iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8 లో ఫస్ట్ వీక్ వీళ్ళే నామినేట్ అవ్వడం వెనుక రీజన్ ఏంటంటే!

  • Published Sep 03, 2024 | 2:44 PM Updated Updated Sep 03, 2024 | 2:44 PM

Bigg Boss 8 First Week Nominations: బిగ్ బాస్ లవర్స్ కు మరికొద్ది రోజులు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ లభించనుంది. షో స్టార్ట్ అయ్యి ఇంకా రెండు రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈ వారం నామినేటెడ్ లిస్ట్ కూడా వచ్చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Bigg Boss 8 First Week Nominations: బిగ్ బాస్ లవర్స్ కు మరికొద్ది రోజులు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ లభించనుంది. షో స్టార్ట్ అయ్యి ఇంకా రెండు రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈ వారం నామినేటెడ్ లిస్ట్ కూడా వచ్చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 03, 2024 | 2:44 PMUpdated Sep 03, 2024 | 2:44 PM
బిగ్ బాస్ 8 లో ఫస్ట్ వీక్ వీళ్ళే  నామినేట్ అవ్వడం వెనుక రీజన్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా రెండు రోజులు గడిచిపోయాయి. మొదటి రోజు ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం.. హౌస్ చూడడం.. ఇలా సరదా సరదాగా సాగిపోయింది. ఇక అసలు కథ నిన్నటినుంచి మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాదోపవాదాలు, మాటల యుద్దాలతో.. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. ఇక ఈరోజు ప్రోమోలో నామినేషన్స్ గురించి చూపించారు. ఈ వారం నామినేటెడ్ లిస్ట్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు.. నాగ మణికంఠ, బేబక్క, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, విష్ణు ప్రియ, శేఖర్ బాషా , అసలు వీళ్ళే నామినేట్ అవ్వడం వెనుక రీజన్ ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. మరి దాని వెనుక ఉన్న కారణాలేంటో చూసేద్దాం.

నామినేషన్స్ విషయం గురించి అందరికి తెలిసిందే.. ఒక్కోసారి వ్యాలిడ్ రీజన్ లేకపోయినా కూడా.. ఎదో ఒక రీజన్ చెప్పేసి.. నామినేట్ చేస్తూ ఉంటారు.ఒక్కోసారి వాళ్ళు ఒంటరిగా ఉన్నారని.. సరిగా కలవడం లేదని.. అసలు పాయింట్ లేని దానికి కూడా నామినేట్ చేసిన సీన్స్ చూసేశాము. ఇక ఈ వారం దాదాపు అదే రిపీట్ అవ్వబోతున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం అందరికి బాగా టార్గెట్ అయింది నాగ మణికంఠ. ఎందుకంటే ఒకరిని లక్కీ డ్రా లో ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పడంతో.. మెజారిటీ మెంబర్స్ మణికంఠ పేరు చెప్పారు. దీనితో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. కానీ అది ఫేక్ అని తేల్చేసారు. అయినా సరే అప్పటికే హర్ట్ అయినా మణికంఠ ఒంటరి పోరాటం మొదలెట్టాడు. దీనితో అతనికి సింపథీ వచ్చేసింది. దీనితో నామినేటెడ్ టార్గెటెడ్ లిస్ట్ లో ముందున్నాడు.

ఇక నెక్స్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరితో ఉంటారో వాళ్ళని నామినేట్ చేయడం కామన్.. ఈ సీజన్ లో క్రేజ్ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియ అనే చెప్పి తీరాలి. సో ఈమె కూడా నామినేటెడ్ లిస్ట్ లో ఉంది. ఇక ఆ తర్వాత శేఖర్ బాషాకు కూడా బయట గత కొద్దీ రోజులుగా అదే క్రేజ్ లభిస్తుంది కాబట్టి.. ఇతనిని కూడా నామినేట్ చేశారు. సోనియా ఆకుల.. రెండు రోజుల నుంచి గమనిస్తే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. దానిని కొంతమంది తీసుకోలేరు కాబట్టి.. ఈ అమ్మడిని కూడా నామినేషన్ లిస్ట్ లో వేశారు. ఇక పృథ్విరాజ్ ఇప్పటివరకు అసలు సరిగా ఎవరితోనూ ర్యాపొ లేదు కాబట్టి.. ఇతను నామినేట్ అయ్యాడు. ఇక బెబక్క విషయానికొస్తే.. గత సీజన్స్ అన్నిటిలో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా వారు ఈ ఏజ్ గ్రూప్ వారే ఉన్నారు కాబట్టి.. ఈమెను నామినేట్ చేశారు. వీరిలో డేంజర్ జోన్ లో ఉన్నది బెబక్క , పృద్విరాజ్ అని చెప్పొచ్చు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet