Krishna Kowshik
బ్యాంకు ఉద్యోగులకు డబుల్ బొనాంజా. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. ఇక పని దినాలు ఐదు రోజులుగా మారనున్నాయి. అంతేకాకుండా..
బ్యాంకు ఉద్యోగులకు డబుల్ బొనాంజా. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. ఇక పని దినాలు ఐదు రోజులుగా మారనున్నాయి. అంతేకాకుండా..
Krishna Kowshik
బ్యాంకు ఉద్యోగులు కూడా త్వరలో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తరహాలో సెలవులు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్న వారికి టెకీలకు వారంలో ఐదు రోజులే పని దినాలుగా ఉంటాయి. శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. దీంతో వీకెండ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ లాంగ్ వీకెండ్ హాలీడేస్ రాబోతున్నాయి. ఎందుకంటే.. ఇక ప్రతి శనివారం కూడా సెలవు దినాలుగా పరిగణించే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ల మధ్య పలు దఫాలు చర్చలు జరిగిన అనంతరం.. ఈ ఒప్పందానికి ఆమోదం లభించింది. వీటితో పాటు పలు కీలక అంశాలపై రెండు వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి.
సెలవులే కాదూ డబుల్ బొనాంజా తగిలింది. వార్షిక వేతనం 17 శాతానికి పెంపునకు కూడా అంగీకరించాయి. దీంతో నవంబర్ 1, 2022 నుండి సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు వేతన పెంపుతో ప్రయోజనం పొందుతారు. ‘ఆ ఏడాది నుండి అమల్లోకి రానున్న బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో UFBU, AIBOA, AIBASM, BKSM ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల అనంతరం 9వ జాయింట్ నోట్ పై సంతకాలు చేశారు. వేతన సవరణకు సంబంధించి 12వ ద్వైపాక్షిక పరిష్కారం. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి’ అని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత భారం పడే అవకాశం కూడా ఉంది.
ఈ నిర్ణయం వల్ల బ్యాంకులపై దాదాపు రూ. 8, 284 కోట్ల అదనపు వార్షిక వ్యయం అవుతుంది. సవరించిన వేతన పరిష్కారం ప్రకారం..శనివారాలు పూర్తిగా సెలవులు. దీనికి కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం పొందితే.. పని దినాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, అప్పటి నుండి పని వేళలు అమల్లోకి వస్తాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. ఉదయం 9.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు బ్యాంకులు పనిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒప్పందం ప్రకారం కొత్త పే స్కేల్ లో 8088 పాయింట్లకు సంబంధించిన డియర్నెస్ అలవెన్స్(డీఏ) విలీనం ఉంటుంది.
సవరించిన వేతన ఒప్పందం ప్రకారం మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ఓరోజు సెలవు తీసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత లేదా సర్వీసులో ఉండగా ఎంప్లాయి మరణిస్తే, 255 రోజుల వరకు ప్రివిలేజ్ లీవ్‌ను క్యాష్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్‌తో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు, అదనంగా నెలవారీ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. అక్టోబరు 31, 2022న లేదా అంతకంటే ముందు పెన్షన్ పొండానికి అర్హులైన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షరన్లకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం కస్టమర్లపై ప్రభావితం చూపుతుందని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.