iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: షాకిచ్చిన బిగ్ బాస్.. విన్నర్ కి మిగిలేది గుండు సున్నానే.. ఇదే ప్రూఫ్!

  • Published Sep 09, 2024 | 5:18 PM Updated Updated Sep 09, 2024 | 5:18 PM

Bigg Boss Telugu 8- Big Twist In Prize Money: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ట్విస్టులు, టర్నులు ఉంటాయి అని చాలానే ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే మెయిన్ ట్విస్ట్ మాత్రం ప్రైజ్ మనీలో పెట్టేశారు. సున్నా నుంచి ప్రైజ్ మనీ స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ, ఆఖరికి విన్నర్ కి ఆ సున్నానే ఇచ్చేలా ఉన్నారు.

Bigg Boss Telugu 8- Big Twist In Prize Money: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ట్విస్టులు, టర్నులు ఉంటాయి అని చాలానే ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే మెయిన్ ట్విస్ట్ మాత్రం ప్రైజ్ మనీలో పెట్టేశారు. సున్నా నుంచి ప్రైజ్ మనీ స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ, ఆఖరికి విన్నర్ కి ఆ సున్నానే ఇచ్చేలా ఉన్నారు.

  • Published Sep 09, 2024 | 5:18 PMUpdated Sep 09, 2024 | 5:18 PM
Bigg Boss 8: షాకిచ్చిన బిగ్ బాస్.. విన్నర్ కి మిగిలేది గుండు సున్నానే.. ఇదే ప్రూఫ్!

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే ఎవరైనా టక్కున బిగ్ బాస్ అనేస్తారు. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుని 8వ సీజన్ ని కూడా స్టార్ట్ చేసుకుంది. అందులో ఒక వారం కూడా గడచిపోయింది. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే.. ఆ షోలో వచ్చే ప్రైజ్ మనీ, షో తర్వాత వచ్చే ఆఫర్స్ కోసం అంటారు. అయితే షో ముగిసిన తర్వాత ఆఫర్స్ వస్తాయా అంటే? ఎవరూ కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. కానీ, గెలిస్తే మాత్రం ప్రైజ్ మనీ కింద రూ.50 లక్షలు వస్తాయి. ఒక వ్యక్తి లైఫ్ లో సెటిల్ కావడానికి, కాస్తో కూస్తో ఫైనాన్షియల్ సపోర్ట్ పొందడానికి ఆ అమౌంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈసారి సీజన్ కి సంబంధించి ఆ సంతృప్తి కూడా ఉండదు అని అర్థమవుతోంది. ఎందుకంటే ఈసారి ప్రైజ్ మనీ చూస్తే విన్నర్ కు ఏమీ మిగిలేలా కనిపించడం లేదు. అసలు విషయం ఏంటో చూద్దాం.

బిగ్ బాస్ అనగానే కంటెస్టెంస్ట్ గా హౌస్ లోకి వెళ్లిన ప్రతి ఒక్కరికి వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ ఉంటుంది. అలాగే ఎవరైతే షోలో విన్నర్ గా నిలుస్తారో వారికి ప్రైజ్ మనీ కూడా దక్కుతుంది. అయితే ఆ ప్రైజ్ మనీ ఎంత అంటే విన్నర్ కి తెలుగులో అనౌన్స్ చేసే ప్రైజ్ మనీ అక్షరాలా రూ.50 లక్షలు. అయితే హౌస్ లో టాప్ 5లో ఉన్న వారికి ఒక సూట్ కేస్ పంపి ఆఫర్ ఇస్తారు. ఆ సూట్ కేసులో ఉన్న మొత్తాన్ని ఒకవేళ కంటెస్టెంట్ గనుక తీసుకుంటే.. అతను హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలాగే ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీలో నుంచి తగ్గించేస్తారు. ఎప్పుడూ ఉండేలా కాకుండా.. ఈసారి ట్విస్టులు, టర్నులు అంటూ చాలానే ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఆ ట్విస్టుల్లో ఒకటి ప్రైజ్ మనీ జీరో నుంచి ప్రారంభం అవుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ వారంలో పడిన కష్టానికి తగిన విధంగా ఆ ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. మొదటి వారం హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ల కష్టం చూసి రూ.5 లక్షలు అయితే ప్రకటించేశాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఆ రూ.5 లక్షలను వారి ఖాతాలో వేయలేదు. అంతకన్నా ముందు వారికి ఒక ఏవీ చూపించాడు. ఆ ఏవీలో హౌస్ మేట్స్ చేసిన తప్పులు, వాళ్లు ఇంగ్లీష్ లో ఎన్నిసార్లు మాట్లాడారు అనే విషయాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని వంకగా చూపి రూ.2 లక్షలు కోసేసి.. కేవలం రూ.3 లక్షలు మాత్రమే తొలివారం సంపాదన కింది ప్రైజ్ మనీ ఖాతాలో వేశారు. ఈ పాయింట్ ప్రకారం చూస్తే.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ప్రైజ్ మనీ కింద వచ్చేదీ ఏమీ లేదు అని అర్థమవుతోంది.

బిగ్ బాస్ హౌస్ అంటే రూల్స్ బ్రేక్ చేయడం సర్వ సాధారణం. రూల్స్ బ్రేక్ చేయకపోతే కంటెస్టెంట్స్ ఎలా అవుతారు? అలా రూల్స్ బ్రేక్ చేసినందుకు డబ్బులు కోసుకుంటూ పోతే.. ఇంక విన్నర్ కి మిగిలేది ఏమీ ఉండదు. అలాగే ఆఖరి వారంలో ఒక సూట్ కేస్ ఇచ్చి.. ప్రైజ్ మనీలో కొంత మొత్తాన్ని తిరిగి పంపేశాడు అనుకోండి ఇంకేముంటుంది? షో గెలిచాడు అనే పేరు తప్ప.. ఏమీ ఉండదు. ఇంట్లో పెట్టుకోవడానికి టైటిల్ ఉంటుంది. కానీ, ప్రైజ్ మనీలోనే పెద్ద గుండు సున్నా ఉంటుంది. మరి.. ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet