iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: వీడియో: విష్ణు ప్రియ vs సోనియా.. అసలు గొడవేంటి? తప్పు ఎవరిదంటే?

  • Published Sep 09, 2024 | 1:34 PM Updated Updated Sep 09, 2024 | 4:47 PM

Vishnu Priya vs Soniya Who Is Wrong Explained: బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేవి సర్వ సాధారణం. అయితే కొన్ని గొడవలు మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి? అసలు ఎవరు తప్పు ఎవరు ఒప్పో తెలుసుకోవాల్సిందే అనే ఆసక్తి నెలకొంటుంది. అలాంటి గొడవ ఒకటి ఇప్పుడు విష్ణుప్రియ- సోనియా మధ్య జరిగింది. మరి.. వారిలో నిజంగానే తప్పు ఎవరిదో చూద్దాం.

Vishnu Priya vs Soniya Who Is Wrong Explained: బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేవి సర్వ సాధారణం. అయితే కొన్ని గొడవలు మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి? అసలు ఎవరు తప్పు ఎవరు ఒప్పో తెలుసుకోవాల్సిందే అనే ఆసక్తి నెలకొంటుంది. అలాంటి గొడవ ఒకటి ఇప్పుడు విష్ణుప్రియ- సోనియా మధ్య జరిగింది. మరి.. వారిలో నిజంగానే తప్పు ఎవరిదో చూద్దాం.

  • Published Sep 09, 2024 | 1:34 PMUpdated Sep 09, 2024 | 4:47 PM
Bigg Boss 8: వీడియో: విష్ణు ప్రియ vs సోనియా.. అసలు గొడవేంటి? తప్పు ఎవరిదంటే?

బిగ్ బాస్ హౌస్ లో కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ఎంత ఉంటుందో.. అలాగే కయ్యాలు- కొట్లాటలు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఒకరి మధ్య ఒకరికి ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా జరగకపోతే అది బిగ్ బాస్ హౌస్ అవ్వదు అనే చెప్పాలి. అలా ఇప్పుడు బాగా హైలెట్ అవుతున్న గొడవ ఏదైనా ఉందా అంటే? అది విష్ణుప్రియ- సోనియా ఆకుల మధ్య జరిగిన గొడవ అనే చెప్పాలి. ఆదివారం హోస్ట్ నాగార్జున కూడా మీ గొడవ నేను తీర్చలేను.. మీరే మాట్లాడుకోండి అనేశాడు. ఆ తర్వాతే వీళ్లు అస్సలు ఎందుకు కొట్టుకుంటున్నారు? వీరి మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది? ఆ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ప్రతి నిమిషం జరగవు. ఎక్కువ సమయం ఇంట్లో పనులు చేసుకోవడానికి.. ఉన్న వారితో ర్యాపో పెంచుకోవడానికే సరిపోతుంది. ఇలాంటి సమయంలో అర్థం చేసుకోవడమే కాదు.. అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి ఒక మిస్ అండర్ స్టాండింగే విష్ణు ప్రియ- సోనియా మధ్య జరిగింది. అయితే అది ఆ తర్వాత వాంటెడ్ గానే గొడవ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. వీళ్ల గొడవ హైలెట్ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ కూడా వారి మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ మరింత క్లారిటీ వస్తుంది. ఆ వీడియో స్పష్టంగా విష్ణుప్రియదు తప్పులేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఫన్నీగా చేయాలి అనుకున్న సీన్ ని.. సోనియా గొడవలా మార్చేసింది.

Soniya vs Vishnu priya

అసలు విషయం ఏంటంటే.. విష్ణు ప్రియ ఒక రిపోర్టర్ తరహాలో హౌస్ లో ఉన్న వారిని ప్రశ్నలు అడుగుతూ వచ్చింది. అలాగే సోనియాని కూడా అడిగింది. ఆమెను నిఖిల్ కి సంబంధించిన ప్రశ్న అడిగింది. అలా ఎందుకు అంటే.. నామినేషన్స్ లో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్న వాళ్లు.. ఇప్పుడు హౌస్ లో తెగ కలిసిపోయారు. సోనియానే తనకు కావాలి అన్నట్లు నిఖిల్ ప్రవర్తించడం కూడా అందరికీ అనుమానాలు తెప్పించాయి. అదే అనుమానం హౌస్ లో ఉన్న వారికి కూడా వచ్చింది. అందుకే వారి ఫ్రెండ్ షిప్ కి సంబంధించి విష్ణుప్రియ అలా అడిగేసింది. ముందు నుంచి మీరు కొట్టుకున్నారు. ఇప్పుడు మీ మధ్య ఫ్రెండ్ షిప్ వచ్చింది. అసలు ఏం జరిగింది అన్నట్లు అడిగింది. అందుకు సోనియా నో కామెంట్స్ అంటూ చెప్పేసింది. విష్ణుప్రియ కూడా అందుకు ఏమీ అనలేదు. చాలా స్మార్ట్ మీరు అంటూ కితాబిచ్చింది.

అక్కడితో టాపిక్ ఎండ్ చేయాలి అని సోనియా భావించింది. అందుకే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోతే ఏం అయ్యేది కాదు. సోనియాకే మంచి పేరు ఉండేది. కానీ, ఆమె అలా చేయలేదు. మళ్లీ వెనక్కి వచ్చి.. ఈ అ*ల్ట్ రేటెడ్ కామెడీలో నన్ను భాగం చేయకు అంటూ అనేసింది. విష్ణుప్రియకు ఫస్ట్ అర్థం కాలేదు. కానీ, అలా అనుకుందా అని వెంటనే సారీ కూడా చెప్పేసింది. సీత కూడా వెళ్లి నేను అలా అడగమని చెప్పలేదు. తను అడిగేసింది అంటూ చెప్పింది. విష్ణుప్రియ ఆ తర్వాత నన్ను తొక్కాలి అని చూస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అంటూ ఊగిపోయింది. అందరినీ తొక్కాలి అని చూస్తోంది అంటూ స్టేట్మెంట్ పాస్ చేసింది.

ఆ తర్వాత సోనియా బయట కూర్చుని ఏడ్చేసింది. ఆ సమయంలో విష్ణుప్రియ మళ్లీ బయటకు వచ్చి. నన్ను అనేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని ప్రశ్నించింది. అలాంటి మాట అసలు ఎలా వాడతావ్ అని ప్రశ్నించింది. నువ్వు ఒక్కదానివే పుణ్య స్త్రీ మరి అంటూ అనేసింది. ఆ మాట తప్పితే ఈ గొడవలో విష్ణుప్రియ తప్పు ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఆ ప్రశ్న తర్వాత నిఖిల్- తన మధ్య ఏదో ఉన్నట్లు అంటారేమో అని ముందే భయపడి అలా రియాక్ట్ అయ్యింది అన్నట్లు సోనియా మాటలు ఉన్నాయి. ఆ తర్వాత నిఖిల్- సోనియా కలిసే ఆడుతున్నారు అన్నట్లు ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. మరి.. విష్ణుప్రియ- సోనియా గొడవలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio