iDreamPost
android-app
ios-app

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే-2 ప్రోమో.. మొదలైన నామినేషన్స్ రగడ!

  • Published Sep 03, 2024 | 12:07 PM Updated Updated Sep 03, 2024 | 12:20 PM

Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సారి తొలి రోజే నామినేషన్స్ రగడ ప్రారంభమైంది.

Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సారి తొలి రోజే నామినేషన్స్ రగడ ప్రారంభమైంది.

  • Published Sep 03, 2024 | 12:07 PMUpdated Sep 03, 2024 | 12:20 PM
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే-2 ప్రోమో.. మొదలైన నామినేషన్స్ రగడ!

బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న షోల్లో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఒకటి. ఇటీవలే ఈ షోకు సంబంధించి సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసింది. గతంలో కంటే భిన్నంగా ఈ షో నడవనందనే విషయం ఇప్పటికే వివిధ ప్రోమోలా ద్వారా అర్థమైంది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే.. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే వాడు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో చూస్తే..వారికి వారే గొడవలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.  తాజాగా ఈ షోకి సంబంధించిన డే 2 ప్రోమోను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. బిబి 8కు సంబంధించిన తాజాగా ప్రోమో ఆడియన్స్ కు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.

ఇక ప్రోమో చూసినట్లు అయితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పట్టుకొనే ఉండండి అనే టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రోమోలో ఆర్జే శేఖర్ పాషా హైలెట్ గా నిలిచాడు. నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌కి చీఫ్‌గా నిఖిల్, నైనిక, యష్మీ గౌడ ఎంపికయ్యాయరు. దీంతో ఈ ముగ్గురికి నామినేషన్స్ నుంచి ఇమ్యినిటీ లభించింది. తొలివారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నాగ మణికంఠ, బేబక్క, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, విష్ణు ప్రియ,శేఖర్ బాషాలు నామినేషనల్ లో నిలిచారు. నామినేషన్స్‌లో పనికొచ్చే వాలిడ్ రీజన్ కంటే..  అనవసరపు కారణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రతి సీజన్‌లో వీటిని చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లోని బిగ్ బాస్ లో తొలివారం నామినేషన్స్‌లో కూడా చాలా వరకూ ఇవే కనిపించాయి. ప్రతి సీజన్‌లో కూడా తొలివారం నామినేషన్‌కి అందరూ చెప్పే కారణం ఏంటంటే.. కలవడం లేదనే. కాబట్టి అదే కారణంతో  మణికంఠ ను హౌస్‌లో వాళ్లంతా మూకుమ్మడిగా నామినేట్ చేశారు. అలానే బేబక్కకు సోనియా ఆకులకు మధ్య మధ్య కుక్కింగ్ విషయంలో పెద్ద రగడే జరిగింది. అలానే ప్రేరణ సైతం సోనియాపై ఫైర్ అయ్యింది. అదే విధంగా శేఖర్ బాషా సైతం తనదైన తీరులో తోటి కంటెస్ట్ కు ఆన్సర్ ఇచ్చాడు. మొత్తంగా ప్రోమో చూసినట్లు అయితే.. హౌస్ లో తొలివారంలో ఓ రేంజ్ లో నామినేషన్ రగడ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు వీక్షించి.. ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş