iDreamPost
android-app
ios-app

Big Boss 7: శివాజీకి కూతురు కూడా ఉంది.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సమీర్

  • Published Dec 15, 2023 | 6:50 PM Updated Updated Dec 15, 2023 | 6:50 PM

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ-శోభకి మధ్య తరుచు వివాదాలు, విమర్శలు జరుగుతూనే ఉన్నాయి . ఇలాంటి క్రమంలో.. ఇటీవల శోభా పై శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున ఫైర్ అయ్యారు. దీనిపై నటుడు సమీర్ మాట్లాడుతూ.. షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. అదేమిటంటే?

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ-శోభకి మధ్య తరుచు వివాదాలు, విమర్శలు జరుగుతూనే ఉన్నాయి . ఇలాంటి క్రమంలో.. ఇటీవల శోభా పై శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున ఫైర్ అయ్యారు. దీనిపై నటుడు సమీర్ మాట్లాడుతూ.. షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. అదేమిటంటే?

  • Published Dec 15, 2023 | 6:50 PMUpdated Dec 15, 2023 | 6:50 PM
Big Boss 7: శివాజీకి కూతురు కూడా ఉంది.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సమీర్

రసవత్తరంగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ విషయానికి వస్తే.. తరుచూ గొడవలు, నామినేషన్స్ చేసుకోవడం సహజం. వీరిలో అమర్-పల్లవి ప్రశాంత్, శివాజీ-శోభకి మధ్య అస్సలు పడదు. ఈ రెండు జోడీలు.. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శించుకోనే ఉంటారు. ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు శివాజీ మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మేట్‌‌గా.. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే శివాజీ ఇటీవల శోభా గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే శోభా పై శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాను నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ ఆయన గురించి కొన్ని రహస్యలను బయటపెట్టాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్, సీనియర్ నటుడు సమీర్.. శివాజీకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అయితే సమీర్.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు.. ఒక కూతురు కూడా ఉందని చెప్పారు. కానీ, శివాజీ ఇప్పటి వరకూ తనకి ఇద్దరు కొడుకులు మాత్రమే అన్ని దగ్గర చెప్పారు. ముఖ్యంగా బిగ్ బాస్‌ హౌజ్‌మేట్స్‌కి ఇలాగే చెప్పారు. అలాగే బిగ్ బాస్ షోలో తన ఇద్దరి కొడుకులతో పాటు భార్యని కూడా చూపించారు.  అయితే ఇన్నేళ్లుగా కూతురి కోసం ఎక్కడ చెప్పని శివాజీ రహస్యన్ని బయటపెట్టారు సమీర్. అతడికి ఓ కుమార్తె కూడా ఉందంటూ అందరికీ బిగ్  షాక్ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

 ‘‘నాగార్జునతో జరిగిన డిస్కషన్స్‌లో వాస్తవంగా శివాజీనే కరెక్ట్. ”మా ఇంట్లో ఇటువంటి ఆడపిల్ల ఉంటే పీకమీద కాలేసి తొక్కుతా” అన్న శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడాఉంది. నిజంగా శివాజీ పీకమీద కాలేసి తొక్కేవాడైతే ఇంట్లో వాళ్లపై అలా చేసేవాడు కదా. పీక మీద కాలేసి తొక్కేయడం అంటే.. తొక్కేస్తా అని కాదు, మందలించి కొడతా అని అర్ధం. శోభాశెట్టి బిహేవియర్‌ని పరాకాష్టకి చేరినప్పుడు ఆయన కంట్రోల్ తప్పి అన్న మాటే తప్పితే నిజంగా తొక్కేస్తాడని కాదు. ఆయనకి ఓ రేంజ్ లో కోపం రావడంతో అలా అన్నారు. అయితే ఇంత పెద్ద నేషనల్ షోలో శివాజీ ఆ మాట అనకపోతే బాగుండేది. శివాజీ కూడా తాను అన్న మాటలపై వివరణ ఇవ్వగా.. అది నాకు వాస్తవంగా అనిపించింది’ అని అన్నారు.

‘ఆడపిల్లల్ని పట్టుకుని అలా అనొచ్చా అని ఆడియన్స్ నుంచి ఒకామె అడిగింది. దానికి శివాజీ.. మగ పిల్లల్ని అయితే తొక్కేయొచ్చమ్మా అని అడిగారు. అది నిజమే కదా.. దానికి కూడా నాగార్జున గారు డైవర్ట్ చేస్తున్నాడని శివాజీపై కోప్పడ్డారు. చివరిగా ఆ ఇష్యూలో శివాజీ తప్పేం లేదు. కానీ, అక్కడ నాగార్జునని తప్పు పట్టలేం. ఎందుకంటే అది ఆయన అభిప్రాయం కాదు, బిగ్ బాస్ టీం ఎలా చెప్తే ఆయన అలా చేస్తారు. ఇందులో ఆయన వ్యక్తిగతం లేదు. ఆయన బిగ్ బాస్ హోస్ట్ కాబట్టి, బిగ్ బాస్ టీం చెప్పినట్టు చేయాలి’అంటూ చెప్పుకొచ్చారు సమీర్. అయితే  ఇన్నాళ్లు కొడుకులు గురించే ప్రస్తావించారు తప్పితే.. కుమార్తె గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఆమె గురించి అడిగిన దాఖలాలు లేవు. మరీ శివాజీ కూతురు ఉందని సమీర్ చెప్పడం వెనుక కథ ఏమై ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom