Arjun Suravaram
Atal Pension Yojana: ప్రతి ఒక్కరి ఆర్థిక భరోసా అనేది ముఖ్యంగా. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే కేంద్రం అనేక స్కీమ్ ను ప్రజలకు అందిస్తుంది. అలాంటి వాటిల్లో ఓ సూపర్ స్కీమ్ ఉంది.
Atal Pension Yojana: ప్రతి ఒక్కరి ఆర్థిక భరోసా అనేది ముఖ్యంగా. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే కేంద్రం అనేక స్కీమ్ ను ప్రజలకు అందిస్తుంది. అలాంటి వాటిల్లో ఓ సూపర్ స్కీమ్ ఉంది.
Arjun Suravaram
కేంద్రప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పలు స్కీమ్ లను కేంద్రం ప్రారంభించింది. అలానే కేంద్రం నుంచి ఓ అదిరిపోయే పథకం ఉంది. అందులో కేవలం రోజు 7 రూపాయలు పెటుబడిపెడితే.. 60 ఏళ్లలో మంచి ఆదాయం పొందుతారు. మరి..ఆ పథకం ఏమిటి?, ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో అట్ల పెన్షన్ యోజన్ స్కీమ్ ఒకటి. ఇది ఆర్థికంగా వెనుకబడిన, నెలసరి వేతన కార్మికుల కోసం ఈ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా..నెలవారీగా ఎవరి సామర్థ్యం మేరకు వారు డబ్బులు ఇన్వెస్ట చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అలానే ఎవరైనా ఏళ్ల నాటి నుంచి నెలకు రూ.210 పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే రోజులు 7 రూరపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అయితే 60 ఏళ్లు వచ్చేసరికి ప్రతి నెల రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఎవరైనా 60 ఏళ్ల తరువాత నెలకు 5 వేలు పెన్షన్ పొందాలంటే..18 ఏళ్ల వయస్సు నుంచే ప్రతి నెల రూ.210 చెల్లించాలి. లేకుంటే 3 నెలలకు రూ.626 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 6 నెలలకు ఒకసారి చెల్లిస్తే రూ.1,239 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ నెలకు రూ.1000 పెన్షన్ మాత్రమే పొందాలని అనుకుంటే 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.42 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్ చెల్లించబడుతుంది. దురదృష్టవశాత్తు ఇద్దరూ చనిపోతే, చందాదారుని నామినీకి ఆ పెన్షన్ మొత్తం చెల్లించబడుతుంది. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
ఈ అటల్ పెన్షన్ పథకాన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, పోస్టాఫీసులలో ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఖాతాను తెరవవచ్చు. ఇందుకు బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు తదితరాలను వివరాలు సమర్పరించాల్సి ఉంటుంది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అసంఘటిత రంగంలో పని చేసే వారికి, మరే ఇతర పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టని వారికి ఉత్తమ ఎంపిక అని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.