iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8 లోకి కమెడియన్ అలీ సోదరుడు?

  • Published Aug 23, 2024 | 5:03 PM Updated Updated Aug 23, 2024 | 5:03 PM

Ali Brother Khayyum In Bigg Boss 8 Telugu: ప్రస్తుతం ఎక్కడ చూసిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే..మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకులకు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ సీజన్ 8 షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కి సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

Ali Brother Khayyum In Bigg Boss 8 Telugu: ప్రస్తుతం ఎక్కడ చూసిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే..మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకులకు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ సీజన్ 8 షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కి సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

  • Published Aug 23, 2024 | 5:03 PMUpdated Aug 23, 2024 | 5:03 PM
బిగ్ బాస్ 8 లోకి  కమెడియన్ అలీ సోదరుడు?

బిగ్ బాస్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఉన్న బిగ్గెస్ట్ రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. ప్రతి భాషలోను ఈ షో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ షో కే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షోకు సంబంధించిన సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ఈ రియాల్టీ షో ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమివద సీజన్ కు సిద్ధమైంది. ఎప్పటిలాగానే సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లోగ్ ని కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ సోదరుడు  ఖయ్యూం బిగ్ బాగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో, హీరోయిన్లు సైతం ఈ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అలీ సోదరుడు ఖయ్యూమ్ ఎంట్రీ ఇస్తాడనే బలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. ఖయ్యూమ్..తన అన్న అలీ అంత పేరు తెచ్చుకోకపోయినా నటుడిగా, కమెడియన్‌గా  అలరించి ప్రేక్షకులను మెప్పించాడు. ఖయ్యూమ్  తెలుగు బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్‌ వెళ్లడం నూటికి 99 శాతం కన్ఫర్మ్ అయ్యాడని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఖయ్యూమ్ ఎంట్రీకి సంబంధించి..ఇప్పటికి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఖయ్యూమ్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే విడుదలైనా బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమో, ప్రమోషనల్ కంటెంట్ ఎంత ఆసక్తిని పెంచేసింది.  ఇటీవలే సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ లాంచ్ కానుందని వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై అందరి దృష్టి పడింది. ఇప్పటికీ హౌజ్‌లోకి వెళ్లేందుకు పది మంది సెలబ్రిటీలు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. లిమిట్ లెస్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. మరోసారి తనదైన స్టైల్ లో వ్యాఖ్యాతగా అలరించేందుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున రెడీ అయ్యారు. మరి.. బిగ్ బాస్ 8లోకి  ఖయ్యూమ్  అన్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss