Tirupathi Rao
Amazon Bazaar live Now: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈసారి ఎలాంటి వస్తువునైనా రూ.600ల లోపే అందించేలా ప్లాన్ చేసింది. అమెజాన్ బజార్ పేరిట సర్వీసెస్ స్టార్ట్ చేసింది.
Amazon Bazaar live Now: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈసారి ఎలాంటి వస్తువునైనా రూ.600ల లోపే అందించేలా ప్లాన్ చేసింది. అమెజాన్ బజార్ పేరిట సర్వీసెస్ స్టార్ట్ చేసింది.
Tirupathi Rao
ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గుండుపిన్ను నుంచి ఎయిర్ కండిషనర్ దాకా అన్ని వస్తువులు ఆన్ లైన్ లోనే దొరుకుతున్నాయి. బయట కంటే ఆన్ లైన్ లో అయితే మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. అందుకే ఇ-కామర్స్ సైట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త సైట్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఎన్ని సైట్స్ పుట్టుకొచ్చినా అమెజాన్ కు మాత్రం వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అమెజాన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే కొన్నాళ్ల నుంచి మీషో, ఫ్లిప్ కార్ట్ హవా పెరిగినట్లు అయ్యింది. అందుకే ఇప్పుడు వాటికి చెక్ పెట్టేందుకు అమెజాన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది అటున్నారు. ఏ వస్తువైనా రూ.600లోపు ఉండేలా బజార్ పేరిట అమెజాన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.
ఇ-కామర్స్ వ్యాపార దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం అన్ బ్రాండెడ్, ధర తక్కువ ఉండే వస్తువులు విక్రయించేదుకు కొత్తగా ‘Bazaar’ని ప్రారంభించింది. ఈ బజార్ లో మీకు కావాల్సిన ఫ్యాషనబుల్ దుస్తులు, కిచెన్ సామాగ్రి, గృహోపకరణాలు, హోమ్ డెకారేషన్ వస్తువులు, ఫుట్ వేర్, వాచెస్ వంటి అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఈ అమెజాన్ బజార్ తీసుకురావడం వెనుక వాళ్ల ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించారు. చాలా తక్కువ ధరకే వినియోగదారులకు కావాల్సిన వస్తువులు తీసుకురావాలి అని చెప్పుకొచ్చారు.
వినియోగదారులకు తక్కువ ధరలో వస్తువులు అదించేందుకు.. దేశం నలుమూలల ఉన్న మ్యానుఫాక్టరింగ్ యూనిట్స్ నుంచి నేరుగా సేల్లర్స్ తమ ఉత్పత్తులను అమెజాన్ బజార్ లో విక్రయించవచ్చు. ఇందుకోసం వారి నుంచి అమెజాన్ ఎలాంటి ఛార్జెస్ ని కూడా వసూలు చేయడం లేదు. కాకపోతే వినియోగదారులకు డెలివరీకి మాత్రం కాస్త సమయం తీసుకుంటోంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్ కు వన్ డేలో కూడా డెలివరీ చేస్తున్నారు. కానీ, ఈ బజార్ లో విక్రయించే అన్ బ్రాండెడ్ వస్తువుల విషయంలో మాత్రం డెలివరీకి 4 నుంచి 5 రోజుల సమయం తీసుకుంటున్నారు.
మీకు కావాల్సిన టీషర్ట్స్, చొక్కాలు, కుర్తాలు, చీరలు, డోర్ కర్టన్స్, బెడ్ షీట్స్, హ్యాండ్ బ్యాగులు కూడా ఈ అమెజాన్ బజార్ లో మీకు దొరుకుతాయి. అది కూడా రూ.600లోపు ధరలోనే. కాకపోతే అన్ బ్రాండెడ్ అనే ఒక పదం వినియోగదారులను ఆలోచన పడేసే ఆస్కారం ఉంది. కానీ, వాటి క్వాలిటీ విషయంలో అమెజాన్ భరోసా ఇస్తే బజార్ వ్యాపారం సూపర్ సక్సెస్ అవ్వడం గ్యారెంటీ. ఈ బజార్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది.. మీషో, ఫ్లిప్ కార్ట్ వంటి పోటీదారులకు చెక్ పెట్టడానికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అమెజాన్ తీసుకొచ్చిన ఈ బజార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.