iDreamPost
android-app
ios-app

మార్కెట్లోకి 2024 JAWA 42.. ఈసారి ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!

2024 Jawa 42 Bike Price And Specifications: మార్కెట్ లోకి సరికొత్త జావా బండి వచ్చేసింది. ఈసారి 2024 మోడల్ లో లుక్స్, ఫీచర్స్ ని మార్చేసి.. ధర కూడా తగ్గించేశారు.

2024 Jawa 42 Bike Price And Specifications: మార్కెట్ లోకి సరికొత్త జావా బండి వచ్చేసింది. ఈసారి 2024 మోడల్ లో లుక్స్, ఫీచర్స్ ని మార్చేసి.. ధర కూడా తగ్గించేశారు.

మార్కెట్లోకి 2024 JAWA 42.. ఈసారి ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!

చాలామంది బైక్ అంటే ధర తక్కువ ఉండాలి.. మైలేజ్ ఎక్కువుండాలి.. మంచి లుక్స్ ఉండాలి అని కోరుకుంటారు. సగటు వినియోగదారుడి కోరికలు అలాగే ఉంటాయి. అయితే కొన్నిసార్లు అన్నీ కలిసి రావడం అనేది చాలా కష్టం అనే చెప్పాలి. కానీ, ఈసారి వారి కలను సాకారం చేసే దిశగా అప్ డేటెడ్ జావా 42 బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఈసారి దీని ధర బేసిక్ మోడల్ కంటే రూ.15 వేలు తక్కువ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక మోడల్ అప్ డేట్ అయితే ధర పెరగాలి. కానీ, ఇక్కడ మాత్రం జావా కంపెనీ ఓ రూ.15 వేలు తగ్గించారు. అలాగే లుక్స్, ఫీచర్స్ ని మాత్రం పెంచేశారు. మరి.. ఈ అప్ డేటెడ్ జావా 42 ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

ఈ 2024 జావా లుక్స్ మాత్రం ఎప్పటిలాగానే స్టన్నింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్, డిజైన్, ఇంజినీరింగ్ కి సంబంధించి మార్పులు చేశామంటూ చెబుతున్నారు. ఈ 2024 జావా 42 బైక్ 294.72సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ మీకు 27.32 హార్స్ పవర్ తో వస్తోంది. అలాగే అత్యధికంగా 26.84nm టార్క్ ని ప్రొడ్యూస్ చేయగలదు. ఈ రీడైజైన్డ్ జావా సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో వస్తోంది. అలాగే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ సిస్టమ్ ఉంటుంది. మీకు అనలాగ్ ఎల్సీడీ సెటప్ అయితే ఉంది. ఇది 1369mm వీల్ బేస్ తో వస్తోంది. అంటే మీకు మెరుగైనా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బైక్ ట్యాంక్ మీద, సైడ్స్ మీకు జావా 42 బ్యాడ్జింగ్ లభిస్తుంది. అలాగే ప్రతి డ్యూయల్ టోన్ డిజైన్ లో కూడా కలర్ లైన్ ని మీరు చూడచ్చు.

ఈ 2024 జావా 42 బైక్ లో కొత్త కలర్స్ కూడా వచ్చాయి. ఇందులో స్ట్రైకింగ్ టియర్ డ్రాప్ ట్యాంక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈసారి వచ్చిన కొత్త కలర్స్ లో ఓరియన్ రెడ్ మ్యాటీ మాత్రం వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంది. ఇంక ఈ 2024 జావా 42 ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ.1.98 లక్షల వరకు ఉంది. మీరు రూ.5 వేలు కట్టి ఆన్ లైన్ లో జావా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇవి రిఫండబుల్ కూడా. అలాగే మీరు వారి అధికారిక వెబ్ సైట్ లో 2024 జావా 42 బండిని టెస్ట్ డ్రైవ్ కి బుక్ చేసుకోవచ్చు. హ్యాండ్ ఫీల్, రైడింగ్ ఎక్స్ పీరియన్స్ చూసుకుని మీరు ఈ బండిని కొనుగోలు చేయచ్చా అనేది ఆలోచించవచ్చు. మరి.. ఈ ఆల్ న్యూ జావా బైక్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.