Tirupathi Rao
TVS Jupiter 110cc Price And Specifications: టీవీఎస్ కంపెనీ నుంచి సరికొత్త జూపిటర్ రాబోతోంది. ఈ బండిలో కంపెనీ భారీ మార్పులు చేసింది. అలాగే ధర కూడా అందుబాటులోనే ఉండటం విశేషం.
TVS Jupiter 110cc Price And Specifications: టీవీఎస్ కంపెనీ నుంచి సరికొత్త జూపిటర్ రాబోతోంది. ఈ బండిలో కంపెనీ భారీ మార్పులు చేసింది. అలాగే ధర కూడా అందుబాటులోనే ఉండటం విశేషం.
Tirupathi Rao
సరిగ్గా వారం రోజుల క్రితమే టీవీఎస్ మోటార్ కంపెనీ లైనప్‌లోని ఫేమస్ స్కూటర్ ఎన్‌టార్క్ (TVS Ntorq)ని అప్‌డేటెడ్ కలర్ ఆప్షన్స్ కొన్ని మార్పులు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా టీవీఎస్ తన ఫేమస్ స్కూటర్ జూపిటర్‌ని 110 సీసీ సెగ్మెంట్‌లో తీసుకు వస్తోంది. దీంతో మార్కెట్‌లో ఈ సారి గట్టి పోటీని ఇవ్వాలని చూస్తోంది. దీన్ని కంపెనీ ఈ నెల 22న ఇండియన్ ఆటోమొబైల్ మార్కెర్ట్లో లాంచ్ చేయనుంది. కంపెనీ ఈ స్కూటర్ డిజైన్ ని మార్చడంతో పాటు పలు మార్పులను కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న 125 సీసీ కంటే భిన్నంగా పూర్తిగా కొత్త లుక్‌లో ఈ స్కూటర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ స్కూటర్ తో తన మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలని టీవీఎస్ కంపెనీ భావిస్తుంది. అందుకే సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఇందులో భారీ మార్పులు చేయనున్నారు. ఇక త్వరలో విడుదల కాబోయే ఈ స్కూటర్‌లో ఎటువంటి ఫీచర్లను యాడ్ చేయనున్నారు? ఈ స్కూటర్ ఇంజిన్ ఆప్షన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..
త్వరలో విడుదల కాబోయే స్కూటర్ గురించి పూర్తి సమాచారం తెలియలేదు. కానీ కొన్ని లీక్స్, ఇతర నివేదికల ప్రకారం ఈ స్కూటర్ ముందు భాగంలో సిస్టమ్లో వెడల్పుగా ఉండే ఎల్ఈడీ DRLs ను అమర్చారు. ఇంకా ఈ స్కూటర్ ముందు భాగంలో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇంకా ఇది కాకుండా, సైడ్ మరియు రియర్ డిజైన్‌లో కూడా చాలా మార్పులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ స్కూటర్ 109.7 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ (ET-Fi) తో పనిచేయనుంది. అంతేగాకా ఇది 7.77bhp పవర్, 8.8nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. రూ.76000 నుంచి రూ.97000 రేంజ్ దాకా ఉండనుందని తెలుస్తుంది.
ఇంకా ఈ స్కూటర్ గురించి చెప్పాలంటే.. ఈ స్కూటర్లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న 125 సీసీ సస్పెన్షన్ కంటే బ్రేకింగ్ ఫీచర్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో స్కూటర్ పెర్ఫార్మన్స్ కూడా మెరుగుపడనుందని తెలుస్తుంది. టీవీఎస్ కంపెనీ ఇప్పటికే తన జూపిటర్ 125 స్కూటర్‌లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్‌ని అందిస్తోంది. ఇక త్వరలో రాబోయే ఈ అప్‌డేటెడ్ మోడల్ కూడా అదే కనెక్టివిటీ ఫీచర్‌ని కలిగి ఉంటుందని సమాచారం తెలుస్తుంది.. ఇందుకోసం గాను ఈ స్కూటర్లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ని కూడా ఏర్పాటు చేయాలని టీవీఎస్ కంపెనీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి మార్కెట్లో ఈ స్కూటర్ విడుదలయ్యాకా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ స్కూటర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.