Dharani
Flight Ticket: తక్కువ ధరకే విమానయానం చేయాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. కేవలం 475లకే విమాన టికెట్ పొందవచ్చు. ఆ వివరాలు..
Flight Ticket: తక్కువ ధరకే విమానయానం చేయాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. కేవలం 475లకే విమాన టికెట్ పొందవచ్చు. ఆ వివరాలు..
Dharani
విమానం ఎక్కాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఆకాశంలో పక్షిలా ఎగరాలని ప్రతి మనసు కోరుకుంటుంది. కానీ మన దేశంలో విమానయానం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చిన్న చిన్న దూరాలకు ప్రయాణించాలన్నా వేలల్లో ఖర్చు చేయాలి. ఇక అప్పుడప్పుడు విమానయాన సంస్థలు ఆఫర్లును ప్రకటిస్తుంటాయి. విమాన టికెట్ల మీద భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తాయి. నాలుగైదు నెలల తర్వాత ప్రయాణం చేయాలంటే.. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే భారీ తగ్గింపు వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఎయిర్ లైన్.. కేవలం 475 రూపాయలకే విమాన టికెట్ ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..
సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా విమానాలను నడపడం ద్వారా ఫ్లైట్ జర్నీని సామాన్యులకు చేరువ చేయ్యాలని చూస్తోంది. ఇందుకోసం రకరకాల పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని విమానయాన సంస్థలు దేశంలోని కొన్ని రూట్‌లలో అతి తక్కువ ధరకే విమానాలను నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలయన్స్ ఎయిర్‌లైన్స్ రూ.475కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అస్సాంలోని లీలాబరి నుంచి తేజ్ పూర్ నగరాల మధ్య కేవలం రూ.475 కే విమాన ప్రయాణ చేసే అవకాశం కల్పిస్తోంది అలయన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ. లీలాబరి నుంచి తేజ్ పూర్ మధ్య దూరం 186 కిలోమీటర్లు. అయితే ఈ టికెట్ బేస్ ఫేర్ రూ.150 మాత్రమే. దీనికి కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌లు కలిపి మరో రూ.325 చెల్లించాలి. దీంతో మొత్తం ఛార్జ్ రూ.475 కే లీలాబరి నుంచి తేజ్‌పూర్ మధ్య అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించవచ్చు.
సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా ఈ అద్భుతమైన స్కీమ్ అమలు చేస్తున్నారు. ఇక విమాన టికెట్ల బుకింగ్‌కు చెందిన ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం అతి తక్కువ ఖర్చుతో మన దేశంలో ప్రయాణించే విమాన రూట్లు దాదాపు 22 ఉన్నాయి. ఈ 22 రూట్లలో కనీస టికెట్ ధర రూ.1000 లోపే ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ మన దగ్గర కాదు. కానీ మీరు తక్కువ ధరలో విమానయానం చేయాలనుకుంటే.. ఆఫర్ ఉన్నప్పుడు టికెట్ బుక్ చేసుకొవచ్చు అంటున్నారు.