iDreamPost
android-app
ios-app

సగం ధరకే TV, AC, ఎయిర్ కూలర్లు.. ఐఫోన్, ల్యాప్‌టాప్ కూడా!

  • Published Apr 30, 2024 | 6:29 PM Updated Updated Apr 30, 2024 | 6:29 PM

78 వేల విలువైన ఏసీ, 80 వేలు విలువైన ల్యాప్ టాప్, ఇంకా 5జీ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇలా ఇవన్నీ సగం ధరకే పొందవచ్చు. ఐఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

78 వేల విలువైన ఏసీ, 80 వేలు విలువైన ల్యాప్ టాప్, ఇంకా 5జీ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇలా ఇవన్నీ సగం ధరకే పొందవచ్చు. ఐఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

సగం ధరకే TV, AC, ఎయిర్ కూలర్లు.. ఐఫోన్, ల్యాప్‌టాప్ కూడా!

ప్రతీ సీజన్ లో ఆయా సంస్థలు కస్టమర్ల కోసం ఆఫర్లను, డిస్కౌంట్లను తీసుకొస్తుంటాయి. గ్రేట్ సమ్మర్ సేల్ అని.. గ్రేట్ ఫెస్టివల్ సేల్ అని.. ఇలా రకరకాల పేర్లతో పలు ఆఫర్స్, డిస్కౌంట్స్ పెడుతుంటాయి. ఈసారి పలు కంపెనీలు సమ్మర్ సేల్ ని పెట్టేశాయి. పోటీని తట్టుకుని నిలబడేందుకు ఆయా కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సేల్ లో భాగంగా మీరు సగం ధరకే టీవీ, ఏసీ వంటి వాటిని పొందవచ్చు. అసలు అఫర్ లో ఏమున్నాయో ఓ లుక్కేయండి. 

ఈ సమ్మర్ సేల్ మే 2 మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. ఈ సేల్ లో భాగంగా కస్టమర్స్ కోసం బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్. ఐఫోన్ మొబైల్ వాడడం మీ కల అయితే మీ కోసమే ఈ ఆఫర్. ఈ సేల్ లో రూ. 59,900 విలువ చేసే ఐఫోన్ 13ని రూ. 10,901 తగ్గింపుతో రూ. 48,999కే పొందవచ్చు. మీరు బెస్ట్ 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఆఫర్ మీ కోసమే. రూ. 15,999 విలువైన శామ్ సంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ. 11,999కే పొందవచ్చు. ఒక మంచి ల్యాప్ ట్యాప్ కొనాలన్న ఆలోచనలో ఉంటె.. మీ కోసమే ఈ అసుస్ వివో బుక్ 15 ల్యాప్ టాప్. రూ. 80,990 విలువైన ఈ ల్యాప్ టాప్ పై మీరు రూ. 23 వేలు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ అద్భుతమైన ల్యాప్ టాప్ కేవలం రూ. 57,990కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మండే ఎండలకు ఇంట్లో చల్లని ఏసీ వేసుకుని సుఖంగా నిద్రపోవాలని మీరు అనుకుంటే.. ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీని సగం ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. రూ. 78,990 విలువైన ఈ ఏసీని సేల్ లో భాగంగా రూ. 37,490కే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 41,500 తగ్గింపు లభిస్తుంది. ఇక రూ. 58,400 విలువైన డైకిన్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీని రూ. 21,410 తగ్గింపుతో రూ. 36,990కే పొందవచ్చు. ఈ సమ్మర్ లో వింటర్ సీజన్ ని ఆస్వాదించవచ్చు. ఏసీలే కాదు.. కూలర్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. రూ. 9,290 విలువ చేసే బజాజ్ పీఎక్స్ 97 టార్క్ న్యూ 36 లీటర్ల పర్సనల్ ఎయిర్ కూలర్ ని రూ. 5,999కే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీని కూడా సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 24,999తో స్టార్ట్ అయ్యే రెడ్ మీ 32 అంగుళాల హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని కేవలం రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఐసీఐసీఐ, బీఓబీ కార్డు, వన్ కార్డు క్రెడిట్, డెబిట్ కార్డుల మీద, ఈఎంఐ మీద 10 శాతం అదనంగా ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ఉంది. ప్రైమ్ మెంబర్స్ కోసం 12 గంటలు ముందే అంటే మే 2 అర్ధరాత్రి నుంచే ఈ సేల్ మొదలవ్వనుంది.           

gamdomjojobetjojobet girişmarsbahiscasibom