iDreamPost
android-app
ios-app

ఈ కార్డు ఉంటే చాలు.. రూ.2 లక్షల బీమా.. నెలకు రూ.3000

  • Published Apr 22, 2024 | 3:48 PM Updated Updated Apr 22, 2024 | 3:48 PM

e Shram Card: అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేం‍ద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-శ్రమ్‌ కార్డును తీసుకొచ్చింది. దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటిల్లో కొన్నింటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ వివరాలు..

e Shram Card: అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేం‍ద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-శ్రమ్‌ కార్డును తీసుకొచ్చింది. దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటిల్లో కొన్నింటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ వివరాలు..

  • Published Apr 22, 2024 | 3:48 PMUpdated Apr 22, 2024 | 3:48 PM
ఈ కార్డు ఉంటే చాలు.. రూ.2 లక్షల బీమా.. నెలకు రూ.3000

కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, కార్మికుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే వీటిలో చాలా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతుంది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో.. అసలు అలాంటి పథకాలు ఉన్నట్లుగా కూడా జనాలకు తెలియదు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు మేం చెప్పబోతున్నాం. దీనిలో చేరితే 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాతో పాటు ప్రతి నెలా 3 వేల రూపాయల వరకు పెన్షన్‌ పొందే అవకాశం కూడా ఉంది. ఇంతకు ఆ పథకం ఏంటి.. దానిలో ఎలా చేరాలి అంటే..

అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ యోజనను అమలు చేసింది. దీనిలో రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఈ-శ్రమ కార్డు అందిస్తోంది. దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసి సామాజిక భద్రత కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడీ ఈ-శ్రమ్‌ కార్డును జారీ చేస్తున్నాయి. ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాలకు మీరు అర్హులు అవుతారు. అప్పుడు బీమా సౌకర్యంతో పాటు ప్రతి నెల పెన్షన్‌ కూడా పొందవచ్చు.

ఈ-శ్రమ్‌ కార్డు..

కేంద్రం శ్రామిక్ కార్డు పేరిట 2021, ఆగస్టులో ఈ పోర్టల్‌ని ప్రారంభించింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఇప్పటి వరకు 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికులు కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అనేక స్కీమ్‌ల ప్రయోజనాలను వారు పొందేందుకు వీలుగా రేషన్ కార్డుతో ఈ-శ్రామ్ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ-శ్రమ్‌ పేరుతో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ కార్మికులకు చాలా సౌకర్యాలను అందిస్తుంది. కార్మికులు ఈశ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే.. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న ఈశ్రమ్‌ కార్డును పొందవచ్చు. మీరు ఈ-శ్రమ్‌ కార్డు పొందాలంటే.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. e-Shram @register.eshram.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. అక్కడ వాళ్లు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది

ఈ-శ్రమ్‌ కార్డుతో ప్రయోజనాలు..

  • మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే, మీరు ఈ-శ్రమ్‌ కార్డు నంబర్ ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంది.
  • ఈ-శ్రమ్ కార్డు కలిగి ఉంటే ప్రభుత్వ తీసుకువచ్చిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
  • ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజీ కూడా అందించబడుతుంది.
  • మీ దగ్గర ఈ‍శ్రమ్‌ కార్డు ఉంటే.. దురదృష్టవశాత్తు మీరు ఏదైనా ప్రమాదానికి గురైతే..
  • పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల వరకు పరిహారం ఇవ్వబడుతుంది.
  • ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు.
  • ఇందులో పెన్షన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.
  • మీకు కనుకు ఈ-శ్రమ్‌ కార్డు ఉంటే.. మీరు నెలకు 1000-3000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు.

ఈ-శ్రమ్‌ కార్డ్ కోసం ఎవరు నమోదు చేసుకోవచ్చు..

లేబులింగ్, ప్యాకింగ్ కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, వలస కార్మికులు, కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు, వడ్రంగి సెరికల్చర్ కార్మికులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, ఆశా కార్మికులు, వీధి వ్యాపారులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పట్టు ఉత్పత్తి కార్మికులు, ఆటో డ్రైవర్లు వార్తాపత్రిక విక్రేతలు, క్షురకులు, మత్స్యకారులు, సా మిల్లు కార్మికులు, చర్మకారుల కార్మికులు, పాస్టోరల్ కార్మికులు, చర్మకారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు సహా 150 కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ-ష్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.