iDreamPost
android-app
ios-app

అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు!

ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చే నెల జూన్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన పలు నిబంధనలు మారుతుంటాయి. జూన్ 1 నుంచి కూడా పలు కీలక రూల్స్ లో మార్పులు రానున్నాయి.

ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చే నెల జూన్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన పలు నిబంధనలు మారుతుంటాయి. జూన్ 1 నుంచి కూడా పలు కీలక రూల్స్ లో మార్పులు రానున్నాయి.

అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు!

ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో గడిచిపోనున్నది. మరో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభమవబోతున్నది. కొత్త నెల ప్రారంభవుతుందంటే చాలు.. ఎన్నో విషయాల్లో మార్పులు చేసుకుంటుంటాయి. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కొత్త విధానాలు అమల్లోకి వస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. అయితే ఈ కొత్త రూల్స్ తో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై కాస్త ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. వచ్చే నెల జూన్ లో కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి.

గ్యాస్ ధరలు:

నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. చమురు కంపెనీలు ఒకటో తేదీన ఆయిల్ ధరలను సమీక్షిస్తుంటాయి. కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. వచ్చే నెల జూన్ లో వీటి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ఆధార్ కార్డు అప్ డేట్:

ఆధార్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా.. ఇతర అవసరాలకు ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇటీవల కేంద్రం ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలని గడువును పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ గడువు తేదీ వరకు పూర్తి ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతీ అప్ డేట్ కు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువు లోగా ఆధార్ అప్ డేట్ చేసుకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్:

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్ ను తీసుకొచ్చింది. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవోల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఈ రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నది.