iDreamPost
android-app
ios-app

వీడియో: అడ్డంగా బుక్కైన సందీప్.. వీడియో పెట్టి మరీ పరువు తీస్తున్నారు!

వీడియో: అడ్డంగా బుక్కైన సందీప్.. వీడియో పెట్టి మరీ పరువు తీస్తున్నారు!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం చేసినా కూడా చుట్టూ ఉన్న కెమెరాలు చూస్తూ ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్లు ఏదో సందర్భంలో కొన్ని మాటలు అనేసి.. తర్వాత మేము అనలేదు అంటే మాత్రం అడ్డంగా బుక్ అవుతారు. ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగితే హోస్ట్ నాగార్జున కూడా వీడియో ప్లే చేసి మరీ చూపిస్తారు. శనివారం రోజు దాదాపుగా ఎపిసోడ్ మొత్తం వీడియోలు ప్లే చేయడమే సరిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి వీడియోలతో క్లారిటీ ఇచ్చారు. కానీ, ఒక్క గౌతమ్ కి మాత్రం అన్యాయం చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హోస్టింగ్ కు ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా టేస్టీ తేజ విషయంలో నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. వీడియోలు ప్లే చేసి మరీ సందీప్, శివాజీలను కడిగిపారేశారు. ముఖ్యంగా సందీప్ వరస్ట్ సంచాలక్ అంటూ తేల్చేశారు. ఎందుకు అంతలా కొడుతున్నా కూడా స్పందించలేదు? ఎందుకు తేజాని ఆపలేదు అంటూ క్వశ్చన్ చేశారు. కంటెస్టెంట్స్ కూడా తేజాదే తప్పు అని తేల్చారు. అయితే సందీప్ ఆ ఒక్క విషయంలోనే కాదు.. గౌతమ్ విషయంలో కూడా చాలా బ్యాడ్ అయ్యాడు. ఏ హౌస్ మేట్ సంచాలక్ గా సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని అడగ్గా.. గౌతమ్ శివాజీ పేరు చెప్పాడు. ఎందుకు అంటే నేను, అమర్ గెలిచిన తర్వాత ఆయనకు అది నచ్చలేదు అని చెప్పినట్లు సందీప్ అన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు నాగార్జున అలాగే చెప్పారా? ఏం చెప్పారు అంటూ ప్రశ్నించారు.

సందీప్ ని ఇలా చెప్పావా అని అడగ్గా.. అందుకు సందీప్ నేను అలా చెప్పలేదు అని అంటాడు. తర్వాత నాగార్జున వీడియో కూడా ప్లే చేయించారు. దానిలో సందీప్ అలా అన్నట్లు లేదు. కానీ, గౌతమ్ చెప్పిన మాటకు ఆబియస్లీ అంటూ కామెంట్ చేశాడు. అంటే గౌతమ్ చెప్పిన మాటతో అతను ఏకీభవించాడు అని చూపించారు. కానీ, అసలు వీడియోని ఇప్పుడు ప్రేక్షకులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో సందీప్ ఇలా అంటాడు. “ఇప్పుడు కూడా హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ.. యూ కెన్ సీ. నేను ఆయన కూడా ఒక బ్యాంకర్ కాబట్టి.. పిలిచి నాకు చెప్పావా నువ్వు.. తీసేసి వాళ్లకు ఇచ్చేశావ్. పోతే నాకు రెస్పాన్సిబుల్ కాదంటాడు సింపుల్ గా. హీ ఈజ్ నాట్ కమింగ్” అంటూ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తూ ఈ మొత్తం విషయంలో తప్పు ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు.

సందీప్ ఆరోజు శివాజీ గురించి నెగిటివ్ గా మాట్లాడి.. నాగ్ సార్ అడిగినప్పు మాట్లాడలేదు అని చెప్పాడు. కావాలనే గౌతమ్ ని గజినీ అని పోట్రే చేయాలి అని చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ అంత ఈజీగా అబద్ధాలు చెబుతున్నాడు అంటున్నారు. అలాగే తేజ- గౌతమ్ విషయంలో తప్పు మొత్తం సందీప్ దే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చాలా సింపుల్ గా ఎలిమినేట్ చేసి బయటకు పంపేయండి అని అనడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. తేజ పవరాస్త్రం కొట్టేశాడని శివాజీకి చెప్పి.. అతడిని తిట్టించింది సందీపే కదా? తేజాని అవసరానికి వాడుకుంటూ ఇప్పుడు సింపుల్ గా పంపేయండి సార్ అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి.. గౌతమ్ విషయంలో సందీప్ నిజంగానే తప్పు చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş