Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావర్ కి తలకెక్కింది.. 3 వారాలకే అంత అవసరమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. నాలుగోవారం నామినేషన్స్ ఎంతో ఉత్కంఠగా సాగాయి. ఒక్కొక్కళ్లు కొట్టుకున్నంత పని చేశారు. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కేకలు వేశారు. కోర్టు సెటప్ పెట్టడం, ఒకసారి నామినేట్ అయిన వాళ్లని మళ్లీ నామినేట్ చేయడానికి వీల్లేదు అనే కండీషన్ పెట్టడం, రీజన్స్ చెప్పిన తర్వాత జ్యూరీకి నచ్చితేనే నామినేట్ అవుతారు అనడంతో హౌస్ మేట్స్ బాగా ఇబ్బంది పడ్డారు. ఈవారం యావర్, శుభశ్రీ, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, తేజ, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారు అంటూ ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలు పెట్టేశారు.

తెలుగు ప్రేక్షకులకు ఎమోషన్స్ ఎక్కువ. ఈ విషయం ఇప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ప్రిన్స్ యావర్ తెలుగు వాడు కాదు.. తెలిసినవాడు అంతకంటే కాదు. కానీ, హౌస్ మొత్తం అతడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ యావర్ కు సపోర్ట్ గా నిలిచారు. అందుకే మూడు వారాలు నామినేషన్స్ నుంచి సేవ్ కూడా అయ్యాడు. ఇవన్నీ చూసి ప్రేక్షకులు తనవైపు ఉన్నారు, తనకు తిరుగులేదు అని యావర్ ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తున్నాడు. 3 వారాలు సేవ్ కాగానే కాస్త తలకు ఎక్కినట్లు కనిపిస్తోంది. అతని మాట, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా వరస్ట్ గా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. తన పరిస్థితులు వల్ల కోపం వస్తోంది అంటూ యావర్ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాం.

నామినేషన్స్ లో అతని ప్రవర్తన చూస్తే మాత్రం కావాలనే అలా బిహేవ్ చేసినట్లు అనిపించింది. గౌతమ్ చెప్పింది చాలా సిల్లీ రీజన్ అని అందరికీ తెలుసు. జ్యూరీ సభ్యులు యాక్సెప్ట్ కూడా చేయరని యావర్ కి తెలుసు. ఎందుకంటే జ్యూరీలో శివాజీ ఉన్నాడు. కాబట్టి యావర్ ని సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతను అలాగే ప్రవర్తించాడు కూడా. గౌతమ్ పాయింట్స్ చెబుతుంటే.. యావర్ కంటే ముందు శివాజీనే కౌంటర్ ఇస్తున్నాడు. అందుకే గౌతమ్ మీరు బయాస్డ్ బిహేవ్ చేస్తున్నారు. లాయర్ లాగా అతనివైపే మాట్లాడుతున్నారు అంటూ ముఖం మీద చెప్పేశాడు. ఇంక గౌతమ్ చెప్పిన పాయింట్స్ నచ్చకపోవడంతో ప్రిన్స్ యావర్ రెచ్చిపోయాడు. గౌతమ్ ని ఎగతాళి చేస్తూ ఇమిటేట్ చేశాడు. అక్కడితో ఆగకుండా గౌతమ్ మీదకు దూసుకెళ్లాడు. అసలు ఏంట్రా నువ్వు అంటూ రెచ్చిపోయాడు.

సందీప్, శివాజీ పిలుస్తున్నా కూడా లెక్క చేయలేదు. బోన్ లో ఉండి మాట్లాడు అంటే వాళ్ల మాటను ఖాతరు కూడా చేయలేదు. ఏం చెప్పినా బిగ్ బాస్ చూసుకుంటాడు అంటూ చెబుతున్నాడు. ఇదంతా చూస్తే ప్రిన్స్ యావర్ కు కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా ఎక్కువ అయ్యాయి అనిపిస్తోంది. అంతేకాకుండా అతను అలా కేకలు వేస్తేనే సేవ్ అవుతున్నాను అనుకుంటున్నాడు కావచ్చు. అందుకే అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. యావర్ దిసీస్ ఓవర్ అనే అభిప్రాయాలు వచ్చేలా చేస్తున్నాడు. అదే పాయింట్ ప్రేక్షకుల్లో నాటుకుంటే మాత్రం యావర్ ని కాపాడటం చాలా కష్టం. మళ్లీ వీడు మనవాడు కాదు కదా. అసలు మనం ఎందుకు వీడికి సపోర్ట్ చేయాలి? అనే ప్రశ్న ఒక్కసారి ప్రేక్షకుల మదిలో మెదిలితే.. ఆ నెక్ట్స్ వీకే యావర్ హౌస్ బయట ఉంటాడు. కాబట్టి యావర్ ప్రవర్తన మార్చుకుని కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని గేమ్ ఆడితే బాగుంటుంది. రాను రాను మరీ ఎక్కువ చేస్తున్నాడు. మరి.. ప్రిన్స్ యావర్ ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments