iDreamPost
android-app
ios-app

పెద్దల కోసం బెస్ట్ EV.. అతి తక్కువ ధరకే.. సింగిల్ ఛార్జ్ తో 70KM రేంజ్

Ampere Reo Li Plus EV: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం యో ఎడ్జ్ కంపెనీ ఆంపియర్ రియో లీ ప్లస్ ఈవీని లాంఛ్ చేసింది.సింగిల్ ఛార్జ్ తో 70KM రేంజ్ ని ఇస్తుంది.

Ampere Reo Li Plus EV: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం యో ఎడ్జ్ కంపెనీ ఆంపియర్ రియో లీ ప్లస్ ఈవీని లాంఛ్ చేసింది.సింగిల్ ఛార్జ్ తో 70KM రేంజ్ ని ఇస్తుంది.

పెద్దల కోసం బెస్ట్ EV.. అతి తక్కువ ధరకే.. సింగిల్ ఛార్జ్ తో 70KM రేంజ్

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తక్కువ ప్రయాణ ఖర్చు, మంచి మైలేజీ ఇస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. మహిళలకు, పెద్దవాళ్లకు డ్రైవ్ చేసేందుకు ఈజీగా ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే పెద్ద వాళ్ల కోసం క్రేజీ ఫీచర్లతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. యో ఎడ్జ్ కంపెనీ ఆంపియర్ రియో లీ ప్లస్ ఈవీని లాంఛ్ చేసింది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 66,719లు మాత్రమే.

యో ఎడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ స్పీడుతో వెళ్తుంది. కాబట్టి ఈ స్కూటర్ ను నడిపేందుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది గంటకు 25 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 70 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 నుంచి 6 గంటల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. దీని లోడింగ్ కెపాసిటీ 120 కేజీలు. స్ట్రాంగ్ బాడీతో సరికొత్త డిజైన్ లో ఈవీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది.

ఇగ్నీషన్ స్విచ్, ఇతర సేఫ్టీ ఫీచర్లు అందించారు. ఇందులో మెకానికల్ డ్రమ్ బ్రేకులను అందించారు. ఇందులో శక్తివంతమైన లిథియం అయాన్ 1.3కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ఉంది. ఆంపియర్ రియో లీ ప్లస్ ఈవీ నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది. రెడ్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో ఆప్షన్లలో లభిస్తుంది. అన్ని రకాల రోడ్లపై ఈజీగా దూసుకెల్తుంది. లాంగ్ లెగ్ రూమ్ అందించారు. తక్కువ స్పీడుతో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి మహిళలకు, కాలేజ్ స్కూడెంట్స్ కు, పెద్ద వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఆంపియర్ రియో లీ ప్లస్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి