iDreamPost
android-app
ios-app

Gautam Adani:ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అదానీ! కింద పడ్డా వేగంగా పైకి!

  • Published Jan 05, 2024 | 7:39 PM Updated Updated Jan 05, 2024 | 7:39 PM

ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ అధినేత, గౌతమ్ అదానీ గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకోవడమే కాకుండా అంతే త్వరగా వెనక్కి తగ్గారు. తాజాగా గౌతమ్ ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ కిరీటాన్ని మళ్లీ సాధించారు. రిలయన్స్ చైర్మన్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి తన స్థానాన్ని దక్కించుకున్నారు. అదే ఎలా అంటే..

ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ అధినేత, గౌతమ్ అదానీ గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకోవడమే కాకుండా అంతే త్వరగా వెనక్కి తగ్గారు. తాజాగా గౌతమ్ ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ కిరీటాన్ని మళ్లీ సాధించారు. రిలయన్స్ చైర్మన్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి తన స్థానాన్ని దక్కించుకున్నారు. అదే ఎలా అంటే..

  • Published Jan 05, 2024 | 7:39 PMUpdated Jan 05, 2024 | 7:39 PM
Gautam Adani:ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అదానీ! కింద పడ్డా వేగంగా పైకి!

అదానీ గ్రూప్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గురించి అందరికి తెలిసిందే. ఈయన భారతదేశంలోనే ఒక బిలియనీర్ పారిశ్రామికవేత్త. అయితే గతేడాది నుంచి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చర్చలు కొనసాగాయి. ఎందుకంటే.. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకోవడమే కాకుండా అంతే త్వరగా వెనక్కి తగ్గారు. కాగా, ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ కిరీటాన్ని మళ్లీ సాధించారు. అంతేకాకుండా గౌతమ్ అదానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన హోదాను తిరిగి చేజిక్కించుకున్నారు. తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో దేశంలోనే అత్యంత రిచ్చేస్ట్ పర్సన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదనీ మరోసారి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా చరిత్రను పునరావృతం చేశారు. అదానీ గ్రూప్ గురించి హిండెన్ బర్గ్ కేసులో సిట్, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ రిలయన్స్ చైర్మన్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి తన స్థానాన్ని దక్కించుకున్నారు.మరోవైపు.. గౌమత్ అదానీ సంపద భారీగా పెరిగడంతో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ 12వ స్థానానికి చేరుకున్నారు. దీంతో ముకేశ్ అంబానీ 13వ స్థానంలో వెనకబడ్డారు. కాగా, గత ఏడాది 2023లో గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల లిస్ట్ లో 15వ స్థానానికి చేరుకోగా, ముకేష్ అంబానీ 14వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక గత ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక.. గౌతమ్ అదానీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్లలో చాలా అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్ వాటన్నీంటిని తిరస్కరించింది. అయినప్పటికీ అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ భారీగా పడిపోయాయి. దీంతో అదానీ వ్యక్తిగత సంపద ఏకంగా 60 శాతం పడిపోవడమే కాకుండా..69 బిలియన్ డాలర్ల స్థాయికి దిగజారింది.

ప్రస్తుతం అదానీ గ్రూప్ లో10 పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీలు అనేవి అత్యధిక స్థాయిలో ఉన్నాయి. వాటిలో అదానీ పోర్ట్‌ అనేది శుక్రవారం మధ్యాహ్నంకి ఆసియాలో 2.8% ట్రేడింగ్ సీజన్ లో ఉంది. ఇక హిండెన్‌బర్గ్ పరాజయం తర్వాత అదానీ కంపెనీ షేర్లు అన్నీనెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ నికర ఆస్తుల విలువ $97.6 బిలియన్లుగా ఉంది. కాగా, అంబానీ సంపద $97 బిలియన్లుకు పడిపోయింది. మరి, కొత్త సంవత్సరంలో అదానీ అత్యంత సంపన్నుల జాబితాలో చేరడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.