Dharani
Anant Ambani Wedding-QR Code, Colour Coded Wristbands: అంబానీ ఇంట పెళ్లికి హాజరైన సెలబ్రిటీల చేతికి రంగరంగుల బ్యాండ్స్ కనిపించడంతో ఆ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Anant Ambani Wedding-QR Code, Colour Coded Wristbands: అంబానీ ఇంట పెళ్లికి హాజరైన సెలబ్రిటీల చేతికి రంగరంగుల బ్యాండ్స్ కనిపించడంతో ఆ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Dharani
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి ఎంత చిన్న శుభకార్యమైనా సరే.. అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాంటిది ఇక పెళ్లి లాంటి వేడుక అయితే.. ఆ హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇలానే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మన దేశం నుంచే కాక విదేశాల నుంచి సైతం సెలబ్రిటీలు హాజరయ్యారు. మన దగ్గర టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు.. ఈపెళ్లిలో సందడి చేశారు. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంతా పీటలు పరిచి.. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించారు అంబానీ దంపతులు. ఇక పెళ్లికి తరలి వచ్చిన వారికి కనీవిని ఎరుగని రీతిలో బహుమతులిచ్చి.. ఆశ్చర్యపరిచారు. ఇక గత వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా అంబానీ పెళ్లి వార్తలు, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన సెలబ్రిటీల చేతికి.. రంగురంగుల బ్యాండ్స్ ధరించి ఉండటం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలీ బ్యాండ్స్ ఏంటి.. ఎందుకు వేసుకున్నారు.. వంటి ఆసక్తికర వివరాలు మీకోసం.. అంబానీ తన కొడుకు పెళ్లి ఎంత ఘనంగా నిర్వహించాడో.. అందుకు రెట్టింపు స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత కూడా నిర్వహించాడు. ఎందుకంటే అదేం.. ఆషామాషీ పెళ్లి కాదు. అంబానీ కొడుకు వివాహం.. కోసం మన దగ్గర నుంచే కాక విదేశాల నుంచి సైతం సెలబ్రిటీలు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. ఎందరో రాజకీయ నాయకులు ఈ పెళ్లికి హాజరయ్యారు. మరి వారందరికి భద్రత కల్పించడం అంటే మాటలు కాదు. ఏ చిన్న తేడా జరిగినా.. పెద్ద ఎత్తున విమర్శలతో పాటుగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కనుకే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. అందుకు తగ్గట్టుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు ముఖేష్ అంబానీ.
వివాహానికి ఆహ్వానించడం కోసం మూడు రకాల ఇన్విటేషన్లు రెడీ చేపించింది అంబానీ కుటుంబం. ఆ తర్వాత పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యను కూడా ముందుగానే తెలుసుకున్నారు. ఆహ్వానం అందిన ప్రతి సెలబ్రిటీ దగ్గర నుంచి వారు వివాహానికి హజరవుతున్నారా.. లేదా అన్న విషయం తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా వారి పర్సనల్ ఫోన్ నెంబర్, మెయిల్‌కు ఒక క్యూఆర్ కోడ్ పంపారు. అది చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు. పెళ్లి సందర్భంగా రకరకాల కార్యక్రమాలు, అనేక రకాల విందులు ఏర్పాటు చేశారు. వాటిని జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు ఒక్కో కలర్ కేటాయించారు.
ఇక పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఒక్కో రంగు కలర్ రిస్ట్ బ్యాండ్ కేటాయిస్తూ.. వారికి ట్యాగ్ చేశారు. దీని ఆధారంగా సదరు సెలబ్రిటీలు ఆయా జోన్లలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనుమతి ఉంటుంది. అలానే సిబ్బంది కోసం ఒక రంగు రిస్ట్ బ్యాండ్ కేటాయించారు. ఇక ఇంత మంది సెలబ్రిటీలు తరలి వస్తున్న నేపథ్యంలో వారిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అత్యవసరంగా చికిత్స అందించడం కోసం అవసరైమన వైద్య, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
పెళ్లికి విచ్చేసిన దేశవిదేశాల అతిథులకు డ్రెస్ కోడ్‌పెట్టారు. ప్రతి ఒక్కరు భారతీయ సాంప్రదాయం ఉట్టిపడే దుస్తులు ధరించాలని ముందుగానే కోరారు. దీనిలో భాగంగానే సామ్‌సంగ్ హెడ్, నిక్ జోనాస్ వంటి సెలబ్రిటీలు షేర్వానీలో మెరిశారు. ఇక వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులే కాకుండా.. ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు కూడా హాజరయ్యారు. ఇక వివాహానికి హాజరు కానీ ప్రముఖుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ దంపతులు ఉన్నారు.
ఇక పెళ్లికి ముందు రెండు ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇక పెళ్లికి హాజరైన అతిథులుకు ముంబైలోని టాప్ 10 హోటల్లలో విడిది, బస ఏర్పాటు చేశారు. మొత్తం కొడుకు పెళ్లి కోసం ముఖేష్ అంబానీ 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంత భారీ ఏర్పాట్లు చేయాలంటే ఆ మాత్రం ఖర్చు తప్పదు అంటున్నారు.