కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో AC బ్లాస్ట్‌.. ఈ తప్పులు చేస్తే.. మీ ఇంట్లో కూడా పేలుడు జరగవచ్చు

కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో ఏపీ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఏసీ పేలుడు ఎందుకు జరుగుతుంది.. దాన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో ఏపీ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఏసీ పేలుడు ఎందుకు జరుగుతుంది.. దాన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ జ్యువెలరీ సంస్థ.. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఏసీ బ్లాస్ట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. దాంతో ఏసీ వాడే వారు కాస్త భయపడుతున్నారు. వేసవి తీవ్రత నుంచి తప్పించుకోవడం కోసం చాలా మంది ఇళ్లలో ఏసీలు వాడుతుంటారు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో.. గతంతో పోలిస్తే.. ఈసారి ఏసీలకు డిమాండ్‌ కాస్త పెరిగింది.

ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. దాంతో భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం జనాలు ఏసీ, కూలర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ వేసవిలో వాటికి డిమాండ్‌ బాగా పెరిగింది. అయితే ఏసీ వాడకంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో జరిగినట్లుగానే పేలుడు సంభవించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏసీ ప్రమాదాలను నివారించాలంటే.. వాటిని ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు. లేదంటే భారీ నష్టాన్ని చవి చూస్తారని హెచ్చరిస్తున్నారు. కొత్త ఏసీని వాడేటప్పుడు కంటే కూడా.. సెకండ్ హ్యాండ్, పాతది, రెంట్‌కు తీసుకున్న ఏసీని వాడుతున్నప్పున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అంటున్నారు.

ఏసీ పేడానికి కారణం:

  • ఎలక్ట్రికల్ లోపాలు: వైరింగ్‌ సరిగా లేకపోవడం, వదులుగా ఉన్న కనెక్షన్, షార్ట్ సర్క్యూట్ వంటి కారణాల వల్ల ఏసీ పేలుడు సంభవించవచ్చు.
  • గ్యాస్ లీకేజీ: ఏసీలో కూలింగ్‌ సిస్టమ్‌లో గ్యాస్ లీకేజీ ఉంటే.. అది ఏదైనా మండే పదార్ధాన్ని, పరికరాన్ని తాకితే పేలుడు సంభవించే అవకాశం ఉంది.
  • వేడెక్కడం: ఏసీ అధికంగా వేడెక్కినా లేదా సరిగ్గా చల్లబడకపోయినా పేలవచ్చు.
  • నిర్వహణలో లోపం: సరైన నిర్వహణ లేకపోయినా ఏసీలు పేలే ప్రమాదం ఉంది. అలాగే సమయానికి సర్వీసింగ్‌ చేయించకపోయినా అది పేలుడుకు దారితీయవచ్చు.
  • టర్బో మోడ్: సాధారణంగా ఏసీ వేగవంతమైన శీతలీకరణ కోసం దాని టర్బో మోడ్‌ వాడతారు. అయితే దాన్ని సుదీర్ఘంగా ఉపయోగిస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటున్నారు.

పేలుడు నిరోధించడానికి చిట్కాలు:

  • ఎలక్ట్రికల్ భద్రత: ఎయిర్ కండీషనర్‌ను ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు.. ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ పిలిపించి.. పని చేయించుకొండి. అలాగే ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ భద్రతను తనిఖీ చేస్తూ ఉండండి.
  • రెగ్యులర్ మెయింటెనెన్స్: అలానే ఎప్పటికప్పుడు ఏసీని సర్విసింగ్‌ చేయిస్తూ ఉండాలి. 600 గంటల ఉపయోగం తర్వాత ఏసీ సర్వీసింగ్ అవసరం అని గుర్తించండి.
  • లీకేజీ చెక్: ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, టెక్నీషియన్‌ను పిలవండి.
  • అధిక వినియోగాన్ని నివారించండి: సహజంగానే ఏసీ వాడకం విపరీతమైన వేడిలో నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిని ఎక్కువ సమయం ఆన్‌ చేసి ఉంచరాదు .
  • టర్బో మోడ్ సరైన ఉపయోగం: గది చల్లబడిన తర్వాత, టర్బో మోడ్‌ను ఆపివేయాలి. ఏసీని సాధారణ వేగంతో నడిపించాలి. లేకపోతే కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది.
Show comments