iDreamPost
android-app
ios-app

Radhika Merchant: అంబానీ కోడలంటే ఆమాత్రం ఉంటుంది.. ఒక్క డ్రెస్‌ ఖరీదు రూ.1002 కోట్లు

  • Published Jun 22, 2024 | 2:49 PMUpdated Jun 22, 2024 | 2:49 PM

Anant Ambani Wedding: ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ఇటలీలో రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించారు. దీని కోసం రాధికా మర్చంట్‌ ధరించిన దుస్తులు, నగల విలువ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఆ వివరాలు..

Anant Ambani Wedding: ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ఇటలీలో రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించారు. దీని కోసం రాధికా మర్చంట్‌ ధరించిన దుస్తులు, నగల విలువ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 2:49 PMUpdated Jun 22, 2024 | 2:49 PM
Radhika Merchant: అంబానీ కోడలంటే ఆమాత్రం ఉంటుంది.. ఒక్క డ్రెస్‌ ఖరీదు రూ.1002 కోట్లు

ఆసియా కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. ఈ ఏడాది జూన్‌ 29న వీరి వివాహ వేడుకలు అంబానీ ముంబై నివాసం యాంటిలియాలో ప్రాంరభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఇక జూన్‌ 29న యాంటిలియాలో పూజా కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు మొదలవుతాయి. ఇక 2023లో అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌, జామ్‌ నగర్‌లో నిర్వహించిన తొలి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు ప్రపంచ ప్రముఖులు అతిథిలుగా హాజరయ్యారు. ఇక పెళ్లికి వచ్చే గెస్ట్‌ల సంఖ్య మరింత పెరగనుందట. ఇక జూలై 12న వివాహం జరగనుందట.

ఇక ఇటీవల ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌లో రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించారు. ఈ బాష్‌లో రాధిక మర్చంట్‌ ధరించిన దుస్తులు, నగలు వాటి ఖరీదు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. రిలయన్స్‌ వ్యాపార వారసుడు అనంత్‌ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్‌ స్టయిల్‌తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది రాధిక. రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ ‘లా వీటా ఇ అన్ వియాజియో’ (జీవితం ఒక ప్రయాణం)లో తనదైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో ప్రతీ ఈవెంట్‌ ఆమె ధరించిన డ్రెస్‌, ఆభరణాలు.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్‌ పేజీలు అందించిన రాధికా మర్చంట్‌ డ్రెస్‌, ఆమె ధరించిన ఆభరణాల విలువ నెట్టింట వైరల్‌గా మారాయి.

One dress costs 1002 crores

మరీ ముఖ్యంగా ఈ వేడుకలో రాధికా మర్చంట్ ధరించిన ఓ డ్రెస్‌ ఖరీదు నెట్టింట వైరల్‌గా మారింది. రాధికా మర్చంట్‌.. తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్‌, డైమండ్ ఆభరణాలతో రాయల్‌లుక్‌లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్‌కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు, క్రిస్టల్‌తో చేసిన గులాబీలు డ్రెస్‌ మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్‌ ధర రూ. 1002కోట్లు అని టాక్‌. అలానే ఈ క్రూయిజ్ బాష్‌లో నిర్వహించిన మరో ఈవెంట్‌లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్‌కఫ్‌లు, లావెండర్ డ్రెస్‌, మొత్తం లుక్‌ ఖర్చు రూ. 896 కోట్లు అని తెలుస్తోంది. ఇక రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్‌, బంగారు ఆభరణాలతో డైమండ్‌ నగలు, బ్యాంగిల్స్, వాచ్‌తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు అని సమాచారం.

ఇక అనంత్‌ రాధికపై తన ప్రేమంతా కురిపించిన లవ్‌లెటర్‌తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. దీని మీదకు లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో దేవ కన్యలా మెరిసిపోయింది. ఈమొత్తం లుక్‌ ఖర్చు రూ. 478 కోట్లు. ఇదే కాక పాతకాలపు డియోర్ డ్రెస్‌.. దానికి మ్యాచింగ్‌గా ధరించిన ఆభరణాలతో కలుపుకుని ఆ లుక్‌ విలువ రూ. 26 లక్షలు కాగా అని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటే పోతో ఈ లిస్ట్‌ చాలా పెద్దది అవుతుంది అంటున్నారు. ఈ రెండు ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో కోట్ల రూపాయల లుక్‌తో.. అంబానీ కాబోయో కోడలు రాధికా మర్చంట్‌ అందంగా మెరిసిపోయింది. ఇక ఈ వార్త చదివిన వారు.. అంబానీ కోడలు అంటే ఆమాత్రం ఉంటుందిలే.. బట్టల ఖరీదే.. ఇన్ని కోట్లా.. వామ్మో.. అంటున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి