Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రస్తుతం ఫినాలే అస్త్రా కోసం అంతా పోటీపడుతున్నారు. కానీ, శివాజీ మాత్రం అర్జున్ జపం చేస్తూ ఆటను గాలికివదిలేశాడు. రెండు రోజులుగా 5 నిమిషాల సమయం దొరికినా అర్జున్ గురించే మాట్లాడుతున్నాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రస్తుతం ఫినాలే అస్త్రా కోసం అంతా పోటీపడుతున్నారు. కానీ, శివాజీ మాత్రం అర్జున్ జపం చేస్తూ ఆటను గాలికివదిలేశాడు. రెండు రోజులుగా 5 నిమిషాల సమయం దొరికినా అర్జున్ గురించే మాట్లాడుతున్నాడు.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట భారీ ట్విస్టులతో దూసుకుపోతోంది. ఇన్నాళ్లు ఆడిన ఒకెత్తయితే ఇప్పుడు హౌస్ లో జరుగుతున్న ఆట ఒకెత్తని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండువారాల్లో వీళ్లు ఆడిన టాస్కులు, చేసిన తప్పులే వారిని ముందుకు తీసుకెళ్లాలా? ఇంటి నుంచి బయటకు పంపాలా? అనేది డిసైడ్ చేస్తుంది. ఇలాంటి తరుణంలో చాణుక్యుడు అని చెప్పుకునే శివాజీ మాత్రం ఆటను గాలికి వదిలేసి అర్జున్ జపం చేస్తున్నాడు. రెండు ఎపిసోడ్ల నుంచి అర్జున్ గురించే మాట్లాడుతున్నాడు. అది తప్పైనా.. ఒప్పైనా కూడా అర్జున్ పేరుని ప్రేక్షకుల్లోకి శివాజీ బాగా తీసుకెళ్తున్నాడు. అతనికి తెలియకుండానే అర్జున్ కు పీఆర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ వారం హౌస్ లో కెప్టెన్ లేడనే విషయం అందరికీ తెలిసిందే. అలా ఎందుకు జరిగిందంటే.. అర్జున్- అమర్ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాల్సి వచ్చేసరికి శోభా- శివాజీ సరైన సమయానికి నిర్ణయం తీసుకోలేకపోయారు. అందువల్ల ఈ వారం కెప్టెన్ ఎవరూ లేరని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ వారం కెప్టెన్ లేకుండా పోవడానికి శివాజీ కూడా కారణం అయ్యాడు. అయితే తాను చేస్తోంది మంచికే అనుకుని ముందుకు వెళ్లిన శివాజీకి పెద్ద షాక్ తగిలింది. ఎవరికైతే సపోర్ట్ చేశాడో.. ఆ అర్జున్ చివరికి శివాజీని నామినేట్ చేశాడు. అప్పటి నుంచి శివాజీ అర్జున్ జపం చేయడం ప్రారంభించాడు. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా కూడా అర్జున్ గురించే మాట్లాడుతున్నాడు.
అర్జున్ తన బుద్ధి చూపించాడు. అర్జున్ అలాంటి వాడని నేను అనుకోలేదు. అర్జున్ తనని తానే బ్యాడ్ చేసుకుంటున్నాడు. అర్జున్ కి స్టాండ్ తీసుకుంటే నన్నే నామినేట్ చేశాడు. ఇలా అర్జున్.. అర్జున్.. అర్జున్.. అంటూ సైన్మాలో డైలాగ్ లెక్క రీసౌండింగ్ ఇస్తున్నాడు. ఇది అర్జున్ కి నెగిటివ్ అవుతుందని భావించి చేస్తున్నాడు కావచ్చు. కానీ, ఇలాంటి టైమ్ లో ఒక కంటెస్టెంట్ పేరుని ప్రేక్షకుల మైండ్ లోకి ఇన్నిసార్లు ఎక్కించడం కరెక్ట్ కాదనే చెప్పాలి. తెలియకుండానే శివాజీ తనవంతు అర్జున్ కోసం పీఆర్ గా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే.. చాణుక్యుడు అని పేరు తెచ్చుకున్న శివాజీని బురిడీ కొట్టించాడు అంటే అర్జున్ ఎంత బాగా మైండ్ గేమ్ ఆడి ఉంటాడు? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అంటే అర్జున్.. శివాజీ కంటే ఎక్కువ టాలెంటెండ్ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అర్జున్ స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను శివాజీ గారే నాకు పోటీ అనుకుంటున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అలా చెప్పినట్లుగానే శివాజీని అర్జున్ టార్గెట్ చేశాడు అనే చెప్పాలి. అయితే అది తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా కూడా శివాజీ ఆట మాత్రం తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో అర్జున్ ని హైలెట్ చేస్తూ శివాజీ ఆడుతున్నాడు. పైగా ఫినాలే అస్త్ర టాస్కుల్లో అర్జున్ ఎంతో బాగా ఆడుతున్నాడు. ఇదంతా చూసిన అర్జున్ ఫ్యాన్స్.. చెప్పిమరీ శివాజీని అర్జున్ కొట్టాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హౌస్ లో పెద్ద దిక్కు, పెద్దవాడు, సీనియర్, చాణుక్యుడు అని పేర్లు తెచ్చుకున్న శివాజీని ఇలా దారి తప్పించడం అంటే మామూలు విషయం కాదు. మరి.. శివాజీ- అర్జున్ మధ్య జరుగుతున్న గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.