iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ గేమ్ పై సింగర్ ధామిని షాకింగ్ కామెంట్స్!

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ గేమ్ పై సింగర్ ధామిని షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా కొనసాగుతోంది. సోమవారం నామినేషన్స్ సో.. సో.. గా సాగిపోయాయి. ఈ వారం హౌస్ మేట్స్ సందీప్, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మీకు నాలుగువారాలు సమయం ఇచ్చాం.. కానీ, మీరు కంటెస్టెంట్స్ గానే ఉండిపోయారు. కాబట్టి ఈ వారం హౌస్ మేట్ ఎవరు అవుతారు అనే విషయాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు అంటూ షాకిచ్చాడు. ఇంక మూడోవారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సింగర్ ధామినీ ఇంట్లో ఉండే కంటెస్టెంట్స్ ఆట, వాళ్ల స్ట్రాటజీస్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

సింగర్ ధామినీ నిజానికి మూడో వారమే బయటకు వచ్చే కంటెస్టెంట్ కాదని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సింగర్ ధామినీ హౌస్ నుంచి మూడో వారమే బయటకు వచ్చింది. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన గేమ్, హౌస్ లో జరిగిన విషయాల గురించి తన అభిప్రాయాలు, తన అనుభవాల గురించి కామెంట్స్ చేసింది. బజ్ లో చెప్పని చాలా ఆసక్తికర విషయాలను నిఖిల్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూని తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఎందుకంటే ధామినీ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన చాలా విషయాలు గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. అలాగే కంటెస్టెంట్స్ హౌస్ లోనే కాకుండా.. బయట ఎలాంటి గేమ్ ఆడతారు అనే విషయాన్ని కూడా వెల్లడించింది.

సింగర్ ధామినీ మాట్లాడుతూ.. “కనీసం పదో వారం వరకు అయినా ఉంటాను అనుకున్నాను. ఇలా మూడో వారమే వచ్చేయడం కాస్త.. డిజప్పాయింట్ గా అనిపిచింది. అలాగే మరింత టాక్సిక్ అయ్యే ముందే వచ్చేశాను అని కూడా ఆనందంగా ఉంది. గ్రాఫ్ అయితే పెరిగిందనే చెప్తాను. నంబర్స్ పెరిగాయి. బయట 3 నెలల్లో వచ్చే ఫాలోయింగ్ ఇక్కడ ఇన్ స్టెంట్ గా 3 వారాల్లో.. వచ్చింది. హౌస్ లో ఉన్న వాళ్లకి గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసు. కావాలనే కెమెరాల కోసం అరుస్తున్నారు, లవ్ ట్రాక్స్ నడుపుతున్నారు. మరోసారి అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. కానీ, ఈసారి రీసెర్చ్ చేసి ప్రీపేర్డ్ గా వెళ్తాను. బిగ్ బాస్ అంటే లోపల ఆడాలి.. బయట కూడా ఆడాలి. బయట పీఆర్ ఏజెన్సీలు ఆడతాయి. జెన్యూన్ గా ఉండి గేమ్ ఆడితే ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకున్నాను.

ఫేక్ ని ఇట్టే కనిపెట్టేయచ్చు.. అలాగే జెన్యూన్ ని కూడా చూడగానే కనిపెట్టడం ఈజీ. నేను హౌస్ లో చాలా కంటెంట్ ఇచ్చాను.. కానీ, టెలికాస్ట్ కాలేదు. నా పాజిటివ్ సైడ్ ని చూపించలేదు. 24/7లో చూపించింది ఎపిసోడ్ లో లేదు. అమ్మవాళ్లు కాస్త స్ట్రెస్ అయ్యారు. ఎందుకు అమ్మాయి కనిపించడం లేదు అని బాధపడ్డారు. రెలిజియన్ కి సంబంధించి ఒకటి వచ్చింది. ఆ అబ్బాయి అంక్షింతలు వేశాడండీ అని. నిజానికి నేను దానికి ముందు అంత కోపంగా ఉన్నా అతను చక్కగా వినాయక చవితికి అక్షింతలు వేశాడండి.. చాలా మంచిగా అనిపించింది. ఐ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని చెప్పాను. దానికి ముందు.. వెనుక టెలికాస్ట్ చేయలేదు. ఆ ఒక్క ముక్కే వేశారు. అది చూసి నేను ఏదో నెగిటివ్ గా అనుకుని నాకు మెసేజ్ లు పెట్టడం, హేట్ కామెంట్స్, పెయిడ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. అమ్మానాన్న, అక్క, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు.

ఆడితే ఆడాను అంటారు.. ఆడకపోతే ఆడలేదు అంటారు. నెగిటివ్ గా పోట్రే అయ్యాను అనే చిన్న బాధ ఉంది. బయటకు రాగానే అమ్మకు ఫోన్ చేశాను. ఏడ్చాను.. అవతలి నుంచి అమ్మకూడా ఏడ్చింది. ఒక 45 సెకన్లు సైలెన్స్. ఎలిమినేట్ అవ్వగానే బజ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. అక్కడ నేను ఏదో తప్పు చేశాను, అసలు ఆడలేదు అంటూ క్వశ్చన్స్ వేస్తున్నారు. అన్నీ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు బయట ఏం జరుగుతోందో తెలీదు.. ఏంటి ఇలా అంటున్నారు అనుకున్నాను. బయటకు వచ్చి మా అమ్మని కలిసే వరకు అసలు ఏం జరిగిందో తెలియలేదు. ముఖ్యంగా నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. నేను యావర్ కి పేడ కొట్టింది చూపించారు. కానీ, తర్వాత నేను యావర్ తో మాట్లాడింది, సారీ చెప్పింది చూపించలేదు.

అలాగే ప్రాక్సీ ఓట్లు ఉన్నాయి. పీఆర్ ఏజెన్సీలో మంచి పిక్స్ తీసుకుని సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం, రీల్స్ చేయడం ఇవన్నీ టైర్ 1 మాత్రమే. కానీ, ఊళ్లకు వెళ్లి ఫోన్లు తీసుకుని ఓట్లు వేయడం, లక్షల్లో ఖర్చుపెడుతున్నారు. ఒక్కొక్కళ్లని 4, 5 పీఆర్ ఏజెన్సీ ఉన్నాయి. ఒక కంటెస్టెంట్ 4 ఏజెన్సీలు ఉన్నాయి. ఒకళ్లు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారు. ఒకళ్లు హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తారు. మండే నేను నామినేట్ అయ్యాయని తెలిసినప్పుడు ట్యూస్ డేకల్లా ఆ అమ్మాయి బయటకు వచ్చేస్తుందని ఎలా తెలుస్తుంది. శనివారం నేను ఎలిమినేట్ అవుతాను. కానీ, శుక్రవారం సాయంత్రానికి అమ్మవాళ్లకు న్యూస్ వచ్చింది.. నేను ఎలిమినేట్ అయ్యాను అని. అప్పటికీ ఇంకా ఓటింగ్ లైన్స్ ఆన్ లోనే ఉన్నాయి. వారానికి లక్షన్నర ఖర్చుపెడుతున్నారు. కానీ, హౌస్ లో మాత్రం నా దగ్గర డబ్బుల్లేవ్ అని సింపథీ కార్డ్స్ ప్లే చేస్తున్నారు” అంటూ సింగర్ ధామినీ చెప్పుకొచ్చింది. మరి.. సింగర్ ధామినీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.