iDreamPost
android-app
ios-app

Gautam Adani: గౌతమ్‌ అదానీ జీతం అంతేనా.. సొంత ఉద్యోగుల కన్నా కూడా తక్కువేగా

  • Published Jun 23, 2024 | 6:02 PM Updated Updated Jun 23, 2024 | 6:02 PM

గౌతమ్‌ అదానీ.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్‌ 20లో ఉండగా.. ఇండియా కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన వార్షిక వేతనానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

గౌతమ్‌ అదానీ.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్‌ 20లో ఉండగా.. ఇండియా కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన వార్షిక వేతనానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 6:02 PMUpdated Jun 23, 2024 | 6:02 PM
Gautam Adani: గౌతమ్‌ అదానీ జీతం అంతేనా.. సొంత ఉద్యోగుల కన్నా కూడా తక్కువేగా

అదానీ గ్రూప్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్నాళ్ల క్రితం వరకు ఒడిదుడుకులు ఎదుర్కొన్న అదానీ మళ్లీ తర్వాత కోలుకున్నాడు. మళ్లీ దేశంలోనే అత్యధిక సంపద ఉన్న బిలియనీర్ల జాబితాలో చేరాడు. ఇక తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోట్ల రూపాయల ఆస్తితో ఇండియాలో టాప్‌ బిలియనీర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌ అదానీ వార్షిక వేతనం ఎంత ఉంటుందనే విషయంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇక అదానీ జీతం వివరాలు తెలుసుకున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు. అదానీ జీతం మరీ ఇంత తక్కువా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అదానీ జీతం.. తన సహచర పారిశ్రామికవేత్తలతో పాటు సొంత కంపెనీల్లో పని చేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే కూడా తక్కువ ఉందట. మరి ఇంతకు అదానీ జీతం ఎంతంటే..

గౌతమ్‌ అదానీ ఏడాదికి రూ.9.26 కోట్లు మాత్రమే వేతనంగా తీసుకుంటున్నారని తెలిసింది. అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటికీ, ఆయన మాత్రం కేవలం 2 కంపెనీల నుండి మాత్రమే జీతం తీసుకుంటున్నారట. కంపెనీ ప్రమోటర్‌గా, చైర్మన్‌గా, అనేక ఇతర ప్రధాన బాధ్యతలను నిర్వర్తించినందుకు గాను అదానీ ఈ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ ఒక కంపెనీ నుంచి శాలరీగా రూ.2.19 కోట్లు తీసుకుంటున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.27 లక్షలు అందుకున్నారు. అంటే మొత్తంగా ఈ కంపెనీ నుంచి అదానీ ఏడాదికి రూ.2.46 కోట్లు తీసుకున్నారు.

Gautam Adani

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువని తెలుస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ నుంచి ఆయన మరో రూ. 6.8 కోట్లు జీతం పొందుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అలా ఈ రెండు కంపెనీల నుంచి అదానీ ఏడాదికి కేవలం 9 కోట్ల రూపాయల వేతనం మాత్రం తీసుకున్నారంట. కుటుంబ యాజమాన్యంలో నడుస్తోన్న మిగతా పెద్ద సంస్థ అధినేతలతో పోలిస్తే.. అదానీ తీసుకునే వార్షిక వేతనం తక్కువగా ఉండడం గమనార్హం. ఇక బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద విలువ 106 బిలియన్ డాలర్లుగా ఉండి.. 14వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో రెండో స్థానంలో ఉన్నారు.

అయితే భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. అయితే, కరోనా మహమ్మారి తర్వాత నుంచి అంబానీ ఆ జీతం తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీల్ మిత్తల్ 2022-23లో రూ.16.7 కోట్లు వార్షిక వేతనం అందుకున్నారు. అలానే రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, పవన్ ముంజాల్ రూ.80 కోట్లుగా ఉంది. అలాగే ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఇన్పోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్‌ల కన్నా కూడా.. గౌతమ్ అదానీ వార్షిక వేతనం తక్కువగా ఉండడం గమనార్హం.