iDreamPost

సిటీకి 15 కి.మీ. దూరంలో స్థలం.. దాదాపు 4 లక్షలు తగ్గింది! ఇదే మంచి ఛాన్స్!

100 Sq yd Plots At 12 Lakhs: స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే లాస్ అనేది ఉండదు. చాలా మంది వేరే వాటిలో పెట్టుబడి పెట్టే కంటే స్థలం మీదనే ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు. వేరే దేంట్లో పెట్టుబడి పెట్టినా గానీ మోసపోయే ఛాన్స్, నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే భూమిని నమ్ముకుంటే మోసం చేయదని నమ్మి పెట్టుబడి పెడుతుంటారు. అలాంటి భూమి సిటీకి 15 కి.మీ. దూరంలో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.

స్థలం కొనాలంటే ముందుగా చూడాల్సింది.. ఆ ఏరియా నివాసానికి అనుకూలమా? కాదా? అక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి తగినదా? కాదా? అనేది చూడాలి. స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ళలో లాభాలను తెస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇవే ప్రధానంగా చూసేవి. హైదరాబాద్ లో పెట్టుబడి పెడదామంటే స్థలాలు లేవు.. పైగా మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ లో అస్సలు అందుబాటులో లేవు. సిటీకి 10, 15 కి.మీ. దూరంలో ఎక్కడా కూడా గజం 50 వేలకు తక్కువ లేదు. 20 కి.మీ. దాటితేనే గానీ గజం 25 వేలు, 30 వేలకు దొరకడం లేదు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రాంతం సిటీలోదే. సిటీకి జస్ట్ 15 కి.మీ. దూరంలో ఉంది. అది కూడా బాగా డెవలప్ అయిన ప్రాంతం.

హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులు, మాల్స్, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ నివసించడానికి, అలానే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఆ ఏరియా కంకిపాడు. ఇది విజయవాడ నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది. 6 లేన్ హైవేకి 600, 65వ నంబర్ జాతీయ రహదారికి కేవలం కి.మీ. దూరంలో ఉంది. విజయవాడలో ఎక్కడ స్థలం కొనాలన్నా 15 వేలు, 18 వేలు, 20 వేలు ఇలా 30 వేల రేంజ్ లోనే ఉన్నాయి. కంకిపాడులోనే గజం 12 వేలకు వస్తుంది. వంద గజాల స్థలం కొనాలంటే 12 లక్షలు అవుతుంది.

ఇక్కడ చదరపు అడుగు స్థలం సగటున రూ. 1300 పడుతుంది. అంటే గజం స్థలం సగటున గజం రూ. 11,700 పడుతుంది. 2019లో సగటున గజం స్థలం రూ. 8,100 ఉండేది. ఐదేళ్ళలో 11,700 అయ్యింది. దాదాపు 4 వేల రూపాయలు పెరిగింది. వాస్తవానికి గజం రూ. 15 వేలు పైనే ఉండాలి. కానీ గత ఏడాది జూలై-సెప్టెంబర్ నెలల్లో గజం మీద రూ. 2700 తగ్గింది. ఈ ఏడాది వచ్చేసరికి గజం మీద రూ. 900 తగ్గింది. మొత్తం మీద గజం మీద రూ. 3600 తగ్గింది. ఈ లెక్కన వంద గజాల స్థలం మీద 3,60,000 తగ్గినట్టు. దాదాపు 4 లక్షలు తగ్గినట్టే. కాబట్టి ఇప్పుడే కంకిపాడులో స్థలం మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు కంకిపాడు అన్ని రకాలుగా డెవలప్ అయ్యిందని.. ఇక్కడ పెట్టుబడి పెడితే ఐదేళ్ళలో మంచి లాభాలను పొందవచ్చునని అంటున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి