iDreamPost
android-app
ios-app

Xiaomi నుంచి తక్కువ ధరకే 4K స్మార్ట్ టీవీలు.. ఫీచర్లు సూపర్!

  • Published Aug 28, 2024 | 5:00 AM Updated Updated Aug 28, 2024 | 5:00 AM

Xiaomi Smart TV: షియోమీ తాజాగా స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ నుంచి మూడు కొత్త 4K స్మార్ట్ Tv లను ఆకట్టుకునే ఫీచర్స్ తో అందుబాటు ధరలకే కంపెనీ అందించింది. ఈ ఎడిషన్ లో భాగంగా 43 ఇంచెస్, 55 ఇంచెస్ ఇంకా 65 ఇంచెస్ సైజుల్లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల అయ్యాయి.

Xiaomi Smart TV: షియోమీ తాజాగా స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ నుంచి మూడు కొత్త 4K స్మార్ట్ Tv లను ఆకట్టుకునే ఫీచర్స్ తో అందుబాటు ధరలకే కంపెనీ అందించింది. ఈ ఎడిషన్ లో భాగంగా 43 ఇంచెస్, 55 ఇంచెస్ ఇంకా 65 ఇంచెస్ సైజుల్లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల అయ్యాయి.

Xiaomi నుంచి తక్కువ ధరకే 4K స్మార్ట్ టీవీలు.. ఫీచర్లు సూపర్!

షియోమీ కంపెనీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీలని మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ నుంచి మూడు కొత్త 4K స్మార్ట్ Tv లను ఆకట్టుకునే ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది. అది కూడా అందుబాటు ధరలకే కంపెనీ వీటిని అందించింది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ లో భాగంగా 43 ఇంచెస్, 55 ఇంచెస్ ఇంకా 65 ఇంచెస్ సైజుల్లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల అయ్యాయి. ఈ టీవీలు చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేయబడ్డాయని కంపెనీ తెలిపింది. ఈ టీవీలని ప్రీమియం మెటల్ బాడీ ఇంకా బెజెల్ లెస్ డిజైన్ తో చేశారు. అందువల్ల ఎక్కువ కాలం పాటు ఈ టీవీలు పని చేస్తాయి.

ఈ టీవీలు కార్టెక్స్ ఏ 55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో రన్ అవుతాయి. ఇక ర్యామ్ విషయానికి వస్తే.. ఇవి 2GB ర్యామ్ కలిగి ఉంటాయి. అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ టీవీలు వస్తాయి. ఈ షియోమీ 4K స్మార్ట్ టీవీలు వివిడ్ పిక్చర్ ఇంజిన్ తో వస్తాయి. ఇంకా అలాగే ఇవి డాల్బీ విజన్ సపోర్ట్ ఫీచర్ ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటితో సూపర్ విజువల్స్ ని చూడవచ్చని షియోమీ కంపెనీ తెలిపింది. అలాగే మంచి సౌండ్ ని కూడా వినవచ్చు. ఇంకా అంతేకాదు మంచి విజువల్స్ కోసం MEMC రియాలిటీ ఫ్లో ఫీచర్ కూడా ఈ టీవీల్లో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీల్లో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్ లు ఉన్నాయి. ఈ స్పీకర్లు అదిరిపోయే సౌండ్ ని ఇస్తాయి. వీటిలో మంచి సౌండ్ టెక్నాలజీని యాడ్ చేశారు. ఈ టీవీల్లో డాల్బీ ఆడియో, డీటీఎస్ ఎక్స్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. వీటిలో బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3 HDMI (1 eARC), 2 USB, 1 ఇయర్ ఫోన్, 1 ఏవి ఇంకా 1 ఈథర్నెట్ పోర్ట్ లు ఉంటాయి. వీటి ధరల విషయానికి వస్తే.. వీటిలో 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 28,999 ధరతో, 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 35,999 ధరతో ఇంకా అలాగే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీని 39,999 ధరతో కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ టీవీల ధరల పైన డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. కంపెనీ వీటిపై మంచి బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. అన్ని ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 24,999 నుంచి కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీలను ఆగస్టు 30 వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.