైబడిన వారిని ఆదుకోవడం కోసం పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు అయితే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి అసంఘటిత రంగంలో పని చేసే వారి పరిస్థితి ఏంటి.. ఆ వయసులో వారు పని చేయలేరు.. దీనికి తోడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక భద్రత ఉండదు. మరి అలా ఉద్యోగం లేని వారి పరిస్థితి ఏంటి అంటే.. ఇదుగో ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరితే.. జాబ్ లేకపోయినా సరే.. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు. ఇంతకు అది ఏ పథకం.. దానిలో ఎలా చేరాలంటే..
అసంఘిటత రంగంలో పని చేసే వారు కూడా పెన్షన్ పొందాలంటే.. అలాంటి వారికి ఎంతో అనువైన పథకం.. ‘అటల్ పెన్షన్ యోజన’ స్కీమ్. దీనిలో చేరితే చాలు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు కూడా వృద్ధాప్యంలో పెన్షన్ పొందడానికి వీలవుతుంది. ఇక ఈ పెన్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
వృద్ధాప్యంలో కూడా ఆర్థిక భద్రత పొందాలనుకునేవారికి ఎంతో మేలు చేసే పథకం అటల్ పెన్షన్ యోజన. దీనిలో చేరితే వృద్ధాప్యంలో కచ్చితంగా మీకు పెన్షన్ లభిస్తుంది. ఇంతకు ముందు అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం ‘నేషనల్ పెన్షన్ స్కీమ్’ అందుబాటులో ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఎన్పీఎస్ స్వావలంబన్ స్కీమ్‌ను ఆపేసింది. దీని స్థానంలో ‘అటల్ పెన్షన్ యోజన’ను తీసుకువచ్చింది. మరి ఈ పథకంలో ఎలా చేరాలి.. ఎంత పెన్షన్ వస్తుంది అంటే..
ఈపథకంలో చేరిన చందాదారునికి 60 ఏళ్లు నిండగానే, అతను కట్టిన మొత్తాన్ని బట్టి నెలకు రూ.1000-రూ.5000 వరకు పెన్షన్ లభిస్తుంది. 18 ఏళ్లు నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. అయితే వీరికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి.
పాలసీదారుని వయస్సును, ఎంత పెన్షన్ రావాలి అనే దాన్ని బట్టి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి బతికి ఉన్నంత కాలం అతడికి పెన్షన్ వస్తుంది. ఒక వేళ అతను, ఆమె చనిపోతే, వారి జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం పెన్షన్ వస్తుంది. పాలసీదారు, అతని, ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే, నామినీకి పాలసీ డబ్బులు (పరిహారం) చెల్లిస్తారు. ఇక ఈపథకంలో చేరిన వారికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
మీరు ఇప్పటికే ఎన్పీఎస్ స్వావలంబన్ పథకంలో డబ్బులు కడుతూ ఉంటే.. ఎంతో సులభంగా మీరు అటల్ పెన్షన్ యోజనకు మారవచ్చే. అయితే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న పాలసీదారులకే ఈ సదుపాయం ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వాళ్లు అటల్ పెన్షన్ యోజనకు మారలేరు.. వాళ్లు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలి. వారికి 60 ఏళ్లు పూర్తయిన తరువాత ఎన్పీఎస్ పథకం కింద పెన్షన్ లభిస్తుంది. ఈ రెండూ ప్రభుత్వ పథకాలే కనుక మీకు ఎలాంటి నష్టభయం లేకుండా ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక భద్రతకు భరోసా లభిస్తుంది.