iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నామినేషన్స్ లో కిరాక్ సీత విశ్వరూపం.. ఒక్కొక్కరిని ఆడేసుకుంది..!

  • Published Sep 09, 2024 | 10:58 AM Updated Updated Sep 09, 2024 | 10:58 AM

Bigg Boss Telugu 8 - Day 8 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి వారం కొత్త పరిచయాలు , ఆటలు , గొడవలు , మనస్పర్థలతో గడిచిపోయింది. ఇక మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినా సంగతి చూసే ఉంటారు. ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ మొదలైపోయాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Bigg Boss Telugu 8 - Day 8 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి వారం కొత్త పరిచయాలు , ఆటలు , గొడవలు , మనస్పర్థలతో గడిచిపోయింది. ఇక మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినా సంగతి చూసే ఉంటారు. ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ మొదలైపోయాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 09, 2024 | 10:58 AMUpdated Sep 09, 2024 | 10:58 AM
Bigg Boss 8: నామినేషన్స్ లో కిరాక్ సీత విశ్వరూపం.. ఒక్కొక్కరిని ఆడేసుకుంది..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయ్యి.. ఒక వారం గడిచిపోయింది. అప్పుడే హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి. ఒకరిని మించి మరొకరు పెర్ఫార్మ్ చేయడానికి.. ప్రయత్నిస్తూ.. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఇక మొదటి వారం చిన్న చిన్న కారణంలకే భారీ రేంజ్ లో నామినేషన్స్ జరిగాయి.. ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఊహించినట్లుగానే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ మొదలైపోయాయి. ఈ వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగనున్నాయి. తాజగా దీనికి సంబంధించిన డే 8 ప్రోమోని రిలీజ్ అయింది . ఈ వారం ఎవరెవరు నామినేటెడ్ లిస్ట్ లో ఉన్నారో .. ఎవరెవరికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయో చూసేద్దాం.

డే 8 ప్రోమోని గమనిస్తే కనుక.. మొదటి నుంచి హౌస్ లో కాస్త స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉన్నది ఉన్నట్లు.. చెప్పే వారు ఎవరైనా ఉన్నారంటే అది కిరాక్ సీత మాత్రమే.. ఇది అందరికి నచ్చదు కాబట్టి మొదటి వారం నామినేషన్స్ హౌస్ లో ఈమె గురించి బజ్ బాగానే నడించింది. ఇక ఇప్పుడు రెండో వారం చూసినట్లయితే కిరాక్ సీత విశ్వరూపం చూపిస్తుందని చెప్పి తీరాలి. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలకొట్టినట్లు చెప్తూ.. నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్స్ చెప్పడంతో.. అది కాస్త డిస్కషన్స్ కు దారితీసింది. ఈ క్రమంలో.. ప్రేరణను , సీత నామినేట్ చేయడంతో.. వీరి ఇద్దరి మధ్యలో పెద్ద పంచాయితీనే జరిగింది. బయట ఫ్రెండ్ షిప్ పెట్టుకుని ఇక్కడ ఫాలో అవ్వొద్దు అంటూ సీత చెప్పడంతో.. ప్రేరణ ఫైర్ అయిపొయింది. ఇక ఆ తర్వాత.. అలాగే సోనియా సీతను నీకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పి నామినేట్ చేయడంతో.. సీత కూడా ఫైర్ అయిపోయి.. తన కోసం తానే స్టాండ్ తీసుకుని ఇచ్చిపడేసింది. మొత్తానికి ఈ వారం అందరికి కిరాక్ సీత టార్గెట్ అయినట్లు అనిపిస్తుంది.

ఇక ఈమె కాకుండా.. ఆదిత్య ఓం, విష్ణు ప్రియ , నైనిక కూడా నామినేట్ అయ్యారు.. ఇప్పటికి రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే వీరు మాత్రమే నామినేషన్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి నామినేటెడ్ లిస్ట్ గురించి తెలియాలంటే ఇంకొంత సేపు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటే.. అది కేవలం శేఖర్ బాషా వేసే పంచ్ లు, నిఖిల్ సోనోయా మధ్య నడిచే ట్రాక్.. మొదటి నుంచి హౌస్ లో పర్ఫెక్ట్ గా అన్ని చేస్తూ ఉంటున్న కిరాక్ సీత.. ఇక ఈ వారం హౌస్ మేట్స్ లో ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో.. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş