iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: వీడియో: నిఖిల్- సోనియా గొడవలు ఫేకా? లైవ్ లో బయటపడిన అసలు నిజం!

  • Published Sep 09, 2024 | 12:46 PM Updated Updated Sep 09, 2024 | 12:46 PM

Bigg Boss Telugu 8- Soniya Akula- Nikhil Maliyakkal: బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ శాశ్వత శత్రువులు ఉండరు. కచ్చితంగా ఒక్కసారి అయినా కలిసి కూర్చోవాల్సిందే మాట్లాడుకోవాల్సిందే. అయితే కావాలని ఏర్పరుచుకునే శత్రువులు మాత్రం ఉంటారు. వాళ్లు పైకి మాత్రమే శత్రువులు.. కానీ, లోపల మాత్రం కలిసే ఆట ముందుకు తీసుకెళ్తారు.

Bigg Boss Telugu 8- Soniya Akula- Nikhil Maliyakkal: బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ శాశ్వత శత్రువులు ఉండరు. కచ్చితంగా ఒక్కసారి అయినా కలిసి కూర్చోవాల్సిందే మాట్లాడుకోవాల్సిందే. అయితే కావాలని ఏర్పరుచుకునే శత్రువులు మాత్రం ఉంటారు. వాళ్లు పైకి మాత్రమే శత్రువులు.. కానీ, లోపల మాత్రం కలిసే ఆట ముందుకు తీసుకెళ్తారు.

  • Published Sep 09, 2024 | 12:46 PMUpdated Sep 09, 2024 | 12:46 PM
Bigg Boss 8: వీడియో: నిఖిల్- సోనియా గొడవలు ఫేకా? లైవ్ లో బయటపడిన అసలు నిజం!

బిగ్ బాస్ హౌస్ లో ఏదీ నిజం అనడానికి ఉండదు. ఏదీ అబద్ధం అని కొట్టిపారేసే సాహసం కూడా చేయలేరు. కానీ, ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడతారో ఎవరికీ తెలియదు. కొందరు అయితే హౌస్ లోకి వెళ్లక ముందే మాట్లాడేసుకుని హౌస్ లోకి వెళ్తారు. అలా వెళ్లిన తర్వాత పైకి మాత్రం గొడవలు పడుతున్నట్లు కనిపించి.. ఇద్దరూ కలిసి గేమ్ ని ప్లాన్ చేసి ఆడతారు. ఇలా చాలాసార్లు జరిగింది కూడా. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఆటను ఆడుతున్నారు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా నిఖిల్ మలియక్కల్- ఆకుల సోనియా మీద. వీళ్లిద్దరూ హౌస్ లో శత్రువులుగానే కనిపించారు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో అయితే ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లుగానే ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం తెగ క్లోజ్ అయిపోయారు. ఒకరి ఆటకు ఒకరు సలహాలు కూడా ఇచ్చుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అప్పటికప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నవాళ్లు.. శత్రువులుగా మారిపోవచ్చు. అప్పటికప్పుడు ఎనిమీస్ లా కనిపించిన వాళ్లు వెంటనే మిత్రులు అయిపోవచ్చు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అలాంటి ఒక సీన్ ఇప్పుడు సోనియా ఆకుల- నిఖిల్ మలియక్కల మధ్య జరుగుతోంది. వాళ్లు ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లు తెగ కొట్టేసుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం కలిసి కూర్చుని స్ట్రాటజీలు ప్లే చేసే వరకు వచ్చేశారు. వారి మధ్య నిజంగానే ఏదో ఉంది అని కంటెస్టెంస్ట్స్ కూడా అనుమానపడుతున్నారు. ఆ విషయాన్నే విష్ణుప్రియ హైలెట్ చేయాలని చూడగా.. ఆెతో పెద్ద గొడవ పెట్టుకుంది. అ*ల్ట్రీ కామెడీ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చేసింది. అందుకు సంబంధించి పెద్ద గొడవ కూడా జరిగింది. దానిని నాగార్జున కూడా తేల్చలేక చేతులెత్తేశాడు.

