Clay Pots Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ!

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ!

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసమే ఈ వార్త.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసమే ఈ వార్త.

నేటి కాలంలో కొందరు యువతి, యవకులు ఎక్కువగా కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. ఇందు కోసం అనేక వ్యాపారాలు చేస్తూ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. మరి కొందరు యువకులు మాత్రం.. లక్షల్లో జీతాలు వస్తున్నా.. దాన్ని పక్కన పెట్టి ఏంచక్కా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. సరికొత్త ఐడియాలతో వినూత్నంగా ఆలోచిస్తూ రేపటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మంచి ఐడియాతో వ్యాపారంలోకి అడుగు పెడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. అయితే, ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా తక్కువ పెట్టుబడితో మొదలు పెడుతుంటారు. ఆ తర్వాత అనుకున్న రీతిలో ఆ ఐడియా వర్కౌట్ కావడంతో ఆ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇలా నేటి తరం యువతి, యువకులు వ్యాపారాన్ని ప్రారంభిస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇక కొత్తగా చిన్న వ్యాపారం చేయాలనుకునే మట్టి కప్పుల బిజినెస్ మంచి వ్యాపారం అని చెప్పువచ్చు. అవును, దీనికి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. అసలు ఏంటీ బిజినెస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మంది ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్‌ వంటి వాటిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే సహజ సిద్దంగా తయారు చేసిన పాత్రల్లో నీళ్లు తాగడం అనేది పాత తరం వాళ్లు చేసే పని అని కొందరు ఈజీగా తీసి పారేస్తుంటారు. కానీ, తరం మారుతోందంటున్నారు కొందరు. ప్లాస్టిక్ కప్పుల్లో తాగడం కంటే మట్టితో తయారు చేసిన వాటిల్లో తాగడం, తినడం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు తెలివైన యువకులు ఈ మట్టి కప్పుల బిజినెస్ ను ఐడియాని వ్యాపారంగా మల్చుకుంటున్నారు. ఇక మట్టి కప్పుల్లో తయారు చేసిన వాటికి ఇప్పుడు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఆ వ్యాపారాలు కూడా బాగానే సాగుతున్నాయి.

ఇలాంటి వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఈ బిజినెస్ ను ప్రారంభించాలనుకునేవారు ముందుగా అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. మార్కెట్ లో దొరికే టీ మట్టి కప్పలు, కుల్హడ్స్ తో పాటు మజ్జిగ తాగే మట్టితో తయారు చేసిన పరికరాలు కొనుగోలు చేయాలని. వీటిని ఓ అనువైన స్థలంలో పెట్టుకుని అమ్మడం ద్వారా రోజూకి రూ.5000 నుంచి రూ.7000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నార. దీంతో పాటు స్థానికంగా ఉండే టీ షాపు, రెస్టారెంట్ లతో కూడా ఒప్పందం కుదుర్చుకుని విక్రయించచ్చు. ఇలా ఈ ఐడియాను పక్కా అమలు చేస్తే మాత్రం నెలకు ఈజీగా బాగానే సంపాదించవచ్చని కొందరు వ్యాపారవేత్తలు సూచిస్తున్నారు. ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్న ఈ బిజినెస్ ను ప్రారంభించి లాభాలు పొందండి.

Show comments