Arjun Suravaram
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తరచూ కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తువులను రిలీజ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తరచూ కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తువులను రిలీజ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికీ మంచి జీతంతో కూడిన ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది. అలానే పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఆ ఉద్యోగాలను చేయాలని ఎన్నో కలలకు కంటారు. అలానే ఎంతో మంది పెద్ద పెద్ద టెక్ సంస్థల్లో, ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. మరోవైపు అప్పుడప్పుడు ఉద్యోగాల కోతలు జరుగుతూ ఉంటాయి. తాజాగా 2024 సంవత్సరంలో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇది ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ లో కూడా భారీగా ఉద్యోగాల కోతలు జరిగింది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెక్ సెక్టార్ లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసింది యాపిల్. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి స్మార్ట్ ఫోన్లను, ఇతర వస్తువులను విడుదల చేస్తుంటుంది. ఈ సంస్థకు ప్రపంచం వ్యాప్తంగా అనేక బ్రాంచ్ లు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు యాపిల్ లో పని చేస్తున్నారు. తాజాగా ఈ దిగ్గజ టెక్ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను రద్దు చేసింది. దీంతో ఆయా ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వారిని ఈ టెక్ సంస్థ తొలగించింది.
ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్’(ఈడీడీ)కు సమర్పించిన రిపోర్టు లో వెల్లడించింది. సిబ్బందిలో మార్పులు చేర్పులకు సంబంధించి ఈ డిపార్టుమెంట్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా యాపిల్ సంస్థ తన రిపోర్టును ఈడీడీకి సమర్పించింది. తాజాగా వెల్లడించిన సమాచారంలో కొత్తతరం స్క్రీన్ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తున్న 87 మంది ఉద్యోగులను తొలగించింది. అలానే స్మార్ట్ కారు ప్రాజెక్టు నుంచి మిగతావారిని తీసేసినట్లు తెలుస్తోంది.
నివేది ప్రకారం.. శాంటా క్లారా, కాలిఫోర్నియాలోని ఆపిల్ ప్రధాన కారు సంబంధిత కార్యాలయంలో 371 మంది ఉద్యోగులు తొలగించబడినట్లు తెలుస్తోంది. అలానే స్మార్ట్‌కారుపై పనిచేస్తున్నవారిలో కొంతమంది ఉద్యోగులను కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేశారు. కొత్తతర సాంకేతిక ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు యాపిల్ ప్లాన్ లు వేసింది. అందులో భాగంగానే స్మార్ట్ కారు, డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అయితే భారీ ఖర్చులతో పాటు వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. ముఖ్యంగా డిస్‌ప్లే ప్రాజెక్టు విషయంలో ఇంజినీరింగ్, సప్లయ్ వంటి సమస్యలూ తలెత్తినట్లు సమాచారం. ఉద్యోగాల కోత వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను తెలిపేందుకు ఆపిల్ ప్రతినిధి నిరాకరించినట్లు తెలుస్తోంది.