ఇప్పుడు జరుగుతున్న సీన్స్ చూస్తే వాళ్లిద్దరు కావాలనే గొడవలు పడ్డారేమో అనే అనుమానం ఆడియన్స్ కి కూడా రావచ్చు. ఎందుకంటే సోనియా మాట్లాడుతున్న మాటలు, వారి మధ్య బాండింగ్, ఆ ఫ్రెండ్ షిప్ చూస్తుంటే వాళ్లు హౌస్ బయటే ఫ్రెండ్స్ ఏమో అనే అభిప్రాయం రాకుండా పోదు. లైవ్ లో జరిగిన ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిఖిల్- సోనియా- నాగ మణికంఠ ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్లు ఒక క్లాన్ కాబట్టి ఒక దగ్గర ఉన్నారు అనుకోవచ్చు. అయితే నాగ మణికంఠ వెళ్లిపోయిన తర్వాత వీళ్లు అసలు మాటలు స్టార్ట్ చేశారు. మణికంఠ వెళ్లిపోయాడని కన్ఫామ్ చేసుకుని మరీ సోనియా ఆమె చెప్పాలి అనుకున్నది స్టార్ట్ చేసింది. సోనియా- నిఖిల్ కి గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తోంది. అలా ఎందుకు చేస్తున్నావ్? ఇలా ఎందుకు చేస్తున్నావ్? నీ పాయింట్స్ నువ్వే ఎందుకు బయట పెడుతున్నావ్ అంటూ ఆమె ప్రశ్నించడం వైరల్ అవుతోంది. గేమ్ ఎలా ఆడాలో కూడా నిఖిల్ కి నేర్పిస్తూ కనిపించింది.

నిఖిల్- సోనియా మధ్య జరిగిన సంభాషణ చూస్తే.. “అరె పిచ్చెదవా రా.. నాకు అర్థం కాదు. ఏదైనా అంటే నా పాయింట్ ఇది అని నువ్వే చెప్పుకుంటావ్. ఎప్పుడు ఎలుగుతదిరా నీకు నాకు అర్థం కాదు. వాడు వీడు అని కాదు.. నీకు మధ్యాహ్నం చెప్పింది కూడా ఇదే. నీకు మంచి అనిపిస్తే చెయ్యి.. దానికి నాకు క్లారిటీ లేకుండా చేసినా.. ఇది లేకుండా చేసినా గవన్నీ ఎందుకు రా? చేసేటప్పుడు క్లారిటీ లేకుండా కాదు.. నార్మల్ గా ఎమోషనల్ గా చేస్తున్నావ్. దాన్ని వేరే వాళ్లకు చెప్పడం ఎందుకు? అవునా సరే అని ఊరుకోవాలి. నువ్వే పాయింట్స్ ఇస్తున్నావ్. నువ్వు ఈ మాటలు వినిపించుకోకపోతే మాత్రం నువ్వు ముందుకు కంటిన్యూ కాలేవు. నీ పాయింట్స్ నువ్వు ఇయ్యకు అని చెప్తున్నా. నువ్వు వంట బాగా చేస్తావ్. నువ్వు అందరితో బాగా మాట్లాడతావ్. నీకు అంతా పాజిటివ్ గా ఉన్నప్పుడు అలాగే ఉండు. ఎందుకు నెగిటివ్?” అంటూ సోనియా ఆకుల.. నిఖిల్ కి గీతోపదేశం చేసింది. నిఖిల్ కూడా అది కాదురా నాన్న.. అంటూ సోనియాకి వేళ్లు విరగదీస్తూ.. మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ల మాటలు విన్న ఆడియన్స్ మాత్రం ఏం లేకుండానే మంచిగా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారా? విష్ణుప్రియ చెప్పింది ఇదే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నిఖిల్- సోనియా కలిసే ఆడుతున్నారు ఏమో? అనే అనుమానం ఈ వీడియో చూసిన తర్వాత బలపడింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. నిఖిల్- సోనియా ఆకుల కలిసే ఆడుతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş