iDreamPost
android-app
ios-app

బ్యాంక్ మేనేజర్స్ దాచే 3 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్! మీకు డబ్బే డబ్బు!

  • Published Jun 20, 2024 | 5:44 PM Updated Updated Jun 20, 2024 | 5:44 PM

ప్రస్తుతం సంపాదిస్తున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. పొదుపు చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వివిధ బ్యాంకుల్లో నగదును ఇన్వేస్ట్ చేస్తుంటారు. అయితే ఆ బ్యాంకుల్లో ఉండే మేనెజర్స్ సైతం కస్టమర్స్ కు తెలియజేయకుండా సీక్రెట్ గా తమ భవిష్యత్తుల కోసం ఇన్వేస్ట్ చేసుకునే బెస్ట్ స్కీమ్స్ 3 ఉన్నాయి. మరి ఆ స్కీమ్స్ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం సంపాదిస్తున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. పొదుపు చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వివిధ బ్యాంకుల్లో నగదును ఇన్వేస్ట్ చేస్తుంటారు. అయితే ఆ బ్యాంకుల్లో ఉండే మేనెజర్స్ సైతం కస్టమర్స్ కు తెలియజేయకుండా సీక్రెట్ గా తమ భవిష్యత్తుల కోసం ఇన్వేస్ట్ చేసుకునే బెస్ట్ స్కీమ్స్ 3 ఉన్నాయి. మరి ఆ స్కీమ్స్ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Jun 20, 2024 | 5:44 PMUpdated Jun 20, 2024 | 5:44 PM
బ్యాంక్  మేనేజర్స్ దాచే 3 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్! మీకు డబ్బే డబ్బు!

ప్రతిఒక్కరికి ఆర్థిక అవసరాలు ఒకేలా ఉండవు. అందుకే ఈ రోజుల్లో ఎంత సంపాదించిన అందులో ఎంతో కొంత సేవింగ్స్ కింద పొదుపు చేయాలని చూస్తుంటారు. అయితే సేవింగ్స్ విషయానికొస్తే.. ఏ తల్లిదండ్రులైనా ముందుగా పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈక్రమంలోనే వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయలని కోరుకుంటూ కష్టపడిన దాంట్లో కొంత వారి పేరు మీద స్కీమ్స్ లో పొదుపు చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే.. రేపటి రోజున వారి చదువు, పెళ్లి ఇలా ఏ విషయంలో చూసుకున్న ప్రతిది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి, సంపాదించిన కొంత మొత్తంలో వివిధ రూపాలుగా స్కీమ్స్ కింద ఇన్వేస్ట్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసి వివిధ బ్యాంకుల్లో రకరకాల చాలా స్కీమ్స్ లో నగదును పొదుపు చేసి ఉంటాం. కానీ, బ్యాంకు మేనెజర్స్ కూడా సీక్రెట్ గా తమ పిల్లల భవిష్యత్తు గురించ ఇన్వెస్ట్ చేసే 3 బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఈ స్కీమ్స్ గురించి చాలామందికి తెలియదు. ఇక వీటిలో కానీ, మీరు డబ్బును పొదుపు చేస్తే 2 ఇంతలు లాభం పొందవచ్చు. మరి, ఇంతకి ఆ స్కీమ్స్ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సంపాదిస్తున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. పొదుపు చేయాలని నిర్ణయించుకుంటారు. మరి సంపాదించిన కొంత మొత్తని పొదుపు చేయడం కోసం ఇప్పుడు మనకు అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్ అని, బ్యాంకులో వివిధ రకాల స్కీమ్స్ ఇన్వేస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఆ బ్యాంకు మేనజేర్స్ కూడా ఇంతవరకు తమ కస్టమర్స్ కు తెలియజేయని అద్భుతమైన 3 స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా, వాటిని ఎవరికి తెలియకుండా వారే సిక్రెట్ గా ఇన్వేస్ట్ చేస్తూ.. రెండు ఇంతలు లాభం పొందుతున్నారు. ఇంతకి ఆ స్కీమ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకం ఆడపిల్లలల భవిష్యత్తుకి ఆర్థిక భరోసా కల్పించేందుకు, అలాగే ఉన్నత విద్య, వివాహ సమయాల్లో తోడ్పాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పొదుపు పథకం. అయితే ఇది ఒక దీర్ఘకాలిక పొదుపు పథకం. ముఖ్యంగా ఆడపిల్లకు పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఆమెకు 10 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఖాతా ఎప్పుడైనా తెరవచ్చు. ముఖ్యంగా ఈ సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు.ఇక ఈ ఖాతాలో అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత డబ్బు తీసుకొనేందుకు వీలు ఉంటుంది. ఇకపోతే ఈ స్కీమ్ లో మీరు 15 సంవత్సరాలు మాత్రమే డబ్బును ఇన్వేస్ట్ చేస్తారు. కానీ, మీరు ఇన్వేస్ట్ చేసే అమౌంట్ కు 21 సంవత్సరాలు వచ్చినప్పటికి మీరు చేసిన రూ. 22, 50,00 కాస్త రూ.69,27,578గా మారబోతుంది. పైగా ఇందులో ఒక్క పైసా కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ స్కీమ్ పోస్టాఫీసు, బ్యాంకులో సైతం అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో ఎవరైతే అబ్బాయిల కోసం డబ్బును ఇన్వేస్ట్ చేయాలని చూస్తారో అలాంటి వారికి ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ 15 ఏళ్లుగా ఉంటుంది. ఆపైన 5 ఏళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ లో 7.10 శాతం వడ్డీ రేటును కేంద్రం కల్పిస్తోంది . చాలా రోజుల నుంచి ఇదే వడ్డీ రేటు కొనసాగుతోంది. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది . ఒక్కోసారి వడ్డీ రేటు పెరగవచ్చు, తగ్గవచ్చు. వడ్డీ రేటు పెరిగినప్పుడు వచ్చే రాబడి సైతం పెరుగుతుంది. అయితే ఈ స్కీమ్ లో 15 సంవత్సరాలు వచ్చినప్పటికి మీరు కట్టిన రూ. 22,50,000 మొత్తం కాస్త రూ. 40,68,209గా మారబోతుంది. ఇక ఇందులో కూడా ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

2.సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (Sovereign Gold Bond)

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది బంగారంలో పెట్టుబడి పెట్టే పథకం. కాగా,ఈ స్కీమ్ లో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఇది టైలర్ మేడ్ స్కీమ్. అయితే ఈ గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. కనుక మీరు ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడి రాబడి బంగారం వాస్తవ ధర ప్రకారం మారుతుంది. ఇక SGBలో మీరు 100 గ్రాముల బంగారంపై మొత్తం రూ. 6,30,000 పెట్టుబడి పెడతారు. మీరు సంవత్సరానికి 2.50% అదనపు వడ్డీని కూడా పొందుతారు. అంటే, ఒక సంవత్సరంలో రూ.15,750 వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు వడ్డీ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

3.ఇండెక్స్ ఫండ్స్
ఇండెక్స్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ , ఇది నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్‌లను కొనుగోలు చేస్తుంది. ఇక ఇందులో కూడా మీరు నెల నెల రూ. 12500 ఇన్వేస్ట్ చేస్తే.. సంవత్సరానికి లక్ష రూ. 1,50,000 మొత్తం 15 సంవత్సరాలు పాటు ఇన్వేస్ట్ చేస్తే..ఇందులో కూడా రూ.22, 50,000 కాస్త రూ. 63,07,200 గా మారే అవకాశం ఉంటుంది.