iDreamPost
android-app
ios-app

Sonia Akula Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన RGV హీరోయిన్ సోనియా.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

  • Published Sep 02, 2024 | 12:45 PM Updated Updated Sep 02, 2024 | 1:30 PM

Sonia Akula Bigg Boss 8 Telugu, Biography: బుల్లి తెర రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 .. సెప్టెంబర్ 1 నుంచి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇక ఈ సీజన్ లో ఎంతో మంది కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో ఆర్జీవీ హీరోయిన్ అంటూ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చేసింది. అసలు ఆమె ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో చూసేద్దాం.

Sonia Akula Bigg Boss 8 Telugu, Biography: బుల్లి తెర రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 .. సెప్టెంబర్ 1 నుంచి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇక ఈ సీజన్ లో ఎంతో మంది కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో ఆర్జీవీ హీరోయిన్ అంటూ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చేసింది. అసలు ఆమె ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో చూసేద్దాం.

  • Published Sep 02, 2024 | 12:45 PMUpdated Sep 02, 2024 | 1:30 PM
Sonia Akula Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన RGV హీరోయిన్ సోనియా.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1నుంచి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రోజే భారీ అంచనాలతో 14 మంది కంటెస్టెంట్స్ తమదైన శైలిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వారితో పాటు లాంచ్ ఈవెంట్ కు నాని , రానా, నివేద థామస్ , అనిల్ రావిపూడి లాంటి ఎంతో మంది గెస్ట్స్ అటెండ్ అయ్యారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో కొంతమంది గురించి ఆల్రెడీ ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. ఇక మిగిలిన వారి గురించి అప్పుడే సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. వారిలో ముఖ్యంగా ఆర్జీవీ హీరోయిన్ అంటూ ఎంట్రీ ఇచ్చిన సోనియా ఆకుల గురించి తెలుసుకునేందుకు.. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆమె ఎవరో.. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసేద్దాం.

సోనియా ఆకుల.. ఈ అమ్మడు ఎంట్రీతోనే ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీని పెంచేసింది. ఎందుకంటే ఈమె హౌస్ లోకి వెళ్లేముందు.. ఏకంగా రామ్ గోపాల్ వర్మ ఆల్ ది బెస్ట్ చెప్తున్న ఓ వీడియోను స్క్రీన్ మీద ప్లే చేశారు. మరి రామ్ గోపాల్ వర్మ విష్ చేశాడంటే.. కచ్చితంగా వెనుక ఎదో కథ ఉండే ఉంటుందని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ అమ్మడు బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే.. సోనియా సింగ్ స్వతహాగా తెలంగాణకు చెందిన అమ్మాయి. ఆమె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. తల్లి హోమ్ మేకర్, తండ్రి వ్యవసాయం.. ఆమె కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసి.. ఎల్‌ఎల్‌బి కూడా పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత ఆమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఆశా ఎన్కౌంటర్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. దానికంటే ముందు జార్జ్ రెడ్డి, కరోనా వైరస్ లాంటి సినిమాలలో కూడా ఈ అమ్మడు నటించింది. అయితే ఈ సినిమాల గురించి అంతగా బజ్ లేకపోవడంతో.. సోనియా గురించి పెద్దగా ఎవరికి తెలియలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత.. ఆర్జీవీ వీడియో రాగానే అందరికి ఫోకస్ ఒక్కసారిగా ఈ అమ్మడు వైపు మళ్లింది.

అయితే ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు.. ఓ మోడల్, అలాగే సమాజసేవకురాలు కూడా.. ఆమె విరాట్ ఫౌండేషన్ కు కో ఫౌండర్ గా ఉందట. దానితో పాటు యాక్షనీర్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ అనే పేరుతో ఓ ఎన్జీవో ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపింది. ఇక గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ పేరుతో ఇద్దరు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ప్రేక్షకులను బాగానే మెప్పించారు. సో ఈసారి సోనియాపై కూడా ప్రేక్షకులను బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి సోనియా ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.  ఇక ఈసారి హౌస్ లోకి జంటలుగా పంపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోనియా కు జంటగా.. ఆదిత్య ఓం ను పంపించారు. ఈసారి గేమ్ ఏ విధంగా ఉండబోతుంది.. ఎలాంటి రూల్స్ ఉండబోతాయి. ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ షో చూడాల్సిందే. నిన్న కేవలం ఎంట్రీ నే కాబట్టి బాగానే ఉంది. ఇక అసలు కథ ఈరోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Soniya Akula (@soniya_akula_official)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş