iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ని గెలిపించిన శివాజీ ఇప్పుడు ఎక్కడ? ప్రశ్నిస్తున్న నెటిజన్స్!

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అతడిని 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే గతంలో అతడిపై కోెపం వ్యక్తం చేసిన తోటి కంటెస్టెంట్లు, ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ..

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అతడిని 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే గతంలో అతడిపై కోెపం వ్యక్తం చేసిన తోటి కంటెస్టెంట్లు, ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ..

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ని గెలిపించిన  శివాజీ ఇప్పుడు ఎక్కడ? ప్రశ్నిస్తున్న నెటిజన్స్!

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా గెలిచిన పల్లవి ప్రశాంత్.. ఈ షోతో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. అంత అపవాదు మూటగట్టుకున్నాడు. అతడు హౌస్ నుండి బయటకు రాకముందే భారీ ఎత్తున ఫ్యాన్స్ అక్కడకు చేరుకుని నానా హంగామా సృష్టించాడు. బస్సులపై దాడి చేశారు. సెలబ్రిటీ వాహనాల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. రన్నరప్ అమర్ దీప్ ఫ్యామిలీ వెళుతున్న కారుపై విచక్షణా రహితంగా ఎటాక్ చేశారు. బందో బస్తుకు వచ్చిన పోలీసుల వాహనాల అద్దాలను పగులగొట్టారు. అంతేకాకుండా ర్యాలీ వద్దని పోలీసులు మాటలను బేఖాతరు చేసిన ప్రశాంత్.. అభిమానులతో ర్యాలీ చేపట్టారు. దీంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.

దీనింతటికీ కారణం పల్లవి ప్రశాంత్ అని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసి..అతడి కోసం రెండు రోజులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాను ఎక్కడికి పారిపోలేదని ఇంట్లోనే ఉన్నానని వీడియో విడుదల చేశాడు ప్రశాంత్. ఈ వీడియో బయటకు రావడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు.. గజ్వేల్‌లోని కొల్గుర్‌లోని పల్లవి ప్రశాంత్ ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. నగరానికి తరలించి.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. అతడితో పాటు సోదరుడు, మరికొంత మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని చంచల్ గూడకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే తొలుత పల్లవి ప్రశాంత్ చర్యను తప్పుపట్టిన తోటి, మాజీ కంటెస్టెంట్లు ఇప్పుడు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

where is shivaji

బిగ్ బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లిన సింగర్ భోలే..స్పందించి.. అతడు రైతు బిడ్డని, గెలిచానన్న ఆనందంలో ఉన్నాడు తప్ప.. లా అండ్ ఆర్డర్ గురించి తెలియదని చెప్పుకొచ్చాడు. అతడి  అరెస్టు కావడంతో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇక ఇతర కంటెస్టెంట్లు సోహైల్, అశ్విని..అతడు జైలు పాలు కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడికి మద్దతుగా నిలవండని కోరుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే..ఇప్పుడు అందరూ శివాజీ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అతడి గెలుపుకు తానే కారణమయ్యానన్న నటుడు శివాజీ.. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా, ఈ విషయం ఇంత రాద్దాంతం అయినా కనిపించలేదు సరికదా.. అతడికి మద్దుతు తెలిపేలా వీడియో కానీ,మేసేజ్ చేయడం కానీ లేకపోవడంతో తప్పుపడుతున్నారు. ఇటు ప్రశాంత్ సైతం.. తన విజయానికి శివాజీనే కారణమంటూ.. పలు ఇంటర్వ్యూల్లో అతడి గురించి గొప్పగా చెప్పాడు.

బిగ్ బాస్ హౌస్‌లో సపోర్టుగా నిలవడం కాదూ.. బయటకు వచ్చాక.. అతడు బాధలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన వ్యక్తి ఆచూకీ కనిపించకపోవడంతో నెటిజన్లు శివాజీ చర్య పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నంత సేపు పల్లవి ప్రశాంత్‌ని నా బిడ్డ నా బిడ్డ అన్న వ్యక్తి ఇప్పుడు ఇంత జరుగుతున్నా పత్తా లేకపోయేసరికి ఆందోళన చెందుతున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్. అతడిని గెలిచేందుకు తాను ఓడిపోయానని చెప్పుకున్న బిగ్ బాస్ మైండ్ గేమర్ .. పల్లవి ప్రశాంత్ కష్టాల్లో ఉన్నప్పుడు.. ఎందుకు సపోర్టు చేయడం లేదని, ముందుకు రావడం లేదంటూ మండిపడుతున్నారు. ‘పల్లవి ప్రశాంత్ మీద ఇంత జరుగుతుంది మీరు మాట్లాడలేదు ఏమి సార్.. చాలా ఘోరంగా వుంది సార్ మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్, అన్నా ప్రశాంత్ కోసం ఏదో ఒకటి చేయండి, ఎక్కడున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by actor sivaji(official account) (@actorsivaji)