iDreamPost
android-app
ios-app

Honda: రూ.8 లక్షల్లోపు సూపర్ సెడాన్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా!

సెడాన్ తీసుకోవాలి అనుకునే వారికి హోండా కంపెనీ నుంచి మంచి కారు.. బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉంది.

సెడాన్ తీసుకోవాలి అనుకునే వారికి హోండా కంపెనీ నుంచి మంచి కారు.. బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉంది.

Honda: రూ.8 లక్షల్లోపు సూపర్ సెడాన్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా!

కారు కొనాలని ఫిక్స్ అవ్వడం మాత్రమే కాకుండా.. ఎలాంటి కారు కొనాలి అనే క్లారిటీ కూడా ఉండాలి. కొందరికి ఎక్కువ మంది కూర్చునే వీలుండేలా కారు కావాలి. మరికొంత మందికి ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి కారు సౌకర్యంగా ఉండాలి. మరి కొంత మందికి కారు కూర్చునేందుకు విశాలంగా ఉండాలి. ఇలా మీ అవసరానికి తగ్గట్లుగా హ్యాట్చ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ, ఎంయూవీ అంటూ కొనుగోలు చేస్తూ ఉంటారు. అధికంగా మాత్రం హ్యాట్చ్ బ్యాక్ కొంటారు. ఆ తర్వాత సెడాన్ కార్లను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా సెడాన్ తీసుకోవాలి అనుకునేవారికి హోండా కంపెనీ నుంచి మంచి మోడల్ అందుబాటులో ఉంది. అలాగే దాని ధర కూడా కాస్త బడ్జెట్ కి దగ్గర్లోనే ఉందని చెప్పాలి. మరి.. ఆ కారు ఏది? దాని ధర ఎంత? ఫీచర్స్ ఏంటో చూద్దాం.

హోండా కంపెనీ కార్లకు భారత ఆటోమొబైల్ మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ ని హోండా కంపెనీ చాలా బాగా వాడుకుంటోంది కూడా. ప్రతి సెగ్మెంట్ లో వీళ్ల కంపెనీ నుంచి ఒక మంచి మోడల్ ఉండేలా చూసుకుంటున్నారు. సెడాన్ చూసుకుంటే హోండా నుంచి బడ్జెట్ రేంజ్ లో అమేజ్ కారు అందుబాటులో ఉంది. ఈ అమేజ్ కు చాలా మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ కారు ఫ్రంట్ వ్యూ మొత్తం హోండా జాజ్ తరహాలోనే ఉంటుంది. ఈ మోడల్ ధర విషయానికి వస్తే.. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.86 లక్షలుగా ఉంది.

ఇందులో మొత్తం E, S, VX అంటూ 3 వేరియంట్లు ఉన్నాయి. ఎలైట్ ఎడిషన్ వీటిలో హెఎండ్ అయిన VX ట్రిమ్ కి చెందింది. ఈ అమేజ్ ఇంజిన్ విషయానికి వస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 1199సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఈ అమేజ్ 90 పీస్/ 110 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు టాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్యూయల్ పరంగా మాత్రం కేవలం పెట్రోల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఈ మోడల్ కు కాస్త బ్యాక్ డ్రాప్ కావచ్చు. ఫీచర్స్ చూస్తే.. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఆటో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, సీవీటీ వేరియంట్స్ లో పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి.

సేఫ్టీ పరంగా కూడా ఈ సెడాన్ కు మంచి మార్కులే పడతాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్స్ ఉంటాయి. రేర్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ వ్యూయ్ కెమెరా ఉంటుంది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఆంకర్స్ కూడా ఉంటాయి. ఇంక క్రాష్ టెస్టులో గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ చూస్తే ఈ కారుకు 4 స్టార్స్ దక్కాయి. అంటే మీ ఫ్యామిలీకి ఇది ఎంతో మంచి సేఫెస్ట్ కారు అవుతుంది. అలాగే బూట్ స్పేస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది 420 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ తో వస్తోంది. ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా టీగోర్, హ్యూండాయ్ ఆరా, మారుతీ సుజుకీ డిజైర్ వంటి మోడల్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. మరి.. హోండా అమేజ్ సెడాన్ కారు ఫీచర్స్, ధర, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.