nagidream
1 BHK@20 Lakhs: తక్కువ ధరకే సిటీలో ఫ్లాట్ కొనాలని భావిస్తున్నారా? అయితే మిడిల్ క్లాస్ వారికి ఇదే మంచి అవకాశం. మామూలుగా సిటీలో ఫ్లాట్స్ అంటే 30, 40 లక్షలు పైనే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సిటీలో మాత్రం తక్కువ ధరకే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
1 BHK@20 Lakhs: తక్కువ ధరకే సిటీలో ఫ్లాట్ కొనాలని భావిస్తున్నారా? అయితే మిడిల్ క్లాస్ వారికి ఇదే మంచి అవకాశం. మామూలుగా సిటీలో ఫ్లాట్స్ అంటే 30, 40 లక్షలు పైనే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సిటీలో మాత్రం తక్కువ ధరకే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
nagidream
స్థలం కొని.. మళ్ళీ ఇల్లు కట్టడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి చాలా మంది ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిల్డర్స్ కట్టినవి లేదా ఓనర్స్ కట్టినవి ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. రెంట్ కి ఇస్తే నెల నెలా మంచి ఆదాయం వస్తుంది. అలానే కొన్నాళ్ళకి దాని విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఫ్లాట్స్ కొనేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. హైదరాబాద్ సిటీలో 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం 35 లక్షలు అవుతుంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం 50, 60 లక్షలు అవుతుంది. అయితే హైదరాబాద్ లో 1 బీహెచ్కే, 2 బీహెచ్కే ఫ్లాట్స్ కి పెట్టే రేటుకి వైజాగ్ లో మంచి సెంటర్ లో ఫ్లాట్ వస్తుంది. హైదరాబాద్ 70 లక్షలు ఉన్న 2 బీహెచ్కే ఫ్లాట్ వైజాగ్ లో 40 లక్షలకే దొరుకుతుంది. ఇక 1 బీహెచ్కే ఫ్లాట్ అయితే 20 లక్షలకే దొరుకుతుంది.
వైజాగ్ సిటీకి గాజువాక జస్ట్ 2 కి.మీ. దూరంలో ఉంది. వైజాగ్ లో గాజువాక సిటీలో సగటున ఫ్లాట్ ధర ఒక చదరపు అడుగుకి రూ. 3,900 పడుతుంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కి అంటే 1000 చదరపు అడుగులకి 39 లక్షల రూపాయలు అవుతుంది. అదే 1 బీహెచ్కే ఫ్లాట్ కి సగటున 20 లక్షలు అవుతుంది. గాజువాకలో ధరలు ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉన్నాయి. గాజువాకలోని కైలాష్ నగర్ లో చదరపు అడుగు 5,700 రేంజ్ లో ఉంది. అంటే 600 చదరపు అడుగుల 1 బీహెచ్కే ఫ్లాట్ కి 34 లక్షలు అవుతుంది. ఓల్డ్ గాజువాకలో చదరపు అడుగు 4,600 పడుతుంది. అంటే 560 చదరపు అడుగుల 1 బీహెచ్కే ఫ్లాట్ కి 26 లక్షలు అవుతుంది. గాజువాకలో 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ పలికే ఫ్లాట్స్, ఇండివిడ్యువల్ హౌజ్ లు ఉన్నాయి.
2 బీహెచ్కే ఫ్లాట్స్ 29 లక్షల నుంచి 49 లక్షల రేంజ్ లో ఉన్నాయి. 3 బీహెచ్కే ఫ్లాట్స్ 49 లక్షల నుంచి కోటి 25 లక్షల రేంజ్ లో ఉన్నాయి. రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒక్కో వెంచర్ ని బట్టి ఒక్కోలా ఉన్నాయి. బిల్డర్స్ ఫ్లాట్స్, ఓనర్స్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఐదేళ్ళలో చదరపు అడుగు మీద వెయ్యి రూపాయలు పెరిగింది. అంటే 2019లో చదరపు అడుగు 2,900 ఉంటే ఇప్పుడు రూ. 3,900 అయ్యింది. ఐదేళ్ళలో 34.5 శాతం మేర పెరిగింది. రెంటల్ ఈల్డ్ కూడా 4 శాతం ఉంది. అప్పట్లో 29 లక్షలు పెట్టి 1000 చదరపు అడుగుల ఏరియా ఉన్న ఫ్లాట్ విలువ ఇప్పుడు.. 39 లక్షలు అయినట్టు. అంటే ఐదేళ్ళలో 10 లక్షలు లాభం వచ్చినట్టే. ఇప్పుడు కనీసం 1 బీహెచ్కే ఫ్లాట్ ని 20 లక్షల నుంచి 25 లక్షలకు కొంటే రాబోయే ఐదేళ్ళలో కనీసం 10 లక్షలైనా లాభం వచ్చే ఛాన్స్ ఉంది.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.