Arjun Suravaram
Syed Sohel: బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్ దీప్ నిలిచారు. ఇదే సమయంలో అమర్ దీప్ ఫ్యామిలీపై జరిగిన దాడి ఘటన అందరికి తెలిసిందే. ఈ ఇష్యూపై నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ రియాక్ట్ అయ్యారు.
Syed Sohel: బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్ దీప్ నిలిచారు. ఇదే సమయంలో అమర్ దీప్ ఫ్యామిలీపై జరిగిన దాడి ఘటన అందరికి తెలిసిందే. ఈ ఇష్యూపై నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ రియాక్ట్ అయ్యారు.
Arjun Suravaram
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఎన్నో సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవలే సీజన్ 7ను కూడా పూర్తి చేసుకుంది. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఈ షో అంతా ఒకలా ఉంటే.. బయట మరో హంగామా జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు రోడ్లపై చేసిన రచ్చ దారుణంగా ఉంది. అంతేకాక ఈ సీజన్ రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కుటుంబంపై కూడా ప్రశాంత్ అభిమానులు దారుణంగా ప్రవర్తించారు. వారి కుటుంబాన్ని చుట్టు ముట్టి భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటనపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ స్పందించారు.
బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్ దీప్ నిలిచారు. ఇక బిగ్ బాస్ లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య ఓ మాటల యుద్ధమే జరిగింది. అలా జరిగిన కాసేపటికే తిరిగి కలిసిపోయేవారు. సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిపోయేవారు. ఇక ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించిన తరువాత వీరి అభిమానుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త అమర్ దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యలుతో అమర్ ఉన్నాడు. ఇలా ఉన్న సమయంలో దాడి చేయడంతోనే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ కూడా స్పందించారు.
ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్నాదం పనికి రాదన్నారు. అమర్ కారుపై దాడి చేసిన వాళ్లందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి చెత్త పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి అంటూ సూచించాడు. అభిమానం ముసుగులో ఇలా అమర్ పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్, ఆ ఘటన జరిగిన సమయంలో అమర్ తో పాటు అతడి తల్లి గారు, భార్య తేజు ఉన్నారుని సోహైల్ తెలిపారు. వారిని చుట్టుముట్టి కారు అద్దాలు పగలకొట్టి.. ఆ పై వారందరినీ నోటికి వచ్చిన బూతులతో తిట్టారు. ఇక మహిళలు అని చూడకుండా చెప్పలేని పదాలతో తిట్టారని సోహైల్ తెలిపారు.
అమర్ వాళ్ల భార్యను, అమ్మను అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటు ప్రశ్నించాడు. “నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఎదురైతే ఆ సమయంలో కారుతోనే తొక్కిం చేసేవాడిని తరువాత ఏదైతే అది జరగని, తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్యను, అమ్మను తన ముందే తిడితే ఎవడు సహించడు. కారుతో గుద్ది పారేస్తాడు. కానీ అమర్ సైలెంట్ గా వెళ్లిపోయాడు.” అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. మరి… అమర్ కి జరిగిన సంఘటన విషయంలో సోహైల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.