iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: విష్ణు ప్రియకి ఇది వేకప్ కాల్.. మేల్కోకపోతే ఎలిమినేషనే!

  • Published Sep 09, 2024 | 3:01 PM Updated Updated Sep 09, 2024 | 4:48 PM

Bigg Boss Telugu 8- Vishnupriya in Danger Zone: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విష్ణుప్రియకి మంచి ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. అయితే అలాంటి విష్ణుప్రియ మరో రెండు వారాల్లో ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. అసలు అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం.

Bigg Boss Telugu 8- Vishnupriya in Danger Zone: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విష్ణుప్రియకి మంచి ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. అయితే అలాంటి విష్ణుప్రియ మరో రెండు వారాల్లో ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. అసలు అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం.

  • Published Sep 09, 2024 | 3:01 PMUpdated Sep 09, 2024 | 4:48 PM
Bigg Boss 8: విష్ణు ప్రియకి ఇది వేకప్ కాల్.. మేల్కోకపోతే ఎలిమినేషనే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో వెరీ పాపులర్ పర్సన్, కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున విష్ణుప్రియ పేరు చెప్పేస్తారు. నిజానికి అదే నిజం కూడా. హౌస్ లో ఉన్న అందరు ఇంటి సభ్యుల్లో కూడా విష్ణుప్రియానే పాపులర్, తెలుగు వాళ్లకు బాగా తెలిసిన అమ్మాయి కూడా. అయితే ఇదంతా బయట వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే హౌస్ లోకి వెళ్లిన తర్వాత కేవలం వాళ్ల ఆట మీద ఆధారపడే వాళ్లు ముందుకు వెళ్లడం అనేది ఉంటుంది. లేదంటే ఎంతటి వాళ్లు అయినా కూడా కచ్చితంగా బయటకు రావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లోకే ఇప్పుడు విష్ణుప్రియ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తన పేరు హౌస్ లో సరిగ్గా వినిపించకపోవడం మాత్రమే కాకుండా.. అసలు హౌస్ లో ఉందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. విష్ణుప్రియాకు సంబంధించి ఆదివారం జరిగింది వేకప్ కాల్ అనే చెప్పాలి.

విష్ణుప్రియ ఏ ఉద్దేశంతో హౌస్ లో సైలెంట్ గా ఉంటోందో ఆవిడకే తెలియాలి. ఎందుకంటే బయట ఏమో హైపర్ పిల్ల, హైపర్ యాక్టివ్, సీమటపాకాయ్ వంటి బిరుదులు సొంతం చేసుకుని హౌస్ లో మాత్రం అస్సలు యాక్టివ్ గా లేదు. ఆమె చాలా రేర్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ వస్తోంది. ఎక్కడా కూడా కంటెంట్ కి స్కోప్ లేకుండా జాగ్రత్త పడుతోంది. సోనియాతో జరిగిన గొడవతోనే విష్ణుప్రియ పేరు కాస్త ప్రేక్షకుల్లో నలిగింది. ఒకవైపు సోనియా సందర్భం, సంబంధం లేకపోయినా కూడా అందరినీ ఒకసారి అలా టచ్ చేసి రచ్చ చేస్తోంది. కానీ, విష్ణుప్రియ మాత్రం చాలా పద్ధతిగా తన పరిధిలో తాను ఉంటూ జాగ్రత్తగా ఆడుతోంది. ఒకవేళ ఎలా ఆడితే ఎలాంటి పేరు వస్తుందో.. ట్యాగ్ ఏమైనా అంట గడతారేమో అనే భయంతో ఆడుతోందో.. లేక నేను కచ్చితంగా హౌస్ లో ఉంటాను అనే ధైర్యంతో అలా ఆడుతోందో ఆమెకే తెలియాలి.

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియకు కావాల్సినంత స్కోప్ ఉంది. కానీ, ఆమె మాత్రం రిజర్వ్డ్ గానే ఆడాలి అని ప్రయత్నిస్తోంది. ఇదే ఆట కొనసాగిస్తే మాత్రం విష్ణుప్రియ రెండు, మూడు వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని బిగ్ బాస్ కూడా కన్ఫార్మ్ చేశాడు. హౌస్ లో ఆమె పొజిషన్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమైపోయింది. ఆదివారం హౌస్ లో జరిగిన సేవింగ్స్ చూస్తే ఆ విషయం క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏంటంటే.. మొదటి వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో విష్ణుప్రియాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. పడే అవకాశం కూడా ఆమెకే ఉంది. కానీ, సేవింగ్ చేసే ప్రక్రియలో మాత్రం అలా చూపించలేదు.

బయట ఎవరి పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి అనే కోణంలో సేవింగ్ చేస్తూ వెళ్లారు. అందులో భాగంగానే మొదట సోనియా సేవ్ అయితే.. తర్వాత శేఖర్ బాషా, ఆ తర్వాత పృథ్వీరాజ్, నాలుగో స్థానంలో విష్ణుప్రియ సేవ్ అయ్యింది. ఆరుగురు ఉంటే నాలుగో స్థానంలో విష్ణుప్రియ సేవ్ అయ్యింది అంటే ఆమెకు అప్పుడే అర్థమైపోయాలి.. ఆమె పొజిషన్ చాలా డేంజర్ లో ఉంది అని. ఇకనైనా విష్ణుప్రియ గనుక తన ఆటను మార్చుకోకపోతే కచ్చితంగా హౌస్ లో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందుకే ఇంక విష్ణుప్రియ గేర్ మార్చి ఆటలో స్పీడు పెంచాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. విష్ణుప్రియ ఆట మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom