7 లక్షలకే 7 సీటర్.. మిడిల్ క్లాస్ ప్రీమియం కారు ఇది!

ఇప్పుడు అందరూ కారు కొనాలి అనుకుంటున్నారు. కాకపోతే ఏ కారు కొనాలి అనే అవగాహన మాత్రం ఉండటం లేదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో ఒక బెస్ట్ బడ్జెట్ మల్టీ యుటిలిటీ కార్ గురించి వివరించాం.

ఇప్పుడు అందరూ కారు కొనాలి అనుకుంటున్నారు. కాకపోతే ఏ కారు కొనాలి అనే అవగాహన మాత్రం ఉండటం లేదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో ఒక బెస్ట్ బడ్జెట్ మల్టీ యుటిలిటీ కార్ గురించి వివరించాం.

మధ్యతరగతి వాళ్లు కారు కొనాలి అనే ఆలోచన రావడమే గొప్ప అని చాలామంది ఫీలవుతూ ఉంటారు. ఒకవేళ కొనాలి అనుకుంటే బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటారు. అయితే మినీ, హ్యాట్చ్ బ్యాక్ కొంటే చాలులే అనుకుంటారు. కానీ.. సెడాన్, SUV వంటి ఆలోచన కూడా చేయరు. కానీ, ఇప్పుడు మిడిలిక్లాస్ వాళ్ల కోసం ఒక ఎంయూవీ(మల్టీ యుటిలీటీ వెహికిల్) కారు అందుబాటులో ఉంది. నిజానికి ఈ కారు వచ్చి నాలుగేళ్లు అవుతోంది. కానీ, చాలా తక్కువ మందికి ఈ కారు గురించి తెలుసు. 6 ఇంజిన్ తో 2023 అప్ డేటెడ్ వర్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఆ కారు విశేషాలు ఏంటి? ఎందుకు అది మిడిల్ క్లాస్ వాళ్లకు ప్రీమియం కారు అవుతుంది? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ఈ కారు మరేదో కాదు.. రెనాల్ట్ ట్రైబర్. రెనాల్ట్ కంపెనీ నుంచి భారత్ లో క్లిక్ అయిన మోడల్స్, బాగా అమ్ముడవుతున్న మోడల్స్ ఏవైనా ఉన్నాయంటే అవి రెనాల్ట్ ట్రైబర్, కిగర్, క్విడ్ అనే చెప్పాలి. ఈ మూడూ మోడల్స్ మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో బడ్జెట్ లోనే ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా రెనాల్ట్ ట్రైబర్ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కారు ఆన్ రోడ్ ధర రూ.7.61 లక్షల నుంచే ప్రారంభం అవుతోంది. ఈ కారులో మొత్తం 10 వేరియంట్స్ ఉన్నాయి. దీనిలో టాప్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ లో రూ.10.72 లక్షలుగా ఉంది. ఇందులో కేవలం పెట్రోల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ టాన్సిమిషన్స్ ఉన్నాయి. ఈ 7 సీటర్ కారు 999 సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఇంక మైలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ ట్రైబర్ కారు మీకు లీటరుకు 19 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఇంక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కుటుంబానికి ఇది చాలా సేఫెస్ట్ కార్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అంటే భద్రత పరంగా సురక్షితమైన కారు అనే చెప్పాలి. ఈ కారు ఇంటీరియర్ కూడా మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో ఎక్కడా కూడా స్పేస్ వేస్ట్ కాకుండా కారు డిజైన్ చేశారు. పైగా అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎంయూవీ ఇది. ఈ కారు 3 రోస్ లో కూడా సౌకర్యవంతమైన లెగ్ రూమ్ ఉంటుంది. 3 రోస్ లో కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. డాష్ బోర్డ్ కూడా ఎంతో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. 8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. డాష్ బోర్డ్ లో మీకు డ్యూయల్ స్టోరేజ్ లభిస్తుంది. అలాగే వన్ టచ్ స్టార్ట్/స్టాప్ బటన్ ఉంటుంది. ఇందులో ఇంకో ప్రత్యేకత ఎంటంటే కూలింగ్ స్టోరేజ్ లభిస్తుంది. దానికి ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ కూడా ఉంది.

అలాగే సెకండ్ రో కోసం ఏసీ వెంట్స్ ని సైడ్ పిల్లర్స్ కు అమర్చారు. అలా చేయడం వల్ల సెకండ్ రోలో ఉండే ప్రయాణికులకు చక్కగా ఏసీ తగులుతుంది. లాస్ట్ రోలో కూడా కంఫర్టబుల్ గా ఇద్దరు కూర్చోవచ్చు. అయితే ఇందులో మీకు 48 లీటర్ బూట్ స్పేస్ మాత్రమే లభిస్తుంది. అంటే దాదాపుగా బూట్ స్పేస్ లేనట్లే అని చెప్పాలి. అయితే మీరు థార్డ్ రో రిమూవ్ చేస్తే మాత్రం 625 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఒక చిన్న కుటుంబానికి ఇది చాలా ఎక్కువ స్పేస్ అనే చెప్పాలి. ఇంకా కారు చాలా కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇందులో 11 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. అయితే మీరు దీనిని 5+2 పర్పస్ కోసం కాకుండా.. 5 మెంబర్స్ కోసమే అని కొనుగోలు చేస్తే మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మంచి స్పేషియస్ కారు, మంచి బూట్ స్టోరేజ్ లభిస్తాయి. మరి.. మీకు ఈ రెనాల్ట్ ట్రైబర్ కారు ఎలా అనిపించింది? మీకు ఈ కారు సూట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments