iDreamPost

ఏపీలో మరో శంషాబాద్.. ఇక్కడ స్థలం కొంటే 3 ఏళ్లలో లక్షల్లో లాభాలు!

ఏపీలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి.. తక్కువ రేటు స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి.. తక్కువ రేటు స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో మరో శంషాబాద్.. ఇక్కడ స్థలం కొంటే 3 ఏళ్లలో లక్షల్లో లాభాలు!

భోగాపురం చుట్టూ ఉన్న విశాఖపట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్.. హైదరాబాద్ లోని శంషాబాద్ లా బూమ్ ని చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అనేది శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఉన్నందున తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హాట్ స్పాట్ గా ఉంటుంది. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. తొలిదశలో 60 లక్షల ప్రయాణికులని హ్యాండిల్ చేసేలా నిర్మాణాన్ని చేపట్టారు. వైజాగ్ నుంచి 45 కి.మీ. దూరంలో ఉంది. రెండు, మూడేళ్లలో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అదే జరిగితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంటుంది. మరోవైపు వైజాగ్ నుంచి భోగాపురం కనెక్ట్ చేసేలా 6 లేన్ల ఎక్స్ ప్రెస్ వే వస్తుంది. దీని కోసం 6500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హైదరాబాద్ లో శంషాబాద్ లా భోగాపురం కూడా బాగా డెవలప్ అవుతుందని.. స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని అంటున్నారు. 

ఎందుకు పెట్టుబడి పెట్టాలి?:

వ్యూహాత్మక లొకేషన్:

భోగాపురం వైజాగ్ కి దగ్గరలో ఉన్న ప్రధాన కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ హబ్ గా ఉంది. ఇది పోర్ట్స్, షిప్పింగ్ రూట్స్ కి అనుకూలంగా ఉంది. వాణిజ్యం, లాజిస్టిక్స్ లో వ్యాపారానికి భోగాపురం ఐడియల్ లొకేషన్ గా ఉంది. 

ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్:

ప్రస్తుతం ఇక్కడ భోగాపురం విమానాశ్రయం సహా ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలకు ఇది మేజర్ హబ్ గా మారనుంది. దీని వల్ల స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి.

ఆర్థిక వ్యవస్థ:

ప్రస్తుతం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టింది. ఈ గ్రోత్ అనేది వ్యాపారాలకు, పెట్టుబడులకు, భోగాపురంలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది.  

 అందుబాటులో రియల్ ఎస్టేట్:

ప్రస్తుతం ఇక్కడ స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయి. కమర్షియల్ గా, రెసిడెన్షియల్ గా భోగాపురం అనేది ఉత్తమ ఎంపికగా ఉంది. రేట్లు తక్కువగా ఉన్న కారణంగా తక్కువ రేటుకే ప్రాపర్టీని సొంతం చేసుకుని ఫ్యూచర్ లో ల్యాండ్ అప్రిసియేషన్ వస్తే లాభం పొందవచ్చునని చూస్తున్నారు.  

ధరలు:

ప్రస్తుతం భోగాపురంలో చదరపు అడుగు స్థలం రూ. 1650గా ఉంది. గజం యావరేజ్ గా రూ. 14,850 పడుతుంది. ఇక్కడ 14 వేల నుంచి 25 వేల రేంజ్ లో గజం స్థలం పలుకుతుంది. 100 గజాల స్థలం కొనాలంటే 15 లక్షల నుంచి 25 లక్షలు అవుతుంది. ఇప్పుడు కొంటే కనుక మూడేళ్ళలో లక్షల్లో లాభం పొందవచ్చు. 

భోగాపురంలో హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, మర్కెట్స్ వంటివి ఉన్నాయి. భోగాపురంలో పెట్టుబడి పెట్టడం వల్ల మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సెంటర్ లో ఉంది. అలానే పైడి భీమవరం సెజ్ కి దగ్గరలో ఉండడం వల్ల సెజ్ లో పని చేసే వారికి ఈ ఏరియా గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి