iDreamPost
android-app
ios-app

TCSకు భారీ షాక్.. ఏకంగా 1600 కోట్ల జరిమానా! ఎందుకంటే?

  • Published Jun 15, 2024 | 10:15 PM Updated Updated Jun 15, 2024 | 10:15 PM

1600 Cr Fine For TCS: టీసీఎస్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఏకంగా 1600 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు టీసీఎస్ కంపెనీ మీద కేసు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? పూర్తి వివరాలు మీ కోసం.

1600 Cr Fine For TCS: టీసీఎస్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఏకంగా 1600 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు టీసీఎస్ కంపెనీ మీద కేసు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? పూర్తి వివరాలు మీ కోసం.

  • Published Jun 15, 2024 | 10:15 PMUpdated Jun 15, 2024 | 10:15 PM
TCSకు భారీ షాక్.. ఏకంగా 1600 కోట్ల జరిమానా! ఎందుకంటే?

రతన్ టాటాకు, ఆయన కంపెనీ టాటా గ్రూప్ కి ఎంతో పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను, క్లయింట్ లకు క్వాలిటీ ప్రాజెక్టులను అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి టాటా కంపెనీ అనుబంధ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై కేసు వేశారు. ఈ కేసులో టీసీఎస్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఏకంగా 1600 కోట్ల ఫైన్ చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీకి అమెరికా కోర్టు షాకిచ్చింది. వ్యాపార రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో 1600 కోట్లు పెనాల్టీ విధిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ కంపెనీ బయటపెట్టిందని ప్రస్తుతం డీఎక్స్ సీగా పిలవబడుతున్న ఒకప్పటి కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ సంస్థ కేసు వేసింది.

ఈ కేసును విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు టీసీఎస్ కి ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. 194.2 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని టీసీఎస్ సంస్థ తన ఎక్స్ ఛేంజి ఫైలింగ్ లో వెల్లడించింది. కోర్టు నుంచి ఉత్తర్వులను జూన్ 14న అందుకున్నామని తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని టీసీఎస్ సంస్థ వెల్లడించింది. చట్టపరమైన సవాళ్ళను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నామని తెలిపింది. తమవైపు కూడా బలమైన వాదనలు ఉన్నాయని.. ఈ తీర్పును సవాల్ చేసేందుకు టీసీఎస్ కంపెనీ సిద్ధమైంది. రివ్యూ పిటిషన్ లేదా అప్పీల్ కి వెళ్లాలని కంపెనీ భావిస్తోంది.

ఇదిలా ఉంటే పలువురు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఇప్పటి వరకూ ఆఫీసులకు పిలవలేదని విప్రో, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, జెన్సర్, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. గత రెండేళ్ల కాలంలో ఈ కంపెనీలో 10 వేల మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చినా గానీ ఇంకా వాళ్ళని రిక్రూట్ చేసుకోలేదని ఐటీ ఎంప్లాయిస్ యూనియన్.. నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ వెల్లడించింది. ఆర్థిక మందగమనంతో పాటు అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను కంపెనీల్లోకి తీసుకోలేకపోతున్నామని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వ్యయాలు తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు కంపెనీలు వివరించాయి.