iDreamPost
android-app
ios-app

గంటలో రూ. 564 కోట్లు నష్టపోయిన ప్రధాని భార్య! కారణం ఇదే..

  • Author Soma Sekhar Published - 04:01 PM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Published - 04:01 PM, Fri - 21 July 23
గంటలో రూ. 564 కోట్లు నష్టపోయిన ప్రధాని భార్య! కారణం ఇదే..

సాధారణంగా బిజినెస్ మెన్ లు రకరకాల రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అన్ని రంగాల్లో లాభం వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఇక స్టాక్ మార్కెట్ లో లాభ-నష్టాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందులో ఎప్పుడు లాభం వస్తుందో? ఎప్పుడు నష్టం వస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య, ఇన్పోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తికి గంటలోనే రూ. 564 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. ఇన్పోసిస్ తొలి త్రైమాసిక నికర లాభం 11 శాతంగా నమోదు అయినప్పటికీ ఆమె 564 కోట్లు నష్టపోవడం గమనార్హం.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి గంటలోనే రూ. 564 కోట్ల నష్టం వచ్చింది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం తన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాను ప్రకటించింది. సంస్థ నికర లాభం 11 శాతం పెరిగినప్పటికీ ఆమెకు లాస్ రావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం స్టాక్ మార్కెట్ సెషన్ లో ఇన్పోసిస్ షేరు 10 శాతానికి పైగా పడిపోయింది(అంటే షేరుకు రూ. 145 నష్టం).

ప్రస్తుతం 8 శాతానికి పైగా నష్టంతో.. రూ. 1330 లెవెల్స్ లో ట్రేడవుతోంది. దాంతో ఒక్కో షేరుపై రూ. 120 కోల్పోయింది. ఇక ఇదే సమయంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఇన్పోసిస్ ADR ధర 13.5 శాతానికి తగ్గింది. ఇక ఇన్పోసిస్ షేర్లు పతనం కావడంతో.. అందులో పెట్టుబడి పెట్టిన అందరి సంపద భారీగా పతనమైంది. ఇన్పోసిస్ కంపెనీలో రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి 1.07 శాతం వాటా ఉంది. కాగా.. షేరు విలువ ఇవాళ గంటలోనే 10 శాతానికిపైగా పడిపోవడంతో.. ఆమెకు చెందిన రూ. 564 కోట్ల సంపద ఆవిరి అయ్యింది.