Dharani
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 1963 నాటి పెట్రోల్ బిల్లుకు సంబంధించిన పేపర్ వైరల్ గా మారింది. ఆ వివరాలు..
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 1963 నాటి పెట్రోల్ బిల్లుకు సంబంధించిన పేపర్ వైరల్ గా మారింది. ఆ వివరాలు..
Dharani
ప్రసుత్తం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంధన ధరలే కాదు.. ప్రతీ నిత్యావసర సరుకుల ధరలు అలానే మండిపోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు అన్నట్లుగా మారాయి పరిస్థితులు. ఇక ఈ ఏడాది బియ్యం ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇక రెండు రోజుల నుంచి.. ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్దకు జనాలు భారీ ఎత్తున క్యూ కట్టారు. నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈలోపే కొందరు కేటుగాళ్లు అధిక ధరలకు పెట్రోల్ ను బ్లాక్ లో విక్రయిస్తూ.. జనాల జేబులు గుల్ల చేసే పనులు మొదలు పెట్టారు. అయితే చివరకు కేంద్ర హామీతో ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించారు. కానీ ఇప్పటికి కూడా బంకుల వద్ద క్యూ లైన్ మాత్రం తగ్గలేదు.
ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోలు ధరలు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 64 పైసల వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర లీటరుకు 97 రూపాయల 80 పైసల వద్ద కొనసాగుతుంది. ఇక నిన్న బ్లాక్ లో లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది అనే దానికి సంబంధించిన బిల్ రిసిప్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ రిసిప్ట్ లో ఉన్న దాని ప్రకారం ఓవ్యక్తి.. భారత్ పెట్రోల్ బంకులో 5 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నాడు. ధర ఎంతో ఊహించగలరా.. 3 రూపాయల 60 పైసలు. ఒక్క లీటర్ ధర కాదు.. ఐదు లీటర్ల ధర. అంటే లీటర్ పెట్రోల్ రేటు 72 పైసలు అన్నమాట. కనీసం రూపాయి కూడా కాదు. మరి ఇప్పుడో.. పెట్రోల్ ధర భారీగా పెరిగి.. 100 రూపాయల మార్క్ దాటేసింది. ఈ రిసిప్ట్ చూసిన వారు.. వార్నీ రూపాయి ఉంటే లీటర్ పెట్రోల్ వస్తుందా… ఇప్పుడు 100 రూపాయలు చేతిలో ఉన్నా.. లాభం లేదు కదా అంటున్నారు.
అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనుంది అనే వార్తలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ మీద సుమారు 8 నుంచి 10 రూపాయల వరకు ధర తగ్గిస్తారని.. అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. మరి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందో, లేదో చూడాలి.