Dharani
Anant-Radhika Wedding, Nita Mehndi Design: కొడుకు పెళ్లి సందర్భంగా నీతా అంబానీ చేతిపై ఎర్రగా పండిన మెహందీ డిజైన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఆ వివరాలు..
Anant-Radhika Wedding, Nita Mehndi Design: కొడుకు పెళ్లి సందర్భంగా నీతా అంబానీ చేతిపై ఎర్రగా పండిన మెహందీ డిజైన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఆ వివరాలు..
Dharani
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంతా పీటలు పరిచి.. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి రాగా.. వేద మంత్రోచ్ఛరణల మధ్య.. మంగళవాయిద్యాల నడుమ.. ఏడడుగల బంధంలోకి అడుగుపెట్టారు కొత్త దంపతులు. జూలై 12 అనగా శుక్రవారం నాడు ఎంతో ఘనంగా అనంత్ అంబానీ-రాధికల పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మన దేశం నుంచి సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు తరలి వచ్చారు. అత్యంత ఖరీదైన దుస్తులు, ఆభరణాల్లో.. రాకుమారిలా మెరిసి పోయింది పెళ్లి కుమార్తె రాధికా మర్చంట్. వివాహం సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దాంతో పాటు నీతా అంబానీ అరచేతిలో ఉన్న మెహందీ డిజైన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ వివరాలు..
కొడుకు వివాహం సందర్భంగా నీతా అంబానీ అర చేతుల్లో ఎర్రగా పండిన మెహందీ డిజైన్.. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబం మొత్తాన్ని తన అర చేతిలో ముద్రించుకుంది. లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి యాజమానురాలైనా సరే.. కుటుంబం విషయానికి వస్తే.. సగటు ఇల్లాలు, తల్లిలానే ఆలోచిస్తారు నీతా అంబానీ. ఆమెకు కుటుంబమే సర్వస్వం. భర్త, పిల్లలు, మనవళ్లు అంటే ప్రాణం. ఈ క్రమంలో కొడుకు పెళ్లి సందర్భంగా తన అర చేతిలో.. కుటుంబం మొత్తాన్ని డిజైన్‌గా ముద్రించుకుంది. మరి ఆ డిజైన్ వెనక అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
నీతా అంబానీ తన అరచేతిపై రాధా-కృష్ణులను బొమ్మలను వేయించుకుంది. రాధా-కృష్ణుల ప్రతిరూపమే.. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్. ఇక ఆమె చేతి వెనుక వైపు కుటుంబ సభ్యులను గుర్తు చేసేలా మరో మెహందీ డిజైన్ వేయించుకుంది. ఈ డిజైన్ ద్వారా నీతా అంబానీ.. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటడంతో పాటు.. కుటుంబం అంటే ఆమెకు ఎంత ఇష్టమో చెబుతోంది. ఈ డిజైన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కుటుంబంపై నీతా అంబానీకి గల ప్రేమకు సాక్షమే ఈ డిజైన్ అని అంటున్నారు.
ఇక భారతీయ వివాహ వ్యవస్థలో.. మెహెందీ సంప్రదాయం శతాబ్దాలుగా వస్తోంది. ఇది ఆనందం, అందం, కొత్త ప్రయాణం శుభ ప్రారంభానికి ప్రతీక. మెహందీ సౌందర్యపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక, భావోద్వేగ విలువలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేదికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.
ఆకాశమంత పందిరి వేసి.. దాని చుట్టూ కళ్లు జిగేలు మనేలా లైట్లను అలంకరించారు. పెళ్లి వేదిక చుట్టూ కూర్చొని విహహాన్ని వీక్షించేలా పెళ్లి మండపాన్ని డిజైన్ చేశారు. ఇక రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే కనిపిస్తాయో.. పెళ్లి వేదికపై కూడా అలానే కనిపించేలా డిజైన్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాత్రి పూట చుక్కలతో మెరిసిపోయే నింగిని.. పట్టపగలే.. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోకి తీసుకువచ్చారు. ఇక ఈ పెళ్లి, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.