iDreamPost
android-app
ios-app

నన్ను అమ్మాయి వదిలేసిపోయింది! సోలో బాయ్ ఈవెంట్‌లో హీరో గౌతమ్!

  • Published Aug 24, 2024 | 8:48 PM Updated Updated Aug 24, 2024 | 8:48 PM

Gautham Krishna, Solo Boy Movie: తన లవర్‌ వదిలేసి వెళ్లిపోయిందంటూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గౌతమ్‌ కృష్ణ సంచలన కామెంట్స్‌ చేశాడు. తాను హీరో వస్తున్న సోలో బాయ్‌ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమంలో అతను ఈ కామెంట్స్‌ చేశాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

Gautham Krishna, Solo Boy Movie: తన లవర్‌ వదిలేసి వెళ్లిపోయిందంటూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గౌతమ్‌ కృష్ణ సంచలన కామెంట్స్‌ చేశాడు. తాను హీరో వస్తున్న సోలో బాయ్‌ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమంలో అతను ఈ కామెంట్స్‌ చేశాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 24, 2024 | 8:48 PMUpdated Aug 24, 2024 | 8:48 PM
నన్ను అమ్మాయి వదిలేసిపోయింది! సోలో బాయ్ ఈవెంట్‌లో  హీరో గౌతమ్!

తన లవర్‌ తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, హీరో గౌతమ్ కృష్ణ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అందుకు ఒక కారణం కూడా ఉన్నట్లు అతను తెలిపాడు. ప్రతి మనిషికి సక్సెస్‌ ఉండాలని.. సక్సెస్‌ లేకపోతే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. సోలో బాయ్‌ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా, పీ.నవీన్ కుమార్ దర్శకత్వంలో సోలో బాయ్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గౌతమ్‌ కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.

శనివారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘హుక్ స్టెప్ ఛాలెంజ్ చేసి మమ్మల్ని, టీంని ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తామని అన్నాడు. నాలో డాన్సర్ని బయటికి తీసుకొచ్చింది సందీప్ మాస్టర్. నీలో మంచి రిథమ్ ఉంది కొంచెం కష్టపడితే కచ్చితంగా మంచి డాన్సర్ అవుతావు అని చెప్పారు. టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు రాహుల్ సిప్లిగంజ్ అన్న పాట అద్భుతంగా పాడాడు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి హిట్టయి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మళ్లీ మీ ముందుకు వస్తాం. అదేవిధంగా నెగటివ్ ట్రోల్స్ చేసే అందరికీ ఒక ఫ్రెండ్ లా చెప్తున్నా మీ కెరీర్ మీద కాన్సెంట్రేట్ చేయండి. ఎందుకంటే.. సక్సెస్‌ లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు.. మనం ప్రేమించిన అమ్మాయిలు కూడా వదిలేస్తారు. నా లవర్ కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. కెరీర్‌పై ఫోకస్‌ చేసుకుంటూ.. నెగిటివ్ కామెంట్స్, నెగటివ్ ట్రోల్స్ ఆపుకోండి.’ అని గౌతమ్‌ కృష్ణ అన్నారు.

ఇక ఈ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమంలో సోల్‌ బాయ్‌ సినిమా డైరెక్టర్‌, నిర్మాత, హీరోయిన్‌ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటానన్నారు. ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా.. మంచి సినిమా వస్తే అందరు ఆదరిస్తారని, ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా అవుతుందని ఆయన అన్నారు. గౌతమ్ కృష్ణ భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడని అన్నారు. హీరోయిన్ శ్వేతా అవస్థి మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సతీష్ గారికి, డైరెక్టర్ నవీన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో ట్రోలింగ్‌పై గౌతమ్‌ కృష్ణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap