iDreamPost
android-app
ios-app

అనిల్ అంబానీకి భారీ షాకిచ్చిన సెబీ! ఐదేళ్లు నిషేధం..!

Anil Ambani, SEBI: ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. సెబీ ఆయనపై కీలక చర్యలు తీసుకుంది. కంపెనీ నుంచి నిధులను మళ్లీంచారనే ఆరోపణలతో సెబీ ఆయనపై చర్యలు తీసుకుంది.

Anil Ambani, SEBI: ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. సెబీ ఆయనపై కీలక చర్యలు తీసుకుంది. కంపెనీ నుంచి నిధులను మళ్లీంచారనే ఆరోపణలతో సెబీ ఆయనపై చర్యలు తీసుకుంది.

అనిల్ అంబానీకి  భారీ షాకిచ్చిన సెబీ! ఐదేళ్లు నిషేధం..!

రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. వ్యాపార అంశాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి ముఖేశ్ అంబానీ పరిచయమే. అలానే వారి కుటుంబ సభ్యులు కూడా అందరికీ సుపరిచమే. వ్యాపార రంగంలో కుబేరుడిగా మారారు ముఖేస్ అంబానీ. అయితే అతని సోదరుడు అనిల్ అంబానీ పరిస్థితి మాత్రం ఆయనకు పూర్తి భిన్నంగా మారిపోయింది. వ్యాపార రంగంలో తీవ్ర నష్టాలతో అనిల్ అంబానీ ఉన్నాడు. ఇప్పటికే మార్కెట్ రంగంలో ఆయనకు భారీగా ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా అనిల్ అంబానీ సెబీ భారీ షాకిచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంది. కంపెనీ నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలపై అనిల్ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా విధించింది. అంతేకాక అనిల్ అంబానీ సంస్థలపై మార్కెట్ లో ఐదేళ్ల పాటు నిషేధం విధించినట్లు సమాచారం. అనిల్ అంబానీతో పాటు పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ  ఈ కఠిన చర్యలు తీసుకుంది. వీరితో పాటు మరో 24 సంస్థలపై కూడా ఐదేళ్ల నిషేధాన్నిసెబీ విధించింది.  అనిల్ అంబానీకి సెబీ రూ.25 కోట్ల  జరిమానా తో పాటు  ఏ జాబితా కంపెనీలోనైనా డైరెక్టర్ లేదా కీ మేనేజిరియల్ పర్సన్ (కేఎంపీ) లేదా మార్కెట్ రెగ్యులేటర్ వద్ద నమోదైన మధ్యవర్తి పొజీషన్​ సహా సెక్యూరిటీస్ మార్కెట్​ తో 5 ఏళ్ల పాటు సంబంధం కలిగి ఉండకుండా సెబీ తేల్చిచెప్పింది.

ఈ ఐదేళ్లు సెక్యూరిటీ మార్కెట్ కు ఆయన దూరంగా ఉండాలి. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉన్న , అనుబంధం ఉన్న కంపెనీలతోనూ లావాదేవీలను చేయకూదని ఆంక్షలు విధించింది. ఇక సెబీ తీసుకున్న నిర్ణయంతో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. 25 పైసలు నష్టపోయి..రూ.4.5 వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనీల్ అంబానీకి సెబీ తీసుకున్న నిర్ణయం మరింత రిస్క్ లో పడేస్తుందని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. అనిల్ అంబానీ విషయంలో సెబీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.