iDreamPost
android-app
ios-app

వీడియో: రెండో రోజో రచ్చ మొదలు.. బేబక్క vs సోనియా vs యష్మీ!

  • Published Sep 02, 2024 | 5:49 PM Updated Updated Sep 02, 2024 | 5:49 PM

Bigg Boss Telugu 8 Latest Promo- Soniya Vs Bebakka vs Yashmi Gowda: బిగ్ బాస్ హౌస్ లో చాలానే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గొడవల విషయంలో సోనియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న ముగ్గురితో సోనియాకి గొడవ జరిగింది.

Bigg Boss Telugu 8 Latest Promo- Soniya Vs Bebakka vs Yashmi Gowda: బిగ్ బాస్ హౌస్ లో చాలానే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గొడవల విషయంలో సోనియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న ముగ్గురితో సోనియాకి గొడవ జరిగింది.

  • Published Sep 02, 2024 | 5:49 PMUpdated Sep 02, 2024 | 5:49 PM
వీడియో: రెండో రోజో రచ్చ మొదలు.. బేబక్క vs సోనియా vs యష్మీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పటి నుంచి ఎలాంటి వార్త వచ్చినా కూడా అది సెన్సేషన్ అయ్యేలాగే ఉంది. ఇప్పటి వరకు అందరూ హౌస్ లోకి వెళ్లిన వాళ్లు.. ముక్కు మొఖం తెలియనివాళ్లు.. ఇలా అయితే ఎలా అని కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు అసలు ఆట మొదలైంది. బిగ్ బాస్ ఇలా కంటెస్టెంట్స్ ని తీసుకున్నాడు అంటే కచ్చితంగా ఏదో ఉంది అని నమ్మాలి. అది నిజమని నమ్మడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఎందుకంటే రెండోరోజు అసలు ఆటమ మొదలు అయిపోయింది. నిజానికి మొదటిరోజే గొడవలు షురూ అయ్యాయి. రెండోరోజుకు అవి రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఏ చిన్న విషయం అయినా కూడా హీరోయిన్ సోనియా తన వాయిస్ రైజ్ చేస్తోంది. ఇప్పటికే ఆర్జే శేఖర్ బాషాతో చిన్న గొడవ అయ్యింది. ఇప్పుడు ఈమెకు బెజవాడ బేబక్క- యష్మీ గౌడతో గొడవ జరిగింది. ఆ విషయాన్ని ఈరోజు విడుదల చేసిన రెండో ప్రోమోలో చూపించారు.

కొత్తగా చీఫ్:

ప్రతి సీజన్ లో హౌస్ కి కెప్టెన్ ఉంటాడు. వారానికి ఒక కెప్టెన్ ఉంటాడు. అతను ఇంటిని చక్కబెడతాడు. జరగాల్సిన పనులు చేయిస్తాడు. అయితే ఈసారి హౌస్ కి కెప్టెన్ ఎవరూ ఉండరు అన్న విషయం తెలిసిపోయింది. ఈసారి సీజన్ మొత్తానికి అసలు కెప్టెన్ ఉండడు అని తేల్చేసారు. అయితే హౌస్ కి సంబంధించి పనులు జరగాలి కదా. అందుకే ఈసారి చీఫ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే చీఫ్ అంటే ఎవరు పడితే వాళ్లు అవ్వరు కదా? అందుకే దానికోసం కొన్ని టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హౌస్ లో చాలా మంది చీఫ్ గా అయిపోయారు అనిపిస్తోంది. మిగిలిన బేబక్క, నిఖిల్, నైనికా, అఫ్రీదీలకు మరో అవకాశం ఇవ్వాలి అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే సోనియాకి యష్మీ గౌడకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉదాహరణకు యష్మీ పేరు తీసుకు రాగానే.. అందుకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను ఎందుకు ప్రతిసారి లాగుతున్నావ్ అంటూ కేకలు వేసింది. మరోవైపు నిఖిల్ నేను మాట్లాడుతాను ఆగు అంటూ అరిచేశాడు. ఇంక అంతకన్నా ముందు బెజవాడ బేబక్కతో హీరోయిన్ ఆకుల సోనియాకి వివాదం జరిగింది. బేబక్క ఫుడ్ ప్రిపేర్ చేయకుండా రిలాక్స్ అవుతుంటే.. వంట చేయచ్చు కదా.. మా ఆకలిని కాస్త రెస్పెక్ట్ చేయండి అంటూ సోనియా కామెంట్ చేసింది. ఆ మాటలకు బేబక్క కూడా హర్ట్ అయ్యింది. అంటే సడెన్ గా టాస్క్ పెడితే వంట ఎలా ప్రిపేర్ చేస్తారు? అనేది సోనియా వాదన.

అయితే సోనియా మాటలకు బేబక్క కూడా కాస్త నొచ్చుకున్నట్లే కనిపించింది. అయితే ఈ విషయంలో మాత్రం పెద్దగా రియాక్ట్ అయినట్లు ఈ ప్రోమోలో చూపించలేదు. కానీ, ఈ విషయంలో బేబక్క కూడా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యే అవకాసం ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చిన రెండు ప్రోమోలు చూస్తే.. బిగ్ బాస్ ఈసారి షోని గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది. గొడవలు, కొట్లాటలు కూడా గట్టిగానే జరిగేలా ఉన్నాయి. మరి.. సోనియా దూకుడుకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